iDreamPost

మన హీరోలదే ఆలస్యం

మన హీరోలదే ఆలస్యం

ప్రస్తుతానికి థియేటర్లు తెరుచుకోకపోయినా ఇకపై నిర్మాతలు ఫస్ట్ కాపీలు సిద్ధం చేసుకుని విడుదల సిద్ధం కావడం చాలా అవసరం. ఇప్పుడున్న అనిశ్చితి మహా అయితే ఇంకో నెల రోజులు కొనసాగుతుంది. ఆ తర్వాత సమస్య ఉండకపోవచ్చు. థర్డ్ వేవ్ ఉండకూడదనే ప్రతి ఒక్కరి కోరిక. అది రాకపోతే ఎప్పటిలాగే థియేటర్లు వంద శాతం ఆక్యుపెన్సీతో నడుపుకోవచ్చు. మునుపటిలా కలెక్షన్లు హౌస్ ఫుల్ బోర్డులు చూడొచ్చు. ఎప్పటి నుంచి అనే ప్రశ్నను పక్కనపెడితే స్టార్ హీరోల ప్రొడ్యూసర్లు ఇప్పుడు డేట్లు లాక్ చేసుకోవడం వల్ల మున్ముందు వచ్చే ఇబ్బందులను తగ్గించుకోవచ్చు. డిస్ట్రిబ్యూటర్లకు సైతం ఒక క్లారిటీ వస్తుంది.

దీనికి సంబంధించిన ముందడుగు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ వేసేశారు. ఆయన కొత్త సినిమా అన్నాతే(తెలుగు టైటిల్ ఇంకా డిసైడ్ కాలేదు)ఈ దీపావళికి నవంబర్ 4న `ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ప్రకటన కూడా ఇచ్చేశారు. ఆ టైంలో ఎలాంటి భయాలు ఉండవు. పైగా అధిక శాతం జనానికి వ్యాక్సిన్లు చేరిపోయి ఉంటాయి కాబట్టి ఇంకే టెన్షన్ ఉండదు. సో చాలా ప్లాన్డ్ గా ఇలా తేదీని ఫిక్స్ చేశారన్న మాట. తెలుగు వెర్షన్ కు సంబంధించిన డబ్బింగ్ హక్కులు ఇంకా ఎవరికీ డీల్ కాలేదు. గత సినిమాల ఫలితాల దృష్ట్యా ఎంత డిమాండ్ చేస్తే అంతా ఇచ్చేందుకు నిర్మాతలు సిద్ధంగా లేరు.

దీని సంగతలా ఉంచితే అన్నాతే వచ్చే టైంలో మనవాళ్ళు ఎవరు పోటీలో ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. ఆచార్య, అఖండ, రాధే శ్యామ్, పుష్ప, కెజిఎఫ్ 2, మేజర్ లాంటి పాన్ ఇండియా సినిమాలన్నీ ఇప్పుడు చివరి స్టేజిలో ఉన్నాయి. దసరాకు ఒకటో రెండో వచ్చినా మరికొన్ని దీపావళి రేస్ కు వెళ్తాయి. సాధారణంగా టాలీవుడ్ కు దీపావళి పెద్ద సీజన్ కాదు. కానీ ఈసారి పరిస్థితి అలా ఉండబోవడం లేదు. సెలవు లేదా పండగ వస్తే చాలు రిలీజ్ చేసుకోవాల్సిందే. ఈ నేపథ్యంలో మన నిర్మాతలు కూడా కాంపిటీషన్ ఇవ్వక తప్పదు. ఇప్పుడు తలైవాను ఢీ కొట్టి బాక్సాఫీస్ బరిలో నిలిచే పందెం కోళ్లు ఏవో త్వరలోనే డిసైడ్ అవ్వాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి