iDreamPost

రాజ్యసభ పోరు : ఒక్కో ఎమ్మెల్యేకు 25 కోట్లు!: రాజస్థాన్ సిఎం అశోక్ గెహ్లాట్ సంచలన ఆరోపణలు

రాజ్యసభ పోరు : ఒక్కో ఎమ్మెల్యేకు 25 కోట్లు!: రాజస్థాన్ సిఎం అశోక్ గెహ్లాట్ సంచలన ఆరోపణలు

రాజ్యసభ ఎన్నికలకు సమయం దగ్గరపుడుతున్నా కొద్దీ ఉత్కంఠ పెరుగుతోంది. రాజస్థాన్, గుజరాత్ లోనే ఇలా ఉత్కంఠభరిత పరిస్థితి నెలకొంది. రాజ్యసభ ఖాలీలు కంటే ఎక్కువ మంది పోటీ చేయడం…ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడం వంటి పరిస్థితుల నేపథ్యంలో రాజకీయ ఉత్కంఠత నెలకొంది. తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్ ఆపసోపాలు పడుతుంది. క్యాంప్ లకు తరిలించి ఎమ్మెల్యేలను బిజెపి వైపు వెల్లకుండా నిలువరిస్తుంది.

ఈ నేపథ్యంలో తాజాగా రాజస్తాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బిజెపి నేతలు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు.

రాజ్యసభ ఎ‍న్నికల్లో ప్రత్యర్థికి ఓటు వేసే విధంగా ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 25 కోట్లు ఆశచూపుతూ ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కేంద్రంలోని బిజెపి సర్కార్‌ ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి తాజా వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

కాగా రాజస్తాన్‌లో మూడు స్థానాలకు ఈనెల 19న రాజ్యసభ ఎన్నికలు జరుగనున్నాయి. అసెంబ్లీలో ఎమ్మెల్యేల మెజారిటీ ప్రకారం మొత్తం మూడింటిలో కాంగ్రెస్ రెండు స్థానాలు‌, ఒకటి బిజెపి గెలిచే అవకాశం ఉంది. 

అయితే సరైన సంఖ్యాబలం లేకున్నా బిజెపి రెండు స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ముందస్తు జాగ్రత్తగా అధికార కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను క్యాంపులకు తరలించింది.

ఎన్నికల వేళ బిజెపి తీరుపై కాంగ్రెస్‌ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇ‍ప్పటికే గుజరాత్‌‌లో ఏడుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రాజీనామాలు సమర్పించిన విషయం తెలిసిందే. వారంతా బిజెపి ఒత్తిడి మేరకు రాజీనామాలు చేశారని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి