iDreamPost
android-app
ios-app

Ritika Sajdeh: రోహిత్ శర్మ భార్యపై ట్రోల్స్.. దెబ్బకు పోస్ట్ తొలగించిన రితిక!

రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే వివాదంలో చిక్కుకుంది. ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ పోస్ట్ వివాదానికి దారితీసింది. దాంతో ఆ పోస్ట్ ను దెబ్బకు డిలీట్ చేసింది. అసలేం జరిగిందంటే?

రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే వివాదంలో చిక్కుకుంది. ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ పోస్ట్ వివాదానికి దారితీసింది. దాంతో ఆ పోస్ట్ ను దెబ్బకు డిలీట్ చేసింది. అసలేం జరిగిందంటే?

Ritika Sajdeh: రోహిత్ శర్మ భార్యపై ట్రోల్స్.. దెబ్బకు పోస్ట్ తొలగించిన రితిక!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భార్య రితిక సజ్దే పై దారుణమైన ట్రోల్స్, విమర్శలు వస్తున్నాయి. ఆమె సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ వివాదానికి దారితీయడంతో.. నెటిజన్లు ఆమెపై భగ్గుమంటున్నారు. దాంతో రితిక షేర్ చేసిన సదరు పోస్ట్ ను వెంటనే డిలీట్ చేసింది. మరి ఇంతకీ రోహిత్ భార్య చేసిన పోస్ట్ ఏంటి? అంత పెద్ద వివాదానికి దారితీయడానికి కారణాలు ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే వివాదంలో చిక్కుకుంది. అసలేం జరిగిందంటే? పాలస్తీనా పౌరులపై ఇజ్రాయెల్ జరుపుతున్న దాడులపై భారత్ కు చెందిన ప్రముఖులు తీవ్రంగా స్పందిస్తున్నారు. పాలస్తీనా పౌరులకు మద్ధతుగా సోషల్ మీడియా వేదికగా గళమెత్తుతున్నారు. గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ చేస్తున్న మెరుపుదాడులు ప్రపంచాన్ని దిగ్బ్రాంతికి గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ భార్య సైతం ‘All Eyes On Rafah’ అని రాసి ఉన్న ఫొటోను తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. ఇదే ఇప్పుడు ఆమెను చిక్కుల్లో పడేసింది.

రితిక షేర్ చేసిన పోస్ట్ పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేరే దేశంలో జరుగుతున్న మారణహోమంపై పోస్ట్ పెట్టావ్.. మరి కశ్మీరీ పండిట్లు, మణిపూర్ లో చెలరేగిన హింసపై ఎప్పుడైనా మాట్లాడారా? దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి.. వాటిపై ఏనాడైనా స్పందించారా? కేవలం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయ్యే వాటిపై పోస్టులు పెడుతూ.. ట్రెండ్ ని ఫాలో అవుతూ ఇలాంటి పోస్ట్ లు పెట్టడం కరెక్ట్ కాదని విమర్శిస్తూ.. ప్రశ్నిస్తున్నారు. ఈ విమర్శల దెబ్బకి తాను పెట్టిన పోస్ట్ ను డిలీట్ చేసింది రితిక. రఫాలోని ఓ శరణార్థి శిబిరంపై ఇజ్రయెల్ చేసిన దాడిలో పిల్లలు, మహిళలు సహా 45 మరణించారు. ఈ ఘటన ప్రపంచాన్ని తీవ్రంగా కలిచివేసింది. రితిక పోస్ట్ పెట్టి.. డిలీట్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి