iDreamPost

ప్రభాస్ పోటీ పడక తప్పదు

ప్రభాస్ పోటీ పడక తప్పదు

బాహుబలి నుంచి ఒక అలవాటుగా మారిపోయిన ఏళ్ళ తరబడి నిర్మాణం ప్రభాస్ కు రాధే శ్యామ్ విషయంలోనూ తప్పలేదు. ప్రస్తుతం చివరి స్టేజి లో ఉన్న షూటింగ్ కి మరికొద్ది రోజుల్లోనే గుమ్మడి కాయ కొట్టబోతున్నారు. మరోవైపు పూర్తయిన పోర్షన్ మొత్తానికి పోస్ట్ ప్రొడక్షన్ కూడా కానిచ్చేస్తున్నారు. ఎడిటింగ్ రూమ్ కు ప్రభాస్ అప్పుడప్పుడు వచ్చి స్వయంగా పర్యవేక్షిస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. ఎట్టి పరిస్థితుల్లోనూ సాహో లాంటి టాక్ రాకుండా నిడివి తక్కువైనా సరే ల్యాగ్ లేకుండా చూడమని ప్రభాస్ తన నిర్మాతలకు పదే పదే చెబుతున్నట్టు వినికిడి. కరోనా దెబ్బకు మూడు గంటల సేపు థియేటర్లో ప్రేక్షకులు కూర్చోవడం అంత సులభం కాదనే పాయింట్ ని నొక్కి చెబుతున్నాడట

ఇదంతా ఓకే కానీ అసలు విడుదల తేదీ ఎప్పుడు ఉంటుందనే దాని మీద సస్పెన్స్ మాత్రం ఇంకా తొలగడం లేదు. డేట్ ఏదైనా సరే గట్టి పోటీ మాత్రం తప్పేలా లేదు. ఉదాహరణకు అక్టోబర్ లో ప్లాన్ చేసుకుంటే ఆల్రెడీ ఆర్ఆర్ఆర్ కర్చీఫ్ వేసేసింది. పోనీ దీపావళికి చూద్దామా అంటే ఆచార్య, మేజర్ లాంటి పాన్ ఇండియా సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఇదంతా ఎందుకు డిసెంబర్ ఉంది కదాని అనుకోవడానికి లేదు. కెజిఎఫ్ 2, పుష్పలు పది రోజుల కంటే తక్కువ గ్యాప్ తో ఢీ కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అసలు ఆగస్ట్ లో కరోనా థర్డ్ వేవ్ రాకుండా ప్రశాంతంగా ఉంటేనే ఈ సమీకరణాలు పనికివస్తాయి.

ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే రాధే శ్యామ్ కు సోలో రిలీజ్ దక్కడం దాదాపు అసాధ్యం. మరోవైపు బాలీవుడ్ సినిమాలను మర్చిపోకూడదు. అంతా బాగున్నప్పుడే గతంలో అలియా భట్ గంగూ భాయ్ లాంటివి నేరుగా రాధే శ్యామ్ తో అదే రోజు తలపడేందుకు రెడీ అయ్యాయి. ఇప్పుడు ఏ సూర్యవంశీనో లేదా 83నో పోటీకి సై అంటే నార్త్ సైడ్ ఓపెనింగ్స్ మీద ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. అందుకే యువి సంస్థ ప్రస్తుతానికి ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వడం లేదు. బాహుబలి, సాహో తరహాలో సోలో రిలీజ్ అయితేనే జరిగిన బిజినెస్ కి న్యాయం జరుగుతుందని వాళ్ళ అభిప్రాయం. కానీ పరిస్థితులు దానికి అనుకూలంగా మాత్రం లేవు. చూద్దాం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి