iDreamPost

మత్స్యకారులకు చిక్కిన అరుదైన చేప.. ధర ఏకంగా రూ.లక్షల్లో..

  • Published Nov 28, 2023 | 11:04 AMUpdated Nov 28, 2023 | 11:04 AM

సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులకు అరుదైన చేపలు లభిస్తుంటాయి. కొన్నిసార్లు ఆ చేపలు లక్షలు, కోట్లల్లో వేలం పాడుతుంటారు వ్యాపారులు.

సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులకు అరుదైన చేపలు లభిస్తుంటాయి. కొన్నిసార్లు ఆ చేపలు లక్షలు, కోట్లల్లో వేలం పాడుతుంటారు వ్యాపారులు.

  • Published Nov 28, 2023 | 11:04 AMUpdated Nov 28, 2023 | 11:04 AM
మత్స్యకారులకు చిక్కిన అరుదైన చేప.. ధర ఏకంగా రూ.లక్షల్లో..

గంగమ్మతల్లిని నమ్ముకొని సముద్రంలోకి వెటకు వెళ్లే జాలర్లు ఎన్నో ఆశలతో వెళ్తుంటారు.. కానీ అనుకున్నంత చేపలు చిక్కకపోవడంతో నిశాలో మునిగిపోతుంటారు. కొన్నిసార్లు అదృష్టం వరించి అరుదైన చేపలు వలలో చిక్కుతాయి. వాటి ఖరీదు ఎవరూ ఊహించని విధంగా పలుకుతుంది. ఒక్కో చేప ఏకంగా లక్షలు, కోట్లు కూడా పలుకుతుంటాయి. ఇటీవల కొంతమంది మత్స్యకారులకు అరుదైన సోవా చేప దొరికింది.. దాని ఖరీదు ఏకంగా ఏడు కోట్లు పలికింది. కారణం ఈ చేప బొడ్డు నుండి వచ్చే ఒకరకమైన పదార్థాల్లో అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి ఉన్నాయని నమ్ముతారు. అందుకే దాని ఖరీదు కోట్లు పలికింది. తాజాగా కొంతమంది మత్స్యకారులకు అరుదైన గోల్డెన్ ఫిష్ లభించింది.. దీని ఖరీదు లక్షల్లో పలికింది. వివరాల్లోకి వెళితే..

ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా పుడిమడక మత్స్యకారులకు అరుదైన కచిడి చేప (గోల్డెన్ ఫిష్) సోమవారం సముద్రంలో చిక్కింది. మార్కెట్ లో ఈ చేపకు మంచి డిమాండ్ ఉంది. అంతేకాదు ఖరీదు కూడా ఎక్కువే. తమ వలలో చిక్కిన కచిడి చేప ఏకంగా 27 కేజీల బరువు కలిగి ఉందని మత్స్యకారుడు మెరుగు నూకయ్య తెలిపాడు. ఈ రోజు మేం లేచిన వేళావిశేషం చాలా బాగుంది. గంగమ్మతల్లి మాపై కరుణ చూపించింది. ఇక భారీ సైజు ఉన్న ఈ చేపను కొనుగోలు చేసేందుకు స్థానిక వ్యాపారులు పోటీ పడ్డారు. వేలంలో పుడిమడకకు చెందిన వ్యాపారి మెరుగు కొండయ్య దీన్ని రూ.3.90 లక్షలకు దక్కించుకున్నాడు.

ఇక కచిడి చేప (గోల్డెన్ ఫిష్) విషయానికి వస్తే.. ఇందులో ఎన్నో అద్బుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. శస్త్ర చికిత్స చేసిన తర్వాత కుట్లు వేయడానికి ఈ రేప గాల్ బ్లాడర్ తో తయారు చేస్తారు. మందుల తయారీలో తీని భాగాలు వాడుతుంటారు. ఇలాంటి చేపలు చాలా అరుదుగా లభిస్తుంటాయి.. అందుకే ఈ చేపలు దొరికి బంగారం దొరికినంతగా సంతోషిస్తారని స్థానిక మత్స్యకారులు అంటున్నారు. ఒక్క చేపతో అదృష్టవంతులైన మత్స్యకారుల ఆనందంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి