iDreamPost

అఫీషియల్: పుష్ప 2ను ఢీకొట్టనున్న డబుల్ ఇస్మార్ట్.. పూరీ Vs సుకుమార్

Puri Jagannadh Vs Sukumar వారియర్, స్కంద చిత్రాల తర్వాత రామ్ పోతినేని నుండి రాబోతున్న మూవీ డబుల్ ఇస్మార్ట్. హిట్ మూవీ ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్. పూరీ జగన్నాథ్ దర్శకుడు ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసింది. అయితే..

Puri Jagannadh Vs Sukumar వారియర్, స్కంద చిత్రాల తర్వాత రామ్ పోతినేని నుండి రాబోతున్న మూవీ డబుల్ ఇస్మార్ట్. హిట్ మూవీ ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్. పూరీ జగన్నాథ్ దర్శకుడు ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసింది. అయితే..

అఫీషియల్: పుష్ప 2ను ఢీకొట్టనున్న డబుల్ ఇస్మార్ట్.. పూరీ Vs సుకుమార్

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నుండి వస్తున్న నెక్ట్ ప్రాజెక్ట్ డబుల్ ఇస్మార్ట్. ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్. కావ్య థాపర్ హీరోయిన్. బాలీవుడ్ ఒకప్పటి అగ్ర హీరో సంజయ్ దత్ నెగిటివ్ రోల్‌లో కనిపిచంబోతున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకుడు. ఐదేళ్ల గ్యాప్ తర్వాత పూరీ-రాపో కాంబోలో వస్తున్న చిత్రం ఇది. ఇటీవల ఈ మూవీ టీజర్ విడుదలై ఆకట్టుకున్న సంగతి విదితమే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. పాటలు మినహా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తయ్యిందని తెలుస్తుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న సంగతి విదితమే. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై ఛార్మి కౌర్, పూరీ జగన్నాధ్ నిర్మిస్తున్న ఈ చిత్రం‌పై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది.

తొలుత ఈ మూవీని ఈ ఏడాది మార్చిలో రిలీజ్ చేయాలని అనుకున్నారు మేకర్స్. అయితే జూన్.. అలాగే జులైకు అంటూ నెలలు మారుతున్నాయి తప్ప అధికారిక ప్రకటన రాలేదు. తాజాగా ఈ సినిమా అఫిషియల్ డేట్ ఎనౌన్స్ వచ్చేసింది. ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. రాపో మాస్ ఫోటోతో అప్ డేట్ ఇచ్చింది. ఇదిలా ఉంటే.. ఇందులో రామ్ మరింత ఎనర్జిటిక్‌గా టీజర్లో చూపించాడు పూరీ. ఈ యంగ్ హీరోను ఢీ కొట్టేందుకు పవర్ ఫుల్ క్యారెక్టర్ డిజైన్ చేసి సంజయ్ దత్‌ను రంగంలోకి దింపాడు. లైగర్ మూవీతో ప్లాప్ అందుకున్న ఈ దర్శకుడికి డబుల్ ఇస్మార్ట్ హిట్ కొట్టడం ఇప్పుడు కీలకం. అయితే ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ డేట్ ఎనౌన్స్ .. హాట్ టాపిక్ అయ్యింది. స్వాతంత్ర్య దినోత్సవం నాడే ఈ మాస్ మూవీ రిలీజ్ కాబోతుంది. అయితే ఇది కాదు సమస్య.

తెలుగులో ప్రెస్టిజియస్ ప్రాజెక్టుగా భావిస్తున్న పుష్ప 2కు అదే రోజు రిలీజ్ కాబోతుంది. ఎప్పటి నుండే మేకర్స్ ఆగస్టు 15న సినిమా రిలీజ్ చేస్తామని ప్రకటించింది చిత్ర యూనిట్. ఇది కూడా పుష్పకు సీక్వెల్ అన్న సంగతి విదితమే. అల్లు అర్జున్ కు ఈ మూవీతో పాన్ ఇండియా లెవల్లో పేరు వచ్చింది. ఈ చిత్రం కోసం రెండేళ్ల నుండి కష్టపడుతున్నాడు బన్నీ. అయితే ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతుందని, సినిమా వాయిదా పడే అవకాశాలున్నాయని టాలీవుడ్ కోడై కూస్తుంది. కానీ మేకర్స్ నుండి ఎలాంటి అఫీషియల్ ఎనౌన్సెమెంట్ రాలేదు. దీంతో ఆగస్టు బరి నుండి అర్జున్ మూవీ తప్పుకోనుందన్న వార్త హల్ చల్ చేస్తుంది. ఈ నేపథ్యంలో డబుల్ ఇస్మార్ట్.. ఆ డేట్ పై కర్చీఫ్ వేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఇద్దరు బడా డైరెక్టర్స్ మధ్య సైలెంట్ వార్ స్టార్ అయ్యేట్లు కనిపిస్తుంది. పుష్ప 2 వెనక్కు తగ్గిందని తెలిసి..పూరీ ఈ మూవీ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశాడో  తెలియాల్సి ఉంది. ఇటీవల ఓజీ సెప్టెంబర్ నుండి తప్పుకోవడంతో.. ఆ ప్లేసులోకి దేవర వచ్చి చేరిన సంగతి విదితమే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి