iDreamPost

కడుపు నింపుకోవడానికి కుమార్తెలను వ్యభిచార ఊబిలోకి నెడుతున్న తల్లులు

కడుపు నింపుకోవడానికి కుమార్తెలను వ్యభిచార ఊబిలోకి నెడుతున్న తల్లులు

చాలా కాలంగా తూర్పు ఆఫ్రికా దేశం కెన్యా ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతుంది. పుండు మీద పుట్రలా అంతర్జాతీయంగా పెరిగిన నిత్యావసరాల ధరలు అక్కడ ప్రజలకు పెను భారంగా మారాయి. ఈ ప్రభావంతో అక్కడి ధరలు కొండెనెక్కి కూర్చున్నాయి. ద్రవ్యోల్బణంతో ఏం కొనలేని, తినలేని దారుణమైన పరిస్థితులను చవిచూస్తున్నారు. పిల్లలకు కడుపు నిండా తిండి పెట్టలేని స్థితికి చేరుకున్నారు తల్లిదండ్రులు. నిత్యావసర ధరలతో పాటు పన్నుల భారం కూడా వీరిని వేధిస్తుంది. దీంతో అక్కడి ప్రజల్లో నిరాశ, నిసృహలు పెరిగిపోతున్నాయి. బతకలేని పరిస్థితుల కారణంగా అక్కడి బాలలు లైంగిక దోపిడీకి, నేరాల్లోకి బలవంతంగా నెట్టబడుతున్నారు. కార్మికులుగా మారిపోతున్నారు. తల్లులే తమ పిల్లల్ని సెక్స్ వర్కర్లుగా మార్చేస్తున్న జుగుప్సాకరమైన పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. ఆర్థిక కష్టాల్ని తట్టుకోలేక బాలికల్ని వ్యభిచార ఊబిలోకి పంపిస్తున్నారు.

అంతర్జాతీయ కార్మిక సంస్థ డైరెక్టర్ జనరల్ తెలిపిన వివరాల ప్రకారం.. పెరిగిన నిత్యావసర ధరలతో పిలల్ని పెంచిపోషించ లేక కెన్యా తీర ప్రాంత నగరం మొంబసాలో కుమార్తెలను వ్యభిచారంలోకి నెడుతున్నారు తల్లులు. ఇక్కడ అల్పాదాయ కుటుంబాలు బతకడం కష్టంగా మారింది. ఆర్థిక సవాళ్లు ఆ కష్టాల్ని మరింత తీవ్రతరం చేసేలా చేస్తున్నాయి. నిరుద్యోగం పెరిగిపోయి, సరైన పని లేక, డబ్బులు లేక, నిత్యావసర వస్తువులు కొనలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పిల్లల్ని పెంచి పోషించుకునేందుకు ఆర్థిక స్తోమత సరిపోవడం లేదు. దీంతో పిల్లల పోషణార్థం ముక్కుపచ్చలారని బాలికల్ని.. ఇష్టం లేకపోయినా.. వ్యభిచార ఊబిలోకి పంపిస్తున్నారు. తమతో పాటు కుటుంబానికి తిండి గింజలు అందించేందుకు మనస్సు చంపుకుని బడులకు వెళ్లే ఆడ పిల్లలు ఇక్కడ వ్యభిచార గృహాలకు క్యూ కడుతున్నారు.

అధిక ధరలు, అధిక పన్నులతో మేం అలసిపోయాం అని మొంబసా ప్రజలు నిరసనలు చేపడుతుంటే.. ఆదుకోవాల్సిన ప్రభుత్వం వీరిపై దాడులకు పాల్పడుతోంది. గతం కంటే ఇక్కడ పరిస్థితులు మరింత దారుణంగా మారాయి. దీంతో పిల్లల పోషణ నిమిత్తం.. మైనర్ బాలికను సెక్స్ వర్కర్లుగా మారుస్తున్నారు తల్లిదండ్రులు. ఇక్కడ వ్యభిచార గృహాలకు చేరుకుంటున్న వారి సంఖ్య నానాటికి పెరిగిపోతుంది.  అయితే దీన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. బాలికల్ని అదుపులోకి తీసుకుని సంరక్షణ కేంద్రాలకు తరలిస్తుంది. అయితే నానాటికి పెరుగుతున్న వీరి సంఖ్యతో వీరి పోషణ ప్రభుత్వానికి కూడా సవాలుగా మారింది. చివరకు ఆ నగరం చైల్డ్ సెక్స్ టూరిజంగా పేరుపడిపోయింది. కరోనా తరువాత పరిస్థితుల్లో ఇప్పుడు ఈ వ్యాపారాన్ని ఆన్ లైన్‌లో నిర్వహిస్తున్నారు. దీంతో మరింత మంది బాలలు ఇందులో భాగస్వామ్యం అవుతున్నారు. అక్రమ చైల్డ్ ట్రాఫికింగ్, పిల్లలతో వ్యభిచారం ఇప్పుడు కెన్యాకు పెద్ద తలనొప్పిగా మారింది. దీనిపై దృష్టిసారిస్తున్నారు కెన్యా పోలీసులు. అమెరికాలోని ఓ డేటా బేస్ సెంటర్ ఇచ్చే సమాచారంతో అనుమానితుల్ని పట్టుకుంటున్నారు. పిల్లల అసభ్య చిత్రాలున్నాయోమోనని ఫోన్లు, కంప్యూటర్లు తనిఖీ చేస్తున్నారు. జీవన వ్యయం పెరగడంతోనే ఇక్కడ బాలికలు సెక్స్ వర్కర్లుగా మారుతున్నారని తెలుస్తోంది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి