iDreamPost

Qubool Hai Report : ఖుబూల్ హై రిపోర్ట్

Qubool Hai Report : ఖుబూల్ హై రిపోర్ట్

ఇటీవలి కాలంలో కొత్త సినిమాలతో పాటు క్వాలిటీ కంటెంట్ మీద బాగా దృష్టి పెడుతున్న ఆహాలో లేటెస్ట్ గా రిలీజైన వెబ్ సిరీస్ ఖుబూల్ హై . మేకింగ్ నుంచి ట్రైలర్ దాకా ఇదో డిఫరెంట్ అటెంప్ట్ అనే అభిప్రాయం ప్రేక్షకుల్లో కలిగించింది. సాధారణంగా ఈ తరహా రా డ్రామాలు హిందీ మలయాళంలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. అలాంటిది తెలుగులోనూ ప్రయత్నించడం మెచ్చుకోదగ్గ విషయం. ఇదే టైటిల్ తో గతంలో హిందీలో  ఓ సిరీస్ వచ్చింది కానీ దానికి ఎలాంటి సంబంధం లేదు. ఉమైర్ హసన్ – ఫిజ్ రాయ్ – ప్రణవ్ రెడ్డి సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఖుబూల్ హైని మిరాజ్ మీడియా బ్యానర్ మీద నిర్మించారు. ఎలా ఉందో రిపోర్ట్ చూద్దాం

ఇది హైదరాబాద్ నేపథ్యంలో సాగే కథ. బయట ప్రపంచానికి అంతగా తెలియని ఓ బాధిత కోణాన్ని ఆవిష్కరిస్తుంది. పాత బస్తీ- తలాబ్ కట్ట తదితర ప్రాంతాల్లో అమ్మాయిలకి చాలా చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేయడం అక్కడ నిత్యకృత్యం. దీని మీద పోరాడేందుకు సామాజిక కార్యకర్తలు ఎంత కష్టపడినా ఎన్నో ఆటంకాలు విషమ పరీక్ష పెడుతూ ఉంటాయి. పోలీసుల కళ్లెదుటే జరుగుతున్నా ఏమీ చేయలేని పరిస్థితి. 13 ఏళ్ళ అమ్మాయికి పెళ్లి చేయడంతో మొదలయ్యే ఈ సిరీస్ మొత్తం ఆరు ఎపిసోడ్లలో మనకు తెలియని జీవితాలను కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. చివరికి ఈ రుగ్మతకు పరిష్కారం దొరికిందా లేదా అనేది సిరీస్ లోనే చూడాలి.

ఒకరిద్దరు తప్ప అందరూ కొత్తవాళ్ళతో ఖుబూల్ హై చాలా న్యాచురల్ గా సాగింది. బస్తీ వాతావరణాన్ని అత్యంత సహజంగా తెరకెక్కించారు. క్యాస్టింగ్ అందరూ అనుభవం ఉన్నవాళ్ళలా నటించారు. వినయ్ వర్మ, మనోజ్ ముత్యం ఒకటే తెలిసిన మొహాలు. మధ్యలో ల్యాగ్ ఉన్నప్పటికి రెగ్యులర్ ధోరణిలో వెళ్లకుండా ఇలా ప్రయత్నించినందుకు మెచ్చుకోవాలి. డ్రామా కూడా బాగా పండింది. జెర్రీ సిల్వెస్టర్ సంగీతం, కార్తీక్ పర్మర్ ఛాయాగ్రహణం మంచి స్టాండర్డ్ లో సాగాయి. కాకపోతే ఒరిజినాలిటీ కోసం సిరీస్ లో అధిక భాగం హిందీలో సాగుతుంది. అవసరమైన చోట తెలుగు సంబాషణలు ఉన్నాయి. ఇది కొంత ఇబ్బందే. కొత్త అనుభూతి కావాలంటే మాత్రం ఖుబూల్ హై చూడాలి. షాక్ కలిగించే అంశాలతో పాటు కొత్తగా ఆలోచిస్తున్న నవతరం టాలీవుడ్ అందులో కనిపిస్తుంది

Also Read : Pushpa : సీక్వెల్ మీదే ఐకాన్ స్టార్ ఫోకస్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి