iDreamPost

క్రెడిట్ కార్డులపై RBI సంచలన నిర్ణయం! ఇది ప్రజలకి మంచిదే!

RBI is Focus On Using Credit Cards: నేటికాలంలో క్రెడిట్ కార్డుల వినియోగం బాగా పెరిగింది. ప్రతి కొనుగోలు కోసం క్రెడిట్ కార్డునే వినియోగిస్తున్నారు. ఈ క్రమంలోనే కార్డుల వినియోగంపై సంచలన నిర్ణయం తీసుకుంది రిజర్వు బ్యాంక్.

RBI is Focus On Using Credit Cards: నేటికాలంలో క్రెడిట్ కార్డుల వినియోగం బాగా పెరిగింది. ప్రతి కొనుగోలు కోసం క్రెడిట్ కార్డునే వినియోగిస్తున్నారు. ఈ క్రమంలోనే కార్డుల వినియోగంపై సంచలన నిర్ణయం తీసుకుంది రిజర్వు బ్యాంక్.

క్రెడిట్ కార్డులపై RBI సంచలన నిర్ణయం! ఇది ప్రజలకి మంచిదే!

ఒకప్పుడు డబ్బులు అనేవి చేతుల ద్వారా మార్పిడి ఎక్కువ జరిగేది. అంతేకాక సమాజంలో లిక్విడ్ క్యాష్
ఎక్కువ చలమాణి అయ్యేది. కాలం మార్పుతో పాటు ఆర్థిక వ్యవస్థలో అనేక మార్పులు వచ్చాయి. నగదు వినియోగం కోసం అనేక రకలా కార్డులు అందుబాటులోకి వచ్చాయి. అలాంటి వాటిల్లో డెబిట్, క్రెడిట్ కార్డులు ప్రధానమైనవని. అలానే ఇటీవల కాలంలో క్రెడిట్ కార్డుల వినియోగం బాగా పెరిగిపోయింది. వస్తువులను కొనటం నుంచి చెల్లింపులకు అవకాశం ఉన్న ప్రతిచోట క్రెడిట్ కార్డులను ఎక్కువ మంది వినియోగిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డులపై కీలక నిర్ణయం తీసుకుంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

నేటికాలంలో క్రెడిట్ కార్డుల వినియోగం బాగా పెరిగింది. ప్రతి కొనుగోలు కోసం క్రెడిట్ కార్డునే వినియోగిస్తున్నారు. ఈ క్రమంలోనే కార్డుల వినియోగంపై సంచలన నిబంధనలను రిజర్వు బ్యాంక్ ప్రకటించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డుల ద్వారా చేసే చెల్లింపుల విషయంలో పెద్ద నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. క్రెడిట్ కార్డుల ద్వారా ఇళ్లు, షాపుల అద్దెలు, సొసైటీ ఫీజుల, ట్యూషన్ ఫీజు చెల్లింపులు, కార్డుల ద్వారా రుసుములు చెల్లింపు వంటి వాటిని త్వరలోనే ఆపేయాలని ఆర్బీఐ చూస్తోంది. ఈ కార్డు ఏదైతే వాస్తవ అవసరం కోసం వచ్చిందో.. విరుద్దంగా ఉన్నాయని ఆర్బీఐ భావిస్తోంది.

క్రెడిట్ కార్డు వినియోగించే వారికి, వ్యాపారికి మధ్య జరిగే లావాదేవీల కోసం రూపొందించబడిందని, వ్యక్తిగత లావాదేవీల కోసం కాదని ఆర్బీఐ విశ్వసిస్తుంది. వారి లావాదేవీలు కాకుండా ఇతర లావాదేవీలు ఉంటే డబ్బును స్వీకరించే వ్యక్తి కూడా డబ్బు పొందేందుకు కచ్చితంగా బిజినెస్ ఖాతాను తెరవవలసి ఉంటుందని ఆర్బీఐ స్పష్టంగా చెబుతోంది. గడచిన కొన్నేళ్లుగా దేశంలో క్రెడిట్ కార్డుల వినియోగం బాగా పెరిగింది. ఒక్క ఫిబ్రవరి నెలలోనే క్రెడిట్ కార్డుల ద్వారా రూ.1.5 లక్షల కోట్ల చెల్లిపంపు జరిగినట్లు ఆర్బీఐ వెల్లడించింది. వీటిలో ఎక్కువగా అద్దె చెల్లింపులు, ట్యూషన్ ఫీజులు, సొసైటీ ఫీజులు చెల్లింపులు ఉన్నట్లు గుర్తించింది.

ఇంటి అద్దె చెల్లింపులను క్రెడిట్ కార్డులను వినియోగించేందుకు అనేక ఫిన్ టెక్ కంపెనీలు అవకాశం కల్పించాయి. దీంతో ఇటీవల కాలంలో ఈ కార్డుల వినియోగం భారీగా పెరిగిపోయింది. ఈ కార్డు సౌకర్యాన్ని అందిస్తున్న చాలా బ్యాంకులు చెల్లింపులకు దాదాపు 45 నుంచి 50 రోజులు గడువు అందించటంతో చాలా మంది అత్యవసర అవసరాల కోసం వినియోగిస్తున్నారు. అలాగే మరికొందరు వేరే వ్యక్తిగత అవసరాల కోసం ఈ మార్గాన్ని వినియోగిస్తున్నారు. మొత్తంగా క్రెడిట్ కార్డుల వినియోగంపై ఆర్బీఐ కీలక నిబంధనలు తీసుకురానుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి