iDreamPost

ఘోర రోడ్డు ప్రమాదం.. తీవ్రంగా గాయపడ్డ మాజీ ఎంపీ.. భార్య మృతి

  • Published Jan 31, 2024 | 9:08 AMUpdated Jan 31, 2024 | 9:35 AM

తాజాగా చోటు చేసుకున్న ఓ ​కారు ప్రమాదంలో మాజీ ఎంపీ, ఆయన కుమారుడు తీవ్రంగా గాయపడగా.. భార్య అక్కడికక్కడే మృతి చెందింది. ఆ వివరాలు..

తాజాగా చోటు చేసుకున్న ఓ ​కారు ప్రమాదంలో మాజీ ఎంపీ, ఆయన కుమారుడు తీవ్రంగా గాయపడగా.. భార్య అక్కడికక్కడే మృతి చెందింది. ఆ వివరాలు..

  • Published Jan 31, 2024 | 9:08 AMUpdated Jan 31, 2024 | 9:35 AM
ఘోర రోడ్డు ప్రమాదం.. తీవ్రంగా గాయపడ్డ మాజీ ఎంపీ.. భార్య మృతి

ఈమధ్య కాలంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య భారీగా పెరుగుతోంది. మద్యం మత్తు, అతి వేగం, పొగమంచు, రాంగ్‌ రూట్‌ డ్రైవింగ్‌ వంటివి రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. రోడ్డు ప్రమాదం వార్తలు నిత్యకృత్యాలుగా మారాయి. ఇక తాజాగా ఘోర రోడ్డు ప్రమాదం వెలుగు చూసింది. ఈ ఘటనలో మాజీ ఎంపీ, ఆయన కుమారుడు తీవ్రంగా గాయపడగా.. ఆయన భార్య అక్కడికక్కడే మృతి చెందారు. సొంతూరుకు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దారుణం చోటు చేసుకున్నట్లు తెలిసింది. ఆ వివరాలు..

రాజస్తాన్‌లో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అళ్వార్‌ సమీపంలో కుషిపూర్ వద్ద ఢిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్‌ నేత, మాజీ ఎంపీ మావనేంద్ర సింగ్‌ కారు ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘటనలో ఎంపీ, ఆయన కుమారుడు తీవ్రంగా గాయపడగా.. మానవేంద్ర సింగ్‌ భార్య చైత్రా సింగ్‌ స్పాట్‌లోనే చనిపోయారు. డ్రైవర్‌ కూడా గాయపడ్డాడు. ప్రమాద సమయంలో మానవేంద్ర సింగే కారు నడిపినట్లు తెలుస్తోంది. మాజీ ఎంపీ తన కుటుంబంతో కలిసి.. ఢిల్లీ నుంచి సొంతూరు జైపూర్‌కు వెళ్తుండగా మంగళవారం సాయంత్రం 6 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.

Ex-MP's wife dies in road accident

ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే.. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మానవేంద్ర సింగ్‌, ఆయన కుటుంబ సభ్యులు, డ్రైవర్‌ని అళ్వార్‌లోని సోలంకి ఆస్పత్రికి తరలించారు. వారిని పరీక్షించిన వైద్యులు.. అప్పటికే మానవేంద్ర సింగ్‌ భార్య చిత్రా సింగ్‌ మృతి చెందారని తెలిపారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడతూ.. ‘‘సాయంత్రం 6 గంటలకు ప్రమాదం గురించి మాకు తెలిసింది. కాసేపటికి మానవేంద్ర సింగ్‌, ఆయన కుటుంబ సభ్యులను ఇక్కడకు తీసుకువచ్చారు. అప్పటికే చిత్రాసింగ్‌ మృతి చెందగా.. మానవేంద్ర సింగ్‌కు ఛాతీ, పక్కటెముకలకు గాయాలయ్యాయి.. న్యూమోథొరాక్స్ (ఊపిరితిత్తుల చుట్టూ గాలి చేరడం) కూడా గమనించాం’’ అని చెప్పారు. అంతేకాక మానవేంద్ర సింగ్ కుమారుడికి స్వల్ప గాయాలైనట్టు పేర్కొన్నారు.

ఇక, కేంద్ర మాజీ మంత్రి, దివంగత జశ్వంత్‌ సింగ్‌ పెద్ద కుమారుడే మానవేంద్ర సింగ్‌. 2004 పార్లమెంట్ ఎన్నికల్లో బాడ్‌మేర్‌- జైసల్మేర్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీగా గెలుపొందారు. 2013 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో శెవో స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగా ప్రచారం చేశారనే ఆరోపణలు రావడంతో అధిష్టానం ఆయనను పార్టీ నుంచి బహిష్కరించింది. దీంతో 2018 రాజస్థాన్ శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. రోడ్డు ప్రమాద ఘటనపై రాజస్తాన్‌ మాజీ సీఎం వసుంధరా రాజే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చైత్రా సింగ్‌ మృతి పట్ల ఆమె సంతాపం తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి