iDreamPost

ఆసీస్‌తో మ్యాచ్‌ తర్వాత.. అశ్విన్ బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌! ఎందుకు ఇదంతా?

  • Author Soma Sekhar Published - 03:04 PM, Sat - 23 September 23
  • Author Soma Sekhar Published - 03:04 PM, Sat - 23 September 23
ఆసీస్‌తో మ్యాచ్‌ తర్వాత.. అశ్విన్ బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌! ఎందుకు ఇదంతా?

వరల్డ్ కప్ లాంటి మెగా ఈవెంట్స్ లో ప్రతి ఒక్క ఆటగాడు సందర్భాన్ని బట్టి అన్ని విభాగాల్లో రాణించాల్సి ఉంటుంది. ఇక ఇలాంటి మేజర్ టోర్నీల్లో కీలక పాత్ర వహించేది ఆల్ రౌండర్స్ అని చెప్పాలి. అందుకే టీమిండియా ముందు జాగ్రత్తగా నలుగురు ఆల్ రౌండర్లతో వరల్డ్ కప్ బరిలోకి దిగుతోంది. పాండ్యా, జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్ లను వరల్డ్ కప్ స్క్వాడ్ లోకి తీసుకుంది. అయితే తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ తర్వాత అశ్విన్ నెట్స్ లో బ్యాటింగ్ చేస్తూ.. కనిపించాడు. ఈ ఫొటోలు, వీడియోలు వైరల్ కావడంతో.. ఇప్పుడు అశ్విన్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే దానికి వెనక కారణాలు లేకపోలేదు. ఇదంతా ముందుచూపే అని క్రీడా పండితులు చెబుతున్నారు.

రవిచంద్రన్ అశ్విన్.. టీమిండియా వెటరన్ స్పిన్నర్ గా ఎన్నో విజయాలను జట్టుకు అందించాడు. బౌలింగ్ లోనే కాకుండా బ్యాటింగ్ లోకూడా సత్తా చాటగాల ఆటగాడు అశ్విన్. అదీకాక ప్రస్తుతం టెస్టుల్లో వరల్డ్ ఆల్ రౌండర్స్ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ విషయాలన్నీ ఇప్పుడెందుకు అని మీకు అనుమానం రావొచ్చు. పైగా అతడు వరల్డ్ కప్ జట్టులో కూడా లేడు. ఇదంతా కాసేపు పక్కన పెడితే.. అశ్విన్ ప్రపంచ కప్ జట్టులోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు. దానికి కారణం ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ప్రస్తుతం గాయం కారణంగా ఆసీస్ తో తొలి రెండు వన్డేలకు దూరం కావడమే. ఒకవేళ అక్షర్ గాయం కారణంగా దూరం అయితే.. అతడి స్థానంలో మరో స్పిన్ ఆల్ రౌండర్ గా అశ్విన్ కే స్థానం దక్కుతుంది.

ఈ క్రమంలోనే ఇదంతా దృష్టిలో పెట్టుకునే అశ్విన్ ఇటు బౌలింగ్, అటు బ్యాటింగ్ పై ఫోకస్ పెట్టాడు. అందులో భాగంగానే ఆసీస్ తో తొలి మ్యాచ్ అనంతరం నెట్స్ లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ.. కెమెరా కంటికి చిక్కాడు. అదీకాక అశ్విన్ బ్యాటింగ్ చేస్తాడనే గట్టి నమ్మకం సెలక్టర్లలో ఉంది. అక్షర్ దూరం అయితే.. వెంటనే అశ్విన్ కు పిలుపు రావడం ఖాయం. అందులో ఎలాంటి సందేహం లేదు.. పైగా అశ్విన్ కు బ్యాటింగ్ లో మంచి ట్రాక్ రికార్డు కూడా ఉంది. అందుకే తన బ్యాటింగ్ కు మరిన్ని మెరుగులు దిద్దుకుంటున్నాడు ఈ స్టార్ ఆల్ రౌండర్. అశ్విన్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి