iDreamPost

RRR : 75 రోజుల సమయం – రాజమౌళి టీమ్ పరిగెత్తాల్సిందే

RRR : 75 రోజుల సమయం – రాజమౌళి టీమ్ పరిగెత్తాల్సిందే

2022 జనవరి 7న విడుదల కాబోతున్న ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లు ఈ నెలాఖరు నుంచి ప్రారంభం కాబోతున్నాయి. మార్కెటింగ్ చేయడంలో దిట్ట అయిన రాజమౌళి స్వయంగా దీన్ని పర్యవేక్షించబోతున్నారు. రాధే శ్యామ్ తో పోటీ ఉన్న నేపథ్యంలో నార్త్ ఆడియన్స్ లో ఈ మల్టీ స్టారర్ మీద ఎక్కువ బజ్ వచ్చేలా చేసేందుకు అన్ని రకాల ప్రణాళికలను సిద్ధం చేసినట్టు సమాచారం. అందులో భాగంగా పాన్ ఇండియా లెవల్ లో ముఖ్య నగరాల్లో త్వరలో ప్రమోషన్ ఈవెంట్లు చేయబోతున్నారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లతో పాటు క్యాస్టింగ్ లోని కీలక తారాగణం అంతా ఇందులో పాల్గొనేలా అల్రెడీ డేట్లు కూడా లాక్ చేసుకున్నారని ఇన్ సైడ్ న్యూస్.

సుమారు పది కోట్లకు పైగా బడ్జెట్ కేవలం పబ్లిసిటీ కోసమే ఖర్చు పెట్టేందుకు రెడీ అయ్యారని తెలిసింది. అంతకన్నా ఎక్కువ ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. హైదరాబాద్, బెంగళూర్, చెన్నై, కోచి, ముంబై, కోల్కతా లాంటి ప్రధాన నగరాల్లో కనివిని ఎరుగని రీతిలో ఈవెంట్లను ప్లాన్ చేసినట్టు వినికిడి. తేదీలను ఒక్కొక్కటిగా ప్రకటించి అమలు చేయబోతున్నారు. ఈ సారి సోషల్ మీడియా వాడకం కూడా ఓ రేంజ్ లో ఉంటుందని తెలిసింది. ట్విట్టర్, ఇన్స్ టా, ఫేస్ బుక్ లాంటి ప్లాట్ ఫార్మ్స్ లో ఎలా ప్రమోట్ చేయాలనే దాని మీద ఇప్పటికే జక్కన్న కోసం ఒక టీమ్ పని చేస్తోందట. వాళ్ళిచ్చిన రిపోర్ట్ మేరకు ఆ దిశగా ప్లానింగ్ ఉండబోతోంది,

థియేట్రికల్ బిజినెస్ రికార్డులో కొత్త నెంబర్లు నమోదు చేయనున్న ఆర్ఆర్ఆర్ కు రాధే శ్యామ్ కు మధ్యలో వారం రోజుల గ్యాప్ ఉంటుంది. వీలైనంత భారీ వసూళ్లను ఈ ఏడు రోజుల్లో రాబట్టుకుని ఆ తర్వాత టాక్ ని బట్టి సినిమాను ఎలా నిలబెట్టుకోవాలో స్కెచ్ వేస్తారు. కీరవాణి స్వరపరిచిన పాటల్లో ఇప్పటిదాకా ఒకటే రిలీజ్ అయ్యింది. మిగిలిన లిరికల్ వీడియోలను కూడా ఒక్కొక్కటిగా వదలబోతున్నారు. దీపావళికి తారక్ చరణ్ ఇద్దరూ ఉండే టీజర్ ని విడుదల చేయబోతున్నారని అంతర్గత వర్గాల సమాచారం. సరిగ్గా ఆర్ఆర్ఆర్ చేతిలో 75 రోజుల సమయం మాత్రమే ఉంది. ఇక చార్టర్ ఫ్లైట్ వేసుకుని చక్కర్లు కొట్టడమే మిగింది

Also Read : Raja Babu : చివరి శ్వాస తీసుకున్న ఫ్యామిలీ ఆర్టిస్ట్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి