iDreamPost

విరాట్ కోహ్లీ సరసన చేరిన రింకూ సింగ్! ఏ విషయంలో అంటే?

  • Author Soma Sekhar Updated - 02:59 PM, Wed - 29 November 23

టీమిండియా నయా సంచలనం రింకూ సింగ్ కింగ్ విరాట్ కోహ్లీ సాధించిన ఓ అరుదైన రికార్డును సమం చేసి అతడి సరసన చేరాడు. మరి ఆ ఘనత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

టీమిండియా నయా సంచలనం రింకూ సింగ్ కింగ్ విరాట్ కోహ్లీ సాధించిన ఓ అరుదైన రికార్డును సమం చేసి అతడి సరసన చేరాడు. మరి ఆ ఘనత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Author Soma Sekhar Updated - 02:59 PM, Wed - 29 November 23
విరాట్ కోహ్లీ సరసన చేరిన రింకూ సింగ్! ఏ విషయంలో అంటే?

రింకూ సింగ్.. ప్రస్తుతం టీమిండియా క్రికెట్ తో పాటుగా వరల్డ్ వైడ్ గా వినిపిస్తున్న పేరు. అంతలా రెచ్చిపోయి ఆడుతున్నాడు ఈ యంగ్ డైనమైట్. సెలెక్టర్లు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా ఆసీస్ తో జరుగుతున్న టీ20 సిరీస్ లో అదరగొడుతున్నాడు. ఫినిషర్ పాత్ర పోషిస్తూ.. జట్టు భారీ స్కోర్ చేయడానికి, అద్భుత విజయాలకి దోహదపడుతున్నాడు. తాజాగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్ లో దుమ్మురేపుతున్నాడు ఈ యువ కెరటం. తొలి మ్యాచ్ లో 14 బంతుల్లో 22 పరుగులు చేయగా.. రెండో మ్యాచ్ లో తన విశ్వరూపం చూపించాడు. కేవలం 9 బంతుల్లోనే 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 31 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ సాధించిన ఓ అరుదైన రికార్డును సమం చేశాడు. ఈ ఘనతతో కోహ్లీ సరసన చేరాడు రింకూ.

ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరుగుతున్న టీ20 సిరీస్ లో టీమిండియా ప్లేయర్లు దుమ్మురేపుతున్నారు. దీంతో 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భారత్ 2-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక సిరీస్ నిర్ణయాత్మకమైన మ్యాచ్ మంగళవారం (నవంబర్ 28) గుహవాటి వేదికగా జరగబోతోంది. ఇదిలా ఉండగా.. టీమిండియా యంగ్ ప్లేయర్ రింకూ సింగ్ మరో అరుదైన ఘనతను సాధించాడు. ఆసీస్ తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో రింకూ సింగ్ సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు.. ఆసీస్ బౌలర్లపై సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్ లో కేవలం 9 బంతుల్లోనే 4 ఫోర్లు, 2 సిక్సర్లతో అజేయంగా 31 పరుగులు చేశాడు.

ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును సమం చేశాడు ఈ యువ ఫినిషర్. ఓ టీ20 ఇన్నింగ్స్ లో 19వ లేదా 20వ ఓవర్లలో 30 అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన రెండో భారత బ్యాటర్ గా రికార్డుల్లోకి ఎక్కాడు. రింకూ కంటే ముందు విరాట్ కోహ్లీ ఈ ఘనత సాధించాడు. అయితే వీరిద్దరు రెండు సార్లు ఈ రికార్డు నెలకొల్పడం విశేషం. ఈ ఘనతతో తాజాగా కింగ్ విరాట్ కోహ్లీ సరసన చేరాడు ఈ యంగ్ డైనమైట్. మరి యువ ఫినిషర్ గా సత్తాచాటుతున్న రింకూ సింగ్ కింగ్ విరాట్ కోహ్లీ సరసన చేరడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి