iDreamPost

ఫస్ట్ క్లాస్ AC బోగీలో.. శునకానికి టికెట్ బుక్ చేసిన ఇండియన్ ఆర్మీ!

Retired Army Dog: ఓ శునకానికి ఇండియన్ ఆర్మీ టికెట్ బుక్ చేసి మరీ.. ట్రైన్ జర్నీ చేయించారు. ట్రైన్ టికెట్ అంటే మాములుది కాదు.. ఫస్ట్ క్లాస్ ఏసీ భోగీలో ఆ శునకం ప్రయాణం చేసింది. మరి.. ఆ శునకాని అంతటి గౌరవం ఇవ్వడానికి కారణం ఏమిటంటే..

Retired Army Dog: ఓ శునకానికి ఇండియన్ ఆర్మీ టికెట్ బుక్ చేసి మరీ.. ట్రైన్ జర్నీ చేయించారు. ట్రైన్ టికెట్ అంటే మాములుది కాదు.. ఫస్ట్ క్లాస్ ఏసీ భోగీలో ఆ శునకం ప్రయాణం చేసింది. మరి.. ఆ శునకాని అంతటి గౌరవం ఇవ్వడానికి కారణం ఏమిటంటే..

ఫస్ట్ క్లాస్ AC బోగీలో.. శునకానికి టికెట్ బుక్ చేసిన ఇండియన్ ఆర్మీ!

దేశం కోసం ఎంతో మంది సైనికులు తమ ప్రాణాలను ఫణంగా పెడుతుంటారు. అలానే వారికి విధుల్లో కొన్ని రకాల శునకాలు సహాయ పడుతుంటాయి. ఇక ఉగ్రవాదులను పట్టుకునే క్రమంలో కొన్ని శునకాలు ప్రాణాలను సైతం కోల్పోతుంటాయి. మరికొన్ని తమ విధులు నిర్వహించి చివరకు రిటైర్ మెంట్ తీసుకుంటాయి. తాజాగా ఈ క్రమంలో వాటికి ప్రత్యేక సౌకర్యాలను ఆర్మీ అధికారులు, కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది. తాజాగా ఓ రిటైర్డ్ సైనిక శునకం కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫస్ట్ క్లాస్ ఏసీ రైలు భోగీల్లో ప్రయాణం చేసింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

మెరూ అనే తొమ్మిదేళ్ల సైనిక శునకం ఆర్మీలో చాలా కాలం విధులు నిర్వహించింది. ఇటీవలే రిటైర్డ్ అయింది. ఈ క్రమంలోనే సైన్యం దానికి సగౌరవంగా రిటైర్మంట్ అందించారు. రైల్లోని ఫస్ట్ క్లాస్ ఏసీ బోగీలో ఈ మేరూ అనే శునకం ప్రయాణించింది. మెరూ తన బెర్త్ పై దర్జాగా దుప్పటి కప్పుకొని కనిపించింది. ఏసీ చల్లదనాన్ని ఆస్వాదిస్తూ హాయిగా కునుకు తీసింది. ప్రస్తుతం మెరూకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారాయి.

లాబ్రడార్ రిట్రీవర్ జాతికి చెందిన మెరూ 22 ఆర్మీ డాగ్ యూనిట్ లో ట్రాకర్ డాగ్ గా పనిచేసింది. ప్రాణాంతక పేలుడు పదార్థాల జాడ పసిగట్టడం, ఉగ్రవాదుల ఆచూకీ కనిపెట్టడం లాంటి విధులు నిర్వహించింది. తొమ్మిదేళ్ల సర్వీసు అనంతరం ఇటీవలే రిటైర్డ్  అయ్యింది. దీంతో ఈ శునకాన్ని మీరట్ లోని సైనిక శునకాల రిటైర్మెంట్ కేంద్రానికి ఇండియన ఆర్మీ తరలించింది. అక్కడ ఈ మేరు శునకం శేషజీవితాన్ని ప్రశాంతంగా గడపనుంది. ఈ క్రమంలోనే ఇండియన్ ఆర్మీ.. ఈ సైనిక శునకానికి ఫస్ట్ క్లాస్ ఏసీ బోగీలో టికెట్ బుక్ చేసి.. దానికి గౌరవం కల్పించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను అశోక్ బిజల్వాన్ అనే రిటైర్డ్ నౌకాదళ ఉద్యోగి సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు.

అయితే ఈ శునకం ఎక్కడ రైలు ఎక్కిందో మాత్రం వెల్లడించలేదు. సైనిక శునకాలు రిటైరయ్యాక వాటి శిక్షకులతో కలసి ఫస్ట్ క్లాస్ ఏసీ రైళ్లలో ప్రయాణించేందుకు కేంద్రం ఇటీవల అనుమతి ఇచ్చింది. దీంతో యూపీలోని మీరట్ లో ఉన్న ఆ కేంద్రానికి మెరూను తరలించేందుకు సైన్యం.. ఆ శునకం పేరుతో ఫస్ట్ క్లాస్ ఏసీ బోగీలో బెర్త్ బుక్ చేసింది. ప్రస్తుతం మేరూ ట్రైన్ లో ప్రయాణిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. ఈ ఫొటోలను చూసిన నెటిజన్ అందరూ కేంద్ర ప్రభుత్వం, రక్షణ మంత్రిత్వ శాఖపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అలానే తన ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి విధులు నిర్వహించిన మెరూకు సెల్యూట్ చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి