iDreamPost

Rishabh Pant: ధోని.. ధోని.. అని ఒకటే గోల! గదిలోకి వెళ్లి ఏడ్చేశా: రిషభ్‌ పంత్‌

  • Published Feb 02, 2024 | 3:25 PMUpdated Feb 02, 2024 | 3:25 PM

భారత దిగ్గజ మాజీ క్రికెటర్‌ ఎంఎస్‌ ధోనికి రిషభ్‌ పంత్‌ చాలా క్లోజ్‌. ఇద్దరు బయట చాలా పార్టీల్లో కలిసి కనిపిస్తూ ఉంటారు. అలాగే ధోని ఇంటికి కూడా పంత్‌ తరచూ వెళ్తూ ఉంటాడు. అయితే ధోని పేరు వల్ల తాను గదిలోకి వెళ్లి ఏడ్చానని పంత్‌ సంచలన విషయం బయటపెట్టాడు. అందేంటో ఇప్పుడు చూద్దాం..

భారత దిగ్గజ మాజీ క్రికెటర్‌ ఎంఎస్‌ ధోనికి రిషభ్‌ పంత్‌ చాలా క్లోజ్‌. ఇద్దరు బయట చాలా పార్టీల్లో కలిసి కనిపిస్తూ ఉంటారు. అలాగే ధోని ఇంటికి కూడా పంత్‌ తరచూ వెళ్తూ ఉంటాడు. అయితే ధోని పేరు వల్ల తాను గదిలోకి వెళ్లి ఏడ్చానని పంత్‌ సంచలన విషయం బయటపెట్టాడు. అందేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Feb 02, 2024 | 3:25 PMUpdated Feb 02, 2024 | 3:25 PM
Rishabh Pant: ధోని.. ధోని.. అని ఒకటే గోల! గదిలోకి వెళ్లి ఏడ్చేశా: రిషభ్‌ పంత్‌

టీమిండియా క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌ తిరిగి టీమిండియాలోకి వచ్చేందుకు శ్రమిస్తున్నాడు. 2022 డిసెంబర్‌లో కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పంత్‌.. పూర్తిగా కోలుకుని, ప్రస్తుతం నేషనల్‌ క్రికెట్‌ అకాడమీలో ఫిట్‌నెస్‌ సాధించే పనిలో ఉన్నాడు. ఈ ఏడాది జరిగే ఐపీఎల్‌ ఆడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే పంత్‌ ఒక ఇంటర్వూ ఇచ్చాడు. అందులో చాలా ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఒకనొక సందర్భంలో తాను గదిలోకి వెళ్లి ఏడ్చేశానని సంచలన విషయం వెల్లడించాడు. అది కూడా ధోని పేరు వల్ల అంటూ చెప్పుకోచ్చాడు. అదేంటి.. ధోని, పంత్‌ చాలా క్లోజ్‌గా ఉంటారు కదా? మరి ధోని పేరు విని పంత్‌ ఎందుకు గదిలోకి వెళ్లి ఏడ్చాడు అని అనుకుంటున్నారా? అసలు విషయం ఏంటంటే..?

రిషభ్‌ పంత్‌ ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌లోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. అగ్రెసివ్‌ బ్యాటింగ్‌, అద్భుతమైన వికెట్‌ కీపింగ్‌తో ధోని వారసుడంటూ అంతా మెచ్చుకున్నాడు. అయితే.. పంత్‌ సక్సెస్‌ఫుల్‌గా రన్స్‌ చేసినప్పుడు ఎవరైతే.. ధోని వారసుడంటూ మెచ్చుకున్నారో.. అతను విఫలమైనప్పుడు కూడా అదే రేంజ్‌లో విమర్శలు గుప్పించారు. ప్రతిసారి అతన్ని ధోనితో పోల్చుతూ.. విమర్శలు చేసేవారు. ధోని స్థానాన్ని భర్తీ చేసే సమర్ధుడంటూ ఒకసారి, ఇతనా ధోనిని రీప్లేస్‌ చేసేందంటూ మరో సారి.. సందర్భం ఏదైనా పాపం పంత్‌ బలి అయ్యేవాడు. ధోనితో కంప్యార్‌ చేస్తూ అతని వారసుడంటే బాగానే ఉంటుంది కానీ, విఫలమైనప్పుడు ధోని లాంటి దిగ్గజంతో పోల్చుతూ విమర్శిస్తే తట్టుకోవడం చాలా కష్టం.

అలాంటి పరిస్థితినే పంత్‌ ఎదుర్కొన్నాడు. ఒక మ్యాచ్‌లో పంత్‌ స్టంపింగ్‌ చేయడంలో విఫలమైతే.. మ్యాచ్‌ చూసేందుకు వచ్చిన క్రౌడ్‌ మొత్తం ధోని.. ధోని అంటూ అరవడం మొదలుపెట్టారు. ఆ టైమ్‌లో తాను చాలా బాధపడ్డానని, ధోనితో తనని కంప్యార్‌ చేసి విమర్శలు చేసిన టైమ్‌లో తాను గదిలోకి వెళ్లి ఏడ్చేవాడినని పంత్‌ వెల్లడించాడు. అసలు 500 మ్యాచ్‌లు ఆడిన దిగ్గజ క్రికెటర్‌తో ఐదు మ్యాచ్‌లు ఆడిన తనని ఎలా పోల్చుతారంటూ ప​ంత్‌ ప్రశ్నించాడు. అయితే.. ధోని భయ్యాతో తాను చాలా సన్నిహితంగా ఉంటానని, ప్రతి విషయం ధోనితో చెప్పుకుంటానని, నిజానికి ధోని భయ్యా వల్లే తాను ఈ స్థితిలో ఉన్నానంటూ పంత్‌ ఎమోషనల్‌ అయ్యాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి