iDreamPost

తారక్ ఫ్యాన్స్ కి షాక్ తప్పదా

తారక్ ఫ్యాన్స్ కి షాక్ తప్పదా

లాక్ డౌన్ మొదలైన టైంలో ఆర్ఆర్ఆర్ లో రామ్ చరణ్ పాత్ర అల్లూరి సీతారామరాజుకు సంబంధించి ఇంట్రో వీడియోని టీజర్ రూపంలో విడుదల చేయడం ఎంత సంచలనం రేపిందో చూసాం . చెర్రి టెర్రిఫిక్ స్క్రీన్ ప్రెజెన్స్ కి జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ అద్భుతంగా అమరి ఓ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. మెగా పవర్ స్టార్ పుట్టినరోజు కానుకగా సరైన గిఫ్ట్ ఇచ్చారని అభిమనులు సంతోషపడ్డారు. ఇప్పుడు వచ్చే నెల తారక్ వంతు రాబోతోంది.

మే 20న తన జన్మదినం సందర్భంగా ఇదే తరహాలో కొమరం భీం వీడియోని కూడా రామ్ చరణ్ వాయిస్ లో పరిచయం చేస్తారనే ఉత్సుకత యంగ్ టైగర్ అభిమానుల్లో విపరీతంగా ఉంది. అయితే దర్శకుడు రాజమౌళి స్వయంగా ఓ చిన్నపాటి ఝలక్ ఇచ్చారు. ఇవాళ ఓ టీవీ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన కాన్ఫరెన్స్ ఇంటర్వ్యూలో జక్కన్న దీని గురించి క్లారిటీ ఇచ్చాడు. రామ్ చరణ్ ఫుటేజ్ అప్పటికే తమ దగ్గర సిద్ధంగా ఉండటం వల్ల వాయిస్ ఓవర్ తో పాటు మిగిలిన పనులు ఇంట్లో నుంచే చేశామని కానీ తారక్ కు కావాల్సిన మెటీరియల్ సర్వర్ లోని ఆఫీస్ లో ఉందని, లాక్ డౌన్ వల్ల అక్కడికి చేరుకోవడం సాధ్యపడదని చెప్పారు.

అంతే కాదు కొంత పార్ట్ విడిగా షూట్ చేయాల్సి ఉంటుందని అది కూడా నిబంధనలు సరళిస్తేనే సాధ్యపడుతుందని స్పష్టం చేశారు. సో దీన్ని బట్టి అర్ధమయ్యేదేంటంటే జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే కి టీజర్ ఖచ్చితంగా వస్తుందన్న గ్యారెంటీ లేదు. ఏదో హడావిడిగా క్వాలిటీ లేకుండా చుట్టేయడం తనకే కాదు చరణ్ తారక్ లకు కూడా ఇష్టం లేదని సో ఇదంతా అప్పటి పరిస్థితి మీద ఆధారపడి ఉంటుందని చెప్పారు. కాబట్టి అభిమానులు ఎందుకైనా మంచిది మెంటల్ గా ప్రిపేర్ అవ్వడం బెటర్. ఒకవేళ లాక్ డౌన్ ఇలాగే ఉంటే వీడియో రాలేదని నిరాశ చెందే పని ఉండదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి