iDreamPost

TS RTC బస్సుల్లో పురుషులకు రిజర్వుడ్ సీట్లు? ఎన్నంటే..!

తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. ముఖ్యంగా మహిళకు ఫ్రీ జర్నీ నిర్ణయం తీసుకుని అందరని ఆశ్చర్యానికి గురి చేశారు. తాజాగా పురుషులకు బస్సుల్లో రిజర్వుడ్ సీట్లు కేటాయించాలనే ఆలోచనలో ఆర్టీసీ ఉన్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. ముఖ్యంగా మహిళకు ఫ్రీ జర్నీ నిర్ణయం తీసుకుని అందరని ఆశ్చర్యానికి గురి చేశారు. తాజాగా పురుషులకు బస్సుల్లో రిజర్వుడ్ సీట్లు కేటాయించాలనే ఆలోచనలో ఆర్టీసీ ఉన్నట్లు తెలుస్తోంది.

TS RTC బస్సుల్లో పురుషులకు రిజర్వుడ్ సీట్లు? ఎన్నంటే..!

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం పేరుతో  మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చెయోచ్చు. ఈ స్కీమ్ కి మహిళల నుంచి భారీ స్పందన వస్తుంది. ఇలా కాంగ్రెస్ తీసుకొచ్చిన ఉచిత బస్సు  ప్రయాణం స్కీమ్ అధికారంలోకి  రావడానికి ఉపయోగపడింది. కానీ, ఇప్పుడు ఆర్టీసీకి చుక్కలు చూపిస్తోందనే అభిప్రాయాలు వినిపిస్తోన్నాయి. రోజు రోజుకు బస్సులో మహిళ సంఖ్య పెరుగుతోంది. దీంతో టికెట్ తీసుకున్న పురుషులు సీట్లు దొరక్కపోడవంతో అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే  సోషల్ మీడియాలో ఓ టాక్ వినిపిస్తోంది. పురుషులకు రిజర్వుడ్ సీట్లు ఇచ్చే అంశాన్ని ఆర్టీసీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. ముఖ్యంగా మహిళకు ఫ్రీ జర్నీ, ఆరోగ్యశ్రీ చికిత్స పెంపు వంటి నిర్ణయాలు తీసుకుంది. అలానే గ్యాస్ ను రూ.500 ఇస్తామని చెప్పిన హామీ అమలకు చర్యలు తీసుకుంటుంది. ఈ విషయాలు పక్కన పెడితే.. ఆర్టీసీ  బస్సులో మహిళకు ఉచిత ప్రయాణంపై ఊహించిన విధంగా స్పందన వస్తుంది. ఏ ఆర్టీసీ బస్సు చూసిన మహిళలే ఎక్కువ సంఖ్యలో కనిపిస్తున్నారు.

ఇటీవలే జీరో టికెట్ ను కూడా ఆర్టీసీ అమలు చేస్తోంది. ఇలా రోజు రోజుకూ ఆర్టీసీ బస్సులో ఆడవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. దీంతో టికెట్ తీసుకుని ప్రయాణిస్తున్న మగవారికి సీట్లు దొరకడం లేదు. దీంతో వారు పెద్ద ఎత్తునా అసంతృప్తి  వ్యక్తం చేస్తున్నారు. ఉచితంగా ఎక్కే వారికి సీట్లు దొరుకుతున్నాయి కానీ.. డబ్బులు ఇచ్చి ప్రయాణిస్తున్న తమకు మాత్రం దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక… పురుషులకు కూడా ప్రత్యేక సీట్లను కేటాయించాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.

ఇదే సమయంలో  మహిళల తరహాలోనే పురుషులకు సీట్లు రిజర్వ్ చేస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని ఆర్టీసీ అధికారులు ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. ఇందుకోసం ప్రతి బస్సులోనూ మొత్తం 55 సీట్లలో 20 సీట్లు పురుషులకు రిజర్వ్ చేస్తే ఎలా ఉంటుందనే  అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఈ మేరకు అన్ని డిపోల నుంచి అధికారులు సమాచారం, అభిప్రాయాలను కోరినట్లు తెలుస్తోంది.  ముఖ్యంగా డిపో మేనేజర్ల అభిప్రాయాలను ఉన్నతాధికారులు సేకరిస్తున్నారు. ఈ సమాచారం అంతా  వారి వద్దకు చేరాక పురుషులకు సీట్లు రిజర్వుడు చేసే అంశంపై నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం.

మరోవైపు ఆర్టీసీ బస్సులో మగవారికి ప్రత్యేక సీట్లు కేటాయిస్తే.. వ్యతిరేకత రావచ్చనే ఆందోళన కూడా అధికారుల్లో వ్యక్తమవుతోంది. కారణం.. దేశంలో ఇప్పటి వరకూ మహిళలకే తప్ప పురుషులకు ఇలా ప్రత్యేకంగా సీట్లు కేటాయించిన దాఖలాలు లేవు. అటు టిక్కెట్ కొన్న తమకు సీట్లు లేకపోతే ఎలా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఆర్టీసీ బస్సుల్లో పురుషులకు, స్రీలకు మధ్య వాగ్వాదం జరిగే అవకాశాలు ఉన్నాయని పలువురు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అందుకనే ఏదో  ఒక నిర్ణయం తీసుకోవాలని ఆర్టీసీ అధికారులు, ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి.. ఇలా మగవారి కోసం సీట్లు కేటాయించాలనే డిమాండ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి