iDreamPost

అమ్మ‌కానికి రణ్ వీర్ సింగ్ Jaguar XJ L కారు

అమ్మ‌కానికి రణ్ వీర్ సింగ్ Jaguar XJ L కారు

యాక్షన్ హీరో రణ్ వీర్ సింగ్ వాడిన జాగ్వర్ కావాలా? 24 లక్షలు రెడీ చేసుకోండి, సెలబ్రిటీ కారును సొంతం చేసుకోండి అంటూ ఫేస్ బుక్ లో ఓ ప్రకటన చక్కర్లు కొడుతోంది. రణ్ వీర్ తరఫున మరో యూజర్ ఈ ప్రకటనను పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ప్రకారం, రణ్ వీర్ కొన్న జాగ్వర్ XJ L ఇప్పటి వరకు 60 వేల కిలోమీటర్లు తిరిగింది. కారు కండిషన్ పర్ఫెక్ట్. దీని ధర ఎంతో తెలుసా? 23 లక్షల 98 వేలు! తమ అభిమాన హీరో కారు కావాలనుకున్నవాళ్ళు కాంటాక్ట్ చేయడానికి యూజర్ తన ఫోన్ నంబర్ కూడా పోస్ట్ చేశారు. ఈ వివరాలతో పాటు కారు ఫొటోలు కూడా అప్ లోడ్ చేశారు.


విభిన్నమైన బాలీవుడ్ సినిమాలు చేసి తనకంటూ గొప్ప ఫాలోయింగ్ సంపాదించుకున్న రణ్ వీర్ సింగ్ కి ఆటోమొబైల్స్ అంటే మహా క్రేజ్. స్టార్ డమ్ వచ్చాక అతను కొన్న మొదటి కారు జాగ్వర్ XJ L. కిందటేడాది 36వ బర్త్ డే బ్యాష్ కి, ఈ గల్లీ బాయ్ బ్రాండ్ న్యూ మెర్సిడెజ్ మేబాచ్ GLS600 (Mercedes-Maybach )ని కొన్నాడు. దానికి కొన్ని రోజుల ముందే లాంబర్గీనీ ఉరుస్ పెరల్ ఎడిషన్ (Lamborghini Urus Pearl Edition) ర్యాంబో గ్యారేజ్ లోకి దూసుకొచ్చింది. అప్పటికే ఈ సింబా హీరో కార్ కలెక్షన్ లో చాలా high-end SUVs ఉన్నాయి. మరి ఇన్ని కార్ల మధ్య అంత పాత కారు ఎందుకనుకున్నాడో ఏమో, రణ్ వీర్ జాగ్వర్ XJ Lని అమ్మకానికి పెట్టాడు.
Keywords:

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి