iDreamPost

IND vs PAK: రోహిత్‌ ఖాతాలో అరుదైన మైల్‌స్టోన్‌!

IND vs PAK: రోహిత్‌ ఖాతాలో అరుదైన మైల్‌స్టోన్‌!

టీమిండియా కెప్టెన్, స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ అరుదైన రికార్డును నెలకొల్పాడు. వన్డే వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్తాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఆ ఘనతను సాధించాడు. ఈ మ్యాచ్ లో రౌత్ బౌలింగ్ లో భారీ సిక్స్ కొట్టిన హిట్ మ్యాన్ వన్డేల్లో 300 సిక్స్ లను పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో 300 సిక్స్ లు కొట్టి రోహిత్ శర్మ నయా రికార్డును సొంతం చేసుకున్నాడు. కాగా ఈ లిస్ట్ లో ఇప్పటి వరకు వన్డేల్లో షాహిద్ అఫ్రిది 351 సిక్స్ లతో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు.

విధ్వంసకర బ్యాటర్ క్రిస్ గేల్ 331 సిక్స్ లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ 301 సిక్స్ లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆ తర్వాత నాలుగో స్థానంలో సనత్ జయసూర్య 270 సిక్స్ లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా భారత్, పాక్ మధ్య హోరా హోరీగా మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా పాక్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పాక్ కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు.

ముందుగా పాక్ కు మంచి ఆరంభం దక్కినా ఆ తర్వాత సిరాజ్, బుమ్రా, కుల్దీప్ యాదవ్, హార్ధిక్ పాండ్య విజృంభించడంతో పాక్ పతనం మొదలైంది. వెంట వెంటనే వికెట్లను చేజార్చుకుంటూ పాక్ చతికిలపడింది. 42.5 ఓవర్లలో 191 పరుగులు చేసి పాకిస్తాన్ ఆలౌట్ అయ్యింది. అనంతరం 192 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ ఛేదనలో ఏ మాత్రం తడబడకుండా గెలుపు దిశగా పయనిస్తోంది. పాక్ ను చిత్తు చేసి మరోసారి విజయం సాధించే దిశగా టీమిండియా ఆటను కొనసాగిస్తోంది.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టీమిండియా 14 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి 109 పరుగులు చేసింది. ప్రస్తుతానికి క్రీజులో రోహిత్ శర్మ 61 పరుగులతో, శ్రేయస్ అయ్యర్ 15 పరుగులతో ఆటను కొనసాగిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి