iDreamPost

హైకోర్టులో రాహుల్ గాంధీకి చుక్కెదురు.. రెండేళ్ల జైలు శిక్ష

హైకోర్టులో రాహుల్ గాంధీకి చుక్కెదురు.. రెండేళ్ల జైలు శిక్ష

కాంగ్రెస్ సీనియర్ నేత , మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి గుజరాత్ హైకోర్టులో చుక్కెందురైంది. ఆయనపై ఉన్న పరువు నష్టం కేసులో శుక్రవారం గుజరాత్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సూరత్ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై  స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును గుజరాత్ హైకోర్టు సమర్ధించింది. ఈ కేసులో  స్టే ఇవ్వడానికి తగిన కారణాలు కనిపించలేదని హైకోర్టు పేర్కొంది. పరువు నష్టం కేసులో సూరత్‌లోని మేజిస్ట్రేట్ కోర్టులో  రాహుల్‌కు 2 ఏళ్ల శిక్ష పడింది. ఆ తర్వాత ఆయన పార్లమెంటరీ సభ్యత్వం కూడా రద్దయింది.

గుజరాత్ ఎమ్మెల్యే పురునేష్ మోదీ.. రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు పెట్టారు. 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కర్ణాటకలో రాహుల్ గాంధీ.. మోదీ ఇంటిపేరుపై తప్పుడు ప్రకటన చేశారని ఆరోపించారు. దీని వల్ల మోదీ ఇంటిపేరు ఉన్నవాళ్లందరికీ పరువు నష్టం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కేసులో విచారణ సందర్భంగా సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో రాహుల్ గాంధీ అదనపు సెషన్స్ కోర్టులో అప్పిల్ చేసుకున్నారు. అయితే అదనపు సెషన్స్ కోర్టు నుంచి కూడా రాహుల్ కి ఎలాంటి ఉపశమనం లభించలేదు.

ఆ కోర్టు కూడా  ఆయనకు కింది కోర్టు విధించిన శిక్షను సమర్థించింది. ఈ తీర్పులపై స్టే ఇవ్వమని రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా గుజరాత్ హైకోర్టు కూడా కింది కోర్టు ఇచ్చిన రెండేళ్ల శిక్ష తీర్పును సమర్థించింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పు న్యాయబద్ధంగానే ఉందన్న న్యాయమూర్తి.. రాహుల్ పిటిషన్ ను కొట్టేశారు. సావర్క్ ను కించపరిచారని ఆయన మనవడు వేసిన పిటిషన్ ను ప్రస్తావించిన న్యాయస్థానం..రాహుల్ పై 10 పరువు నష్టం కేసులు పెండింగ్ లో ఉన్నాయని గుర్తు చేసింది.

2019 లోక్ సభ ఎన్నికల ప్రచారం  సందర్భంగా కర్ణాటకలోని కోలార్ లో భ కాంగ్రెస్ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో పాల్గొన్న రాహుల్ గాంధీ ప్రజలను  ఉద్దేశించి ప్రసంగించారు. భారతదేశంలో పెద్ద మోసాలు చేసి విదేశాలకు పారిపోయిన వ్యక్తులను, ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకున్నాడు. ప్రధాని మోదీ ఇంటి పేరును ఉద్దేశిస్తూ..” దొంగలందరి ఇంటిపేరు మోదీయే” ఎందుకు అంటూ ప్రశ్నించారు. రాహుల్ వ్యాఖ్యలపై అభ్యతరం వ్యక్తం చేస్తూ గుజరాత్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పురునేష్ మోదీ పరువు నష్టం కేసు పెట్టారు. మరి.. రాహుల్ గాంధీకి గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి