iDreamPost

Pushpa 2: పుష్ప 2లో అల్లు అర్జున్ కట్టిన చీర ప్రత్యేకత ఏంటో తెలుసా.. అది ఎవరిదంటే

  • Published Apr 10, 2024 | 2:24 PMUpdated Apr 10, 2024 | 4:32 PM

పుష్ప 2లో తన రూలింగ్ ఎలా ఉండనుందో టీజర్ ద్వారా చూపించాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇక టీజర్లో ఆయన ధరించిన చీరపై ఆసక్తికర చర్చ సాగుతోంది. దాని వెనక పెద్ద కథే ఉంది. ఆ వివరాలు..

పుష్ప 2లో తన రూలింగ్ ఎలా ఉండనుందో టీజర్ ద్వారా చూపించాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఇక టీజర్లో ఆయన ధరించిన చీరపై ఆసక్తికర చర్చ సాగుతోంది. దాని వెనక పెద్ద కథే ఉంది. ఆ వివరాలు..

  • Published Apr 10, 2024 | 2:24 PMUpdated Apr 10, 2024 | 4:32 PM
Pushpa 2: పుష్ప 2లో అల్లు అర్జున్ కట్టిన చీర ప్రత్యేకత ఏంటో తెలుసా.. అది ఎవరిదంటే

ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ గా వినిపిస్తోన్న సినిమా పేరు ఏదైనా ఉందా అంటే అది సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప 2 చిత్రమే. ఈ ఏడాది ఆగస్ట్ లో ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే పుష్ప 2 షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇక ఈ సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. పుష్ప 2తో పాన్ ఇండియా బాక్సాఫీస్ ను రూల్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలో కొన్ని రోజుల నుంచి వరుసగా పుష్ప 2 నుంచి అప్డేట్స్ వస్తున్నాయి. ముందుగా శ్రీవల్లి పోస్టర్ ను రిలీజ్ చేయగా.. తాజాగా బన్నీ బర్త్ డే సందర్భంగా విడుదల చేసిన టీజర్ దుమ్ము రేపుతోంది.

అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్బంగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. రోజుల గడుస్తున్నా.. రికార్డులు వేట మాత్రమే  కొనసాగుతోంది. ఇక టీజర్ లో బన్నీ తన విశ్వరూపం చూపించాడు. గంగమ్మ తల్లి జాతరబ్యాగ్రౌండ్ లో వచ్చిన ఈ సీన్ సినిమాకే హైలెట్ అంటున్నారు. ఇక లేడీ గెటప్ లో బన్నీ రచ్చ చేశాడు. మరోసారి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక పుష్ప 2 సినిమాలు ఈ ఫైట్ సీనే హైలెట్ అంటున్నారు. సినిమా యూనిట్ కూడా ఇదే చెబతుంది.

Who owns Allu Arjun's sari

ఇక యూట్యూబ్ లో పుష్ప 2 టీజర్ రికార్డుల వేట కొనసాగిస్తుండగా.. ప్రస్తుతం అందరి దృష్టి బన్నీ ధరించి చీర మీదనే ఉంది. ఇప్పుడు ఈ చీర గురించి పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. బన్నీ కట్టుకున్న ఆ చీరకు ఓ ప్రత్యేకత ఉందని.. మదర్ సెంటిమెంట్ తో ముడిపడి ఉందని అంటున్నారు. ఇక ఈ సీన్ లో ఐకాన్ స్టార్ కట్టిన చీర నిజానికి బన్నీ అమ్మ గారిదట. సెంటిమెంట్ గా ఉంటుందని భావించి డైరెక్టర్ సుకుమార్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ ఫైట్ సీన్ సినిమాలో ఎలా ఉండబోతుందో అని ప్రేక్షకులు ఆత్రుతగా ఎదదురు చూస్తున్నారు.

ఈ ఏడాది, ఆగస్టు 15న పుష్ప 2 సినిమా విడుదల కానుంది. ఇక ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా..రావు రమేష్, ఫహద్ ఫాజిల్, అనసూయ, సునీల్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ సంగీతాన్ని అందిస్తున్నారు..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి