iDreamPost

RC15 : మెగా మూవీలో కొత్త ఆకర్షణలు

RC15 : మెగా మూవీలో కొత్త ఆకర్షణలు

ఆర్ఆర్ఆర్ ఇంకా విడుదల కాలేదు కానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన నెక్స్ట్ సినిమాల మీద ఫోకస్ పెంచేశాడు. శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న మూవీ మీద అంచనాలు అప్పుడే ఎగబాకుతున్నాయి. కేవలం ఒక పాటకే కోట్ల రూపాయల ఖర్చుకి సిద్ధంగా కావడం తమిళ మీడియాలో సైతం హై లైట్ అవుతోంది. తాజా సమాచారం మేరకు ఇందులో రణ్వీర్ సింగ్ ఒక స్పెషల్ క్యామియో చేయనున్నాడట. దీనికి కారణం ఉంది. రణ్వీర్ శంకర్ తోనే అపరిచితుడు రీమేక్ లో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఆయనకు పెద్ద ఫ్యాన్ అయిన ఈ బాలీవుడ్ హీరో రెండో అవకాశానికి అందుకే నో చెప్పలేకపోయాడట.

ఇది నిజమైతే పాన్ ఇండియా లెవెల్ లో ఈ చిత్రానికి మంచి అడ్వాంటేజ్ తోడవుతుంది. ఒకపక్క చిరంజీవి గాడ్ ఫాదర్ లో సల్మాన్ ఖాన్ నటిస్తుండగా మరోపక్క చరణ్ కోసం రణ్వీర్ రావడం నార్త్ లోనూ మెగా తండ్రీకొడుకులకు బాగా ప్లస్ కానుంది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం ప్రత్యేక ఆకర్షణ. ఈ మధ్య డాన్సుల విషయంలో అంతగా మెప్పించలేకపోతున్న చరణ్ విశ్వరూపం ఇందులో చూస్తారని ఇటీవలే ఓ రియాలిటీ షోలో జానీ మాస్టర్ చెప్పడం, ఆ వీడియో వైరల్ కావడం చకచకా జరిగిపోయాయి. 2023 సంక్రాంతిని టార్గెట్ చేసుకున్న ఈ మూవీకి ఇంకా టైటిల్ డిసైడ్ చేయలేదు

దీని సంగతి అలా ఉంచితే రామ్ చరణ్ రెండు సినిమాలు ఆచార్య, ఆర్ఆర్ఆర్ రిలీజులు ఎప్పుడు జరుగుతాయా అని అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఆచార్య ఏప్రిల్ 1 అని అధికారికంగా చెప్పారు కానీ మాట మీద ఉంటారన్న గ్యారెంటీ లేదు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన నేపథ్యంలో ఏదైనా పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది. మరోవైపు గౌతమ్ తిన్ననూరి చెర్రీ కోసం స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో పడ్డాడు. జెర్సీ హిందీ రీమేక్ తాలూకు పనులు ఫినిష్ కావడంతో ఇప్పుడు చరణ్ వర్క్ తప్ప మరొకటి లేదు. తర్వాత ప్రశాంత్ నీల్ లైన్ లోకి వస్తారు. మొత్తానికి చరణ్ లైనప్ మాత్రం మాములుగా లేదు

Also Read : Stuartupuram Donga : ఒక దొంగ వెనక్కు తగ్గాడట ?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి