iDreamPost
android-app
ios-app

శుబ్‌మన్‌ గిల్‌ రాంగ్‌ షాట్‌! రోహిత్‌ శర్మను ఇలా ఎప్పుడూ చూసి ఉండరు!

  • Published Nov 19, 2023 | 3:03 PMUpdated Nov 19, 2023 | 3:03 PM

క్రికెట్‌ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసి వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ మొదలైపోయింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా చాలా ఆచీతూచీ ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. అయితే.. గిల్‌ అవుటైన తర్వాత.. రోహిత్‌ శర్మ ఇచ్చిన రియాక్షన్‌ వైరల్‌గా మారింది.

భారత్‌-ఆస్టేలియా మధ్య హోరాహోరీ ఫైనల్‌ మొదలైపోయింది. యావత్‌ క్రికెట్‌ లోకం మొత్తం​ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన వన్డే వరల్డ్‌ కప్‌ 2023 మెగా ఫైనల్‌ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్‌ స్టేడియంలో ప్రారంభమైంది. ఈ వరల్డ్‌ కప్‌ సమరం ఫైనల్‌లో టీమిండియా టాస్‌ ఓడిపోయి.. తొలుత బ్యాటింగ్‌ చేయాల్సి వచ్చింది. ఈ టోర్నీ మొత్తం ఆడుతున్న రీతిలోనే టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వేగంగానే ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. ఆసీస్‌ స్టార్‌ బౌలర్‌ జోస్‌ హేజల్‌వుడ్‌ను టార్గెట్‌ చేసి మరీ కొట్టాడు. మరో ఎండ్‌లో మిచెల్‌ స్టార్క్‌ను కాస్త రెస్పెక్ట్‌ చేస్తూ.. వుడ్‌ను టార్గెట్‌ చేసి ఆడాడు. ఒక వైపు రోహిత్‌ సూపర్‌గా ఆడుతుంటే.. మరో ఎండ్‌లో శుబ్‌మన్‌ గిల్‌ ఇబ్బంది పడ్డాడు. ఇదే క్రమంలో ఇన్నింగ్స్‌ 5వ ఓవర్‌లో టీమిండియా తొలి వికెట్‌ కోల్పోయింది. స్టార్క్‌ బౌలింగ్‌లో ​క్యాచ్‌ అవుట్‌ అయ్యాడు. స్టార్క్‌ వేసిన షార్ట్‌ ఆఫ్‌ లెంత్‌ డెలవరీని పుల్‌ షాట్‌ ఆడబోయి.. మిడ్‌ ఆన్‌లో ఆడమ్‌ జంపాకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

అయితే.. ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచి గిల్‌ కాస్త ఒత్తిడిలో ఉన్నట్లు కనిపించాడు. ఇబ్బంది పడుతూనే ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. స్టార్క్‌ బౌలింగ్‌లోనే ఓ సారి స్లిప్‌లో క్యాచ్‌ అవుట్‌ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. బాల్‌ ఫీల్డర్‌ వరకు క్యారీ కాకపోవడంతో బతికిపోయాడు. కానీ, ఆ తర్వాత ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలువలేకపోయాడు. అయితే.. గిల్‌ ఆడిన షాట్‌పై మరో ఎండ్‌లో ఉన్న రోహిత్‌ శర్మ చాలా అసహనంగా కనిపించాడు. అసలు అదేం షాట్‌ అన్నట్లు.. గిల్‌ వైపు కళ్లు ఉరిమిచూశాడు. తొలి వికెట్‌ పడకుండా.. పవర్‌ ప్లే కంప్లీట్‌ చేద్దామనుకున్న రోహిత్‌ ప్లాన్‌ను గిల్‌ సరిగా అమలు చేయలేకపోయాడు. గిల్‌ అవుటైన షాట్‌పై రోహిత్‌ శర్మ ఇచ్చిన రియాక్షన్‌ మాత్రం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మొత్తం మీద 7 బంతుల్లో కేవలం 4 పరుగులు మాత్రమే చేసి గిల్‌ అవుట్‌ అయ్యాడు. మరి ఈ మ్యాచ్‌లో గిల్‌ అవుటైన తీరుతో పాటు రోహిత్‌ శర్మ ఇచ్చిన రియాక్షన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి