iDreamPost

IPL తొలి మ్యాచ్ లోనే కోహ్లీ రెండు రికార్డులు! ఇండియా నుండి ఒకే ఒక్క మగాడు!

Virat Kohli Records: ఐపీఎల్-2024 తొలి మ్యాచ్ లోనే కోహ్లీ రికార్డ్స్ ఖాతా తెరిచాడు. చేసింది తక్కువ పరుగులే అయినా.. తన పేరుపై రెండు రేర్ రికార్డ్స్ క్రియేట్ చేసుకుని చరిత్ర సృష్టించాడు.

Virat Kohli Records: ఐపీఎల్-2024 తొలి మ్యాచ్ లోనే కోహ్లీ రికార్డ్స్ ఖాతా తెరిచాడు. చేసింది తక్కువ పరుగులే అయినా.. తన పేరుపై రెండు రేర్ రికార్డ్స్ క్రియేట్ చేసుకుని చరిత్ర సృష్టించాడు.

IPL తొలి మ్యాచ్ లోనే కోహ్లీ రెండు రికార్డులు! ఇండియా నుండి ఒకే ఒక్క మగాడు!

విరాట్ కోహ్లీ.. పరిచయం అవసరం లేని పేరు. క్రికెట్ లో రికార్డ్స్ రారాజు. క్రికెట్ దేవుడిగా చెప్పుకునే సచిన్ రికార్డ్స్ సైతం బ్రేక్ చేసిన ఒకే ఒక్క బ్యాటర్ విరాట్. ఇప్పటికే ఇంటర్నేషనల్ క్రికెట్ లో కోహ్లీకి అన్నీ రికార్డ్స్ దాసోహం అనేశాయి. ఇప్పుడు ఐపీఎల్ లో కూడా కింగ్ హవా కొనసాగుతోంది. ఐపీఎల్-2024 సీజన్ లో కోహ్లీ తొలి మ్యాచ్ లోనే రెండు అరుదైన రికార్డ్స్ నెలకొల్పి తన సత్తా చాటాడు కోహ్లీ. చెపాక్ వేదికగా చెన్నై-ఆర్సీబీ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో కోహ్లీ మొత్తం 20 బంతులను ఎదుర్కొని 21 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సిక్స్ కూడా ఉంది. అయితే.. ఇంత తక్కవ పరుగులు చేసినా.. రెండు అరుదైన రికార్డ్స్ తన ఖాతాలో వేసుకున్నాడు కోహ్లీ. మరి ఆ రికార్డ్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం.

చెన్నై మ్యాచ్ లో కోహ్లీ 6 వ్యక్తిగత  పరుగులు చేశాక.. టీ-20 క్రికెట్ లో 12000 పరుగులు పూర్తి చేసిన 6వ ప్లేయర్ గా అవతరించాడు. ఇప్పటి వరకు క్రిస్ గేల్, షోయబ్ మాలిక్, పోలార్డ్, వార్నర్, హేల్స్ మాత్రమే ఈ ఘనత సొంతం చేసుకున్నారు. ఈ లిస్ట్ లో స్థానం సాధించిన ఏకైక భారతీయుడు కోహ్లీ మాత్రమే కావడం గమనార్హం. అయితే.., వీరందరితో పోలిస్తే కోహ్లీ యావరేజ్ చాలా అధికంగా ఉండటం విశేషం. 12000 పరుగులు సాధించిన మిగతా క్రికెటర్స్ అంతా ప్రపంచం నలుమూలలా జరిగే టీ-20  లీగ్స్ లో పాల్గొనేవారే. ఒక్క కోహ్లీ మాత్రమే సొంత దేశం, సొంత లీగ్ దాటకుండా ఇన్ని పరుగులు సాధించడం విశేషం. ఇక ఇదే మ్యాచ్ లో కోహ్లీ మరో రికార్డ్ సైతం అందుకున్నాడు. బలమైన చెన్నై జట్టుపై 1000 పరుగులు పూర్తి చేసిన రెండో బ్యాట్సమెన్ గా రికార్డు సాధించాడు.

ఇన్నాళ్లు ధోని కెప్టెన్ గా ఉంటూ వచ్చిన చెన్నై పరుగులు సాధించడం అంత సులభం కాదు. కోహ్లీ కన్నా ముందు ఒక్క శిఖర్ ధావన్ మాత్రమే చెన్నై సూపర్ కింగ్స్ పై 1000 పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డ్ సాధించి ఉన్నాడు. ఇప్పుడు కోహ్లీ కాస్త గబ్బర్ సరసన వచ్చి చేరాడు. అయితే.. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఇన్ని రికార్డ్స్ సాధించినా.. బెంగుళూరు టాప్ ఆర్డర్ మాత్రం పేకమేడలా కూలిపోయింది. ఒక్క ఫాఫ్ డు ప్లెసిస్,  కోహ్లీ మినహా మిగతా టాప్ ఆర్డర్ అంతా ప్రభావం చూపించలేకపోయింది. ముఖ్యంగా మ్యాక్సీ గోల్డెన్ డక్ స్కోర్ బోర్డుపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. మరి.. వచ్చే మ్యాచ్ ల్లో అయినా బెంగుళూరు బ్యాటర్స్ సత్తా చాటుతారేమో చూడాలి. మరి.. తొలి మ్యాచ్ లోనే రెండు రికార్ట్డ్స్ సొంతం చేసుకున్న కోహ్లీ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి