iDreamPost

నాడు కలెక్టర్ భార్య కోసం ….. నేడు పాలనా సౌలభ్యం కోసం … 163 ఏళ్ల తరువాత మళ్లీ రాజమహేంద్రవరం పూర్వవైభవం

నాడు  కలెక్టర్ భార్య కోసం ….. నేడు పాలనా సౌలభ్యం కోసం …  163 ఏళ్ల తరువాత మళ్లీ రాజమహేంద్రవరం పూర్వవైభవం

పచ్చని మామిడాకు తోరణాలు .. .అలంకరించిన కొత్త కలెక్టరేట్ లో ప్రజాప్రతినిధులు , సందర్శకుల ఆనందోత్సాహాల నడుమ ముందస్తు ముహూర్తం మేరకు ఉదయం 9.15-9.45గంటల మధ్య రాజమహేంద్రవరం తొలి కలెక్టర్ గా డాక్టర్ కె మాధవీలత అధికార బాధ్యతలు స్వీకరించారు . దీంతో 123 ఏళ్ల తరువాత మళ్లీ రాజమహేంద్రవరం కేంద్రంగా జిల్లా ఆవిర్భవించినట్టయ్యింది . బ్రిటీష్ పాలనా కాలంలో ఆనాడు కలెక్టర్ గా పనిచేసిన అధికారి,పనిచేసిన అధికారి భార్యకు అనారోగ్యంగా ఉండటంతో సముద్రగాలి కోసం జిల్లా కేంద్రాన్ని రాజమహేంద్రవరం నుంచి కాకినాడకు తరలించారు. ఆ తరువాత వివిధ కారణాల వల్ల కలిసి ఉన్న గోదావరి జిల్లాలు విడిపోయాయి . సుమారు 123 ఏళ్ల తరువాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చొరవతో పాలనా సౌలభ్యం కోసం రాజమహేంద్రవరం కేంద్రంగా మళ్ళీ తూర్పుగోదావరి జిల్లాను ఏర్పాటు చేయడం విశేషం .

17 వ శతాబ్దం నాటికి మద్రాసు ప్రెసిడెన్సీ పరిధిలోని ఆంధ్ర ప్రాంతం బ్రిటీష్ వారి ఏలుబడిలోకి వెళ్లింది . 1802 లో నేటి విజయనగరం జిల్లాలోని గంజాం , విశాఖపట్నం , రాజమహేంద్రవరం,మచిలీపట్నం , గుంటూరులను పరిపాలనా కేంద్రాలుగా గుర్తించగా,1823 లో రాజమహేంద్రవరం కేంద్రంగా జిల్లా ఆవిర్భవించింది . గోదావరి తీరానే ఉన్న భద్రాచలం గోదావరి జిల్లాలోనే ఉండేది . 1859 లో గోదావరి జిల్లా నుంచి కృష్ణాను వేరుచేశారు . అదే సమయంలో బ్రిటీష్ కలెక్టర్ భార్యకు అనారోగ్యంగా ఉండటంతో గాలి మార్పు కోసం సముద్రతీరాన ఉన్న కాకినాడకు జిల్లా కేంద్రాన్ని తరలించారు . 1925 లో పశ్చిమగోదావరి జిల్లాలను ఏర్పాటు చేశారు . పరిపాలనా సౌలభ్యం కోసం భద్రాచలంను తెలంగాణాలోని ఖమ్మం జిల్లాకు బదిలీ చేశారు . అయితే భద్రాచలం తెలంగాణాలోనే ఉండిపోయినా రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టు కోసం పరిసర మండలాలను గోదావరి జిల్లాల్లో కలిపారు .

123 ఏళ్ల తరువాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలనా సౌలభ్యం కోసం మళ్లీ ఉభయ గోదావరి జిల్లాలను కలుపుతూ రాజమహేంద్రవరంను కేంద్రంగా తూర్పుగోదావరి జిల్లాగా ఏర్పాటు చేశారు. రాజమహేంద్రవరంతో పాటు , రాజమహేంద్రవరం రూరల్ , రాజానగరం , అనపర్తి , పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరు , నిడదవోలు , గోపాలపురం నియోజకవర్గాలతో ఏర్పడిన జిల్లాతో రాజమహేంద్రవరంనకు పూర్వవైభవం లభించినట్టయ్యింది .

తొలి కలెక్టర్ గా మాధవి …. ఎస్పీగా రస్తోగీ

తొలి జిల్లా కలెక్టర్ డాక్టర్ మాధవీలత, తొలి జిల్లా ఎస్పీగా ఐశ్వర్య రస్తోగీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. మాధవి సోమవారం అధికార బాధ్యతలు స్వీకరించారు . అయితే తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా ఐశ్వర్య రస్తోగీ ఆదివారమే అధికార బాధ్యతలు స్వీకరించారు . ఇప్పటి వరకు రాజమహేంద్రవరం పోలీసు అర్బన్ జిల్లాగా ఉండేది . తొలి కలెక్టర్ , ఎస్పీలు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ జిల్లాకు పూర్వవైభవం తెచ్చేందుకు కృషిచేస్తామని ఆనందంతో ప్రకటించారు. 💐

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి