iDreamPost

Rahul Gandhi: రాహుల్ గాంధీకి రూ. 500 జరిమానా.. ఎందుకంటే..

ప్రస్తుతం కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ.. భారత్ జోడో న్యాయ యాత్రలో బిజీగా గడుపుతున్నారు. ఈ నెల 14 నుండి మొదలైన ఈ పర్యటన.. ప్రస్తుతం అస్సోంలో కొనసాగుతుంది. ఇదిలా ఉంటే.. రాహుల్ గాంధీకి జరిమానా విధించింది.

ప్రస్తుతం కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ.. భారత్ జోడో న్యాయ యాత్రలో బిజీగా గడుపుతున్నారు. ఈ నెల 14 నుండి మొదలైన ఈ పర్యటన.. ప్రస్తుతం అస్సోంలో కొనసాగుతుంది. ఇదిలా ఉంటే.. రాహుల్ గాంధీకి జరిమానా విధించింది.

Rahul Gandhi: రాహుల్ గాంధీకి రూ. 500 జరిమానా.. ఎందుకంటే..

కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత రాహుల్ గాంధీ.. భారత్ జోడో యాత్ర మరోసారి చేపడుతోన్న సంగతి విదితమే. గతంలో పలు రాష్ట్రాల్లో పర్యటించారు. ఆ ప్రభావం కొంత మేర ప్రభావం చూపించదనే చెప్పొచ్చు. కర్ణాటకలో విజయ బావుటా ఎగుర వేసింది కాంగ్రెస్. అక్కడ బీజెపీ ప్రభుత్వం కుప్పకూలి.. హస్తం పార్టీ పదవి అందించారు ప్రజలు. అయితే ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో మినహా మిగిలిన రాష్ట్రాలన్నింటిలో ఓటమి చెందింది కాంగ్రెస్. గెలుపు.. ఓటములు పక్కన పెడితే.. రాహుల్ గాంధీ మళ్లీ బిజీ అయిపోయారు. భారత్ జోడో న్యాయ యాత్రను తిరిగి చేపడుతున్నారు.

ఈ నెల 14వ తేదీ నుండి భారత్ జోడో యాత్ర రెండవ దశ స్థార్ అయ్యింది. ఈ యాత్ర 15 రాష్ట్రాల్లో 100 లోక్ సభ నియోజకవర్గాల మీదుగా సాగనుంది. 67 రోజుల పాటు.. 6,713 కిలోమీటర్లు పర్యటించనున్నారు రాహుల్ గాంధీ. ప్రస్తుతం ఆయన అస్సోంలో పర్యటిస్తున్నారు. ఇదిలా ఉంటే రాహుల్‌కు షాక్ ఇచ్చింది మహారాష్ట్రలోని థానే కోర్టు. అసలు ఏం జరిగిందంటే.. 2017లో ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్యకు గురైన సంగతి విదితమే. కొంత మంది దుండగులు ఆమెను ఇంటి వద్ద కాల్చి చంపారు. అయితే ఈ ఘటనకు హిందూత్వ సంస్థ ఆర్ఎస్ఎస్‌కు సంబంధం ఉందని రాహుల్ ఆరోపించారని వార్తలు వెలువడ్డాయి. రాహుల్ వ్యాఖ్యలపై సంఘ్ పరివార్ కార్యకర్త వివేక్ ఆయనపై పరువు నష్టం కేసు దాఖలు చేశారు.

ఈ కేసు విచారణ సందర్భంగా వివరణ కోరింది కోర్టు. అయితే ఆయన వివరణ ఇవ్వలేదు. దీంతో సంజాయిషీ ఇవ్వడంలో జాప్యం చేసినందుకు రూ. 500 జరిమానా విధించింది. 881 రోజుల ఆలస్యానికి గానూ..ఈ ఫైన్ విధించింది మహారాష్ట్రలోని థానే ధర్మాసనం. కాగా, రాహుల్ తరుపు న్యాయవాది నారాయణ్ అయ్యర్ మాట్లాడుతూ.. తన క్లయింట్ ఢిల్లీలో ఉంటారని, ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఆయన ఎక్కువ ప్రయాణాలు చేస్తుంటారని చెప్పారు. ఈ కారణంగానే సంజాయిషీ ఇవ్వడంలో లేటయ్యిందని పేర్కొనగా..వారి వాదనలతో ఏకీభవించిన కోర్టు జస్ట్ జరిమానాతో సరిపెట్టేసింది. అయితే ఇదే సమయంలో రాత పూర్వక వివరణ ఇవ్వాలని పేర్కొంది. సాధారణంగా పరువు నష్టం కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తి ముందుగా కోర్టుకు తన వివరణ సమర్పించాల్సి ఉంటుంది. తర్వాత సాక్షుల విచారణ, క్రాస్ క్వశ్చన్ చేయడం ఉంటాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి