iDreamPost

తిలక్‌ వర్మపై రోహిత్‌ ఆసక్తికర వ్యాఖ్య! వరల్డ్‌ కప్‌ టీమ్‌లోకి..

  • Published Aug 11, 2023 | 10:15 AMUpdated Aug 11, 2023 | 10:15 AM
  • Published Aug 11, 2023 | 10:15 AMUpdated Aug 11, 2023 | 10:15 AM
తిలక్‌ వర్మపై రోహిత్‌ ఆసక్తికర వ్యాఖ్య! వరల్డ్‌ కప్‌ టీమ్‌లోకి..

టీమిండియా యువ క్రికెటర్‌, తెలుగు తేజం తిలక్‌ వర్మపై భారత రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. తిలక్‌ వర్మలో ఎప్పుడూ పరుగులు చేయాలనే కసి ఉంటుందని అందుకే తిలక్‌ అంత బాగా ఆడుతున్నాడంటూ రోహిత్‌ పేర్కొన్నారు. తిలక్‌ తనతో ఎప్పుడు మాట్లాడినా.. భారీ షాట్లు ఆడాలి, దాని కోసం ఏం చేయాలో చాలా క్లారిటీతో ఉండే వాడని అన్నాడు. అలాగే తిలక్‌ ఎంతో పరిణతి చెందిన ఆటగాడిగా ఆడుతున్నా, భారత జట్టులో ఇంకా నాలుగో స్థానంలో ఎవరూ సెట్‌ కాలేదని అన్నాడు. కాగా, తిలక్‌ వర్మ ఐపీఎల్‌ 2022, 2023 సీజన్స్‌లో ముంబై ఇండియన్స్‌ తరఫున ఆడిన విషయం తెలిసిందే. ఆ రెండో సీజన్స్‌లో అద్భుతంగా రాణించడంతో అతనికి టీమిండియాలో చోటు దక్కింది.

ముంబై ఇండియన్స్‌కు రోహిత్‌ కెప్టెన్‌ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రోహిత్‌ కెప్టెన్సీలోనే ఆడి గుర్తింపు పొందిన తిలక్‌ వర్మ.. ఇప్పుడు టీమిండియాకు ఫ్యూచర్‌ స్టార్‌గా మారుతున్నాడు. కాగా, మరో రెండు నెలల్లో వన్డే వరల్డ్‌ కప్‌ జరగనున్న నేపథ్యంలో రోహిత్‌ చేసిన వ్యాఖ్యలు తిలక్‌ వర్మకు వరల్డ్‌కప్‌ టీమ్‌లో చోటు ఇచ్చేలా ఉన్నాయనే ప్రచారం జరుగుతుంది. భారత వన్డే జట్టులో నాలుగో స్థానంలో ఆడే బ్యాటర్‌ ఇంకా సెట్‌ కాలేదని, శ్రేయస్‌ అయ్యార్‌ ఆ స్థానంలో అద్భుతంగా ఆడుతున్నా.. అతను జట్టుకు దూరం అయ్యాడని రోహిత్‌ తెలిపాడు.

ప్రస్తుతం తిలక్‌ వర్మ టీ20 జట్టులో నాలుగో స్థానంలోనే ఆడుతున్నాడు. పైగా ఆడిన తొలి మూడు టీ20 మ్యాచ్‌ల్లోనూ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. తొలి మ్యాచ్‌లో 39, రెండో మ్యాచ్‌లో 51 పరుగులతో టీమిండియా తరఫున టాప్‌ స్కోరర్‌గా నిలిచిన తిలక్‌.. మూడో మ్యాచ్‌లోనూ 49 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. తాత్కాలిక కెప్టెన్‌ హార్దిక్ పాండ్యా కక్కుర్తితో తిలక్‌ హాఫ్‌ సెంచరీ మిస్‌ అయ్యాడు కానీ, లేకుంటే వరుసగా రెండో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకునే వాడు. కాగా, టీ20 సిరీస్‌లో తిలక్‌ వర్మ నిలకడైన బ్యాటింగ్‌, జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు పరిస్థితులకు తగ్గట్లు ఆడటంతో వన్డే జట్టులోనూ తిలక్‌ను ఆడించాలనే డిమాండ్‌ వచ్చింది. పైగా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గత రెండేళ్లుగా తిలక్‌ ఆటను చాలా దగ్గరగా చూడటం, ప్రస్తుతం చేసిన వ్యాఖ్యలతో తిలక్‌కు ఆసియా కప్‌ 2023 టోర్నీ కోసం ఎంపిక చేసే అవకాశం ఉంది. అందులో రాణిస్తే.. తిలక్‌ కచ్చితంగా వరల్డ్‌ కప్‌ టీమ్‌లో ఉండే అవకాశం ఉన్నట్లు క్రికెట్‌ నిపుణులు భావిస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ప్రపంచ క్రికెట్‌లో ఈ రికార్డ్‌ మరే క్రికెటర్‌కు లేదు! పృథ్వీ షా ఒక్కడే ఘనుడు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి