iDreamPost

బ్రేకింగ్: కొడంగల్ లో విజయం సాధించిన రేవంత్ రెడ్డి

కొడంగల్ లో టీపీసీసీ చీఫ్ రెవంత్ రెడ్డి ఘన విజయం సాధించారు. తన ప్రత్యర్థి అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిపై 32,800 ఓట్ల భారీ తేడాతో విజయ ఢంకా మోగించారు.

కొడంగల్ లో టీపీసీసీ చీఫ్ రెవంత్ రెడ్డి ఘన విజయం సాధించారు. తన ప్రత్యర్థి అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిపై 32,800 ఓట్ల భారీ తేడాతో విజయ ఢంకా మోగించారు.

బ్రేకింగ్: కొడంగల్ లో విజయం సాధించిన రేవంత్ రెడ్డి

కొడంగల్ లో టీపీసీసీ చీఫ్ రెవంత్ రెడ్డి ఘన విజయం సాధించారు. తన ప్రత్యర్థి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిపై 32,800 ఓట్ల భారీ తేడాతో విజయ ఢంకా మోగించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నేతలు, అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. దీంతో పాటు టపాసులు పేల్చుతూ సంభరాలు జరుపుకుంటున్నారు. ఇప్పటికే తెలంగాణలో చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఇంతే కాకుండా రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మేజిక్ ఫిగర్ సైతం దాటేసి దూసుకుపోతోంది.

ఇకపోతే, ఇప్పటికే ఇల్లెందులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోరం కనకయ్య 35 వేల ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. దీంతో పాటు రామగుండం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్, బెల్లంపల్లిలో గడ్డం వినోద్ కుమార్, అంధోల్ లో దామోదర్ రాజనర్సింహ వంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించి ప్రత్యర్థి అభ్యర్థులకు షాకిచ్చారు. అయితే, వీళ్లంతా రౌండ్ రౌండ్ లో తమ అధిక్యాన్ని కనబరుస్తూ లీడ్ లో కొనసాగుతూ ఎట్టకేలకు విజయ ఢంకా మోగించారు. ఇక రాష్ట్రంలో చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపు దిశగా వెళ్తున్నారు.

అగ్ని కీలల్లో ఆహుతవుతూ తెలంగాణ ఆకాంక్షలను ఆకాశమంత ఎత్తున నిలిపిన అమరులకు జోహార్లు.

శ్రీకాంతచారి వర్ధంతి సందర్భంగా నివాళి అర్పిస్తూ… అమరుల ఆశయాలు, నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలు ఫలించే సమయం ఆసన్నమైంది.#Srikantachary #Telangana #Martyr pic.twitter.com/juCnioj70j
— Revanth Reddy (@revanth_anumula) December 3, 2023

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి