iDreamPost

పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే పదేళ్ల జైలు, రూ. కోటి జరిమానా!

పోటీ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్, పేపర్ లీక్ లకు పాల్పడే వారికి కళ్లెం వేసేందుకు కేంద్రం కొత్త బిల్ ను తీసుకొచ్చింది. దీని ప్రకారం అక్రమాలకు పాల్పడే నిందితులకు పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ. కోటి జరిమానా విధించనున్నారు.

పోటీ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్, పేపర్ లీక్ లకు పాల్పడే వారికి కళ్లెం వేసేందుకు కేంద్రం కొత్త బిల్ ను తీసుకొచ్చింది. దీని ప్రకారం అక్రమాలకు పాల్పడే నిందితులకు పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ. కోటి జరిమానా విధించనున్నారు.

పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే పదేళ్ల జైలు, రూ. కోటి జరిమానా!

దేశంలో అక్కడక్కడ ప్రశ్నపత్రాల లీకులు, హైటెక్ మాస్ కాపీయింగ్ వంటి ఘటనలు చోటుచేసుకోవడం ఆందోళనకరంగా మారింది. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే పోటీపరీక్షల్లో అవకతవకలకు పాల్పడి ఉద్యోగాలు పొందాలని చూస్తుంటారు. మరికొంత మంది ఏకంగా అధికారులతో కుమ్మక్కై అక్రమాలకు తెరలేపుతుంటారు. ఇలాంటి వారి భరతం పట్టేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ. కోటి జరిమానా విధించనున్నది. దీనికోసం కేంద్రం బిల్లును రూపొందించి పార్లమెంటులో ప్రవేశపెట్టింది. పోటీ పరీక్షల్లో అవకతవకలకు పాల్పడే వారికి ఈ బిల్లుతో వారి ఆటలకు అడ్డుకట్ట వేయొచ్చని భావిస్తున్నారు.

ఉద్యోగ, పోటీ పరీక్షల్లో జరిగే అక్రమాలతో నిజాయితీగల అభ్యర్థులు, ప్రతిభ కలిగిన వారు తీవ్రంగా నష్టపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ వైఫల్యాలతో పేపర్ లీకులు, మాస్ కాపీయింగ్ వంటివి చోటుచేసుకుంటున్నాయి. ఇలా అక్రమాలకు పాల్పడే వారిని అడ్డుకునేందుకు పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్‌ మీన్స్‌ పేరుతో బిల్లును కేంద్రమంత్రి ప్రవేశపెట్టారు. ఈ బిల్లుతో పోటీపరీక్షల్లో అవకతవకలు, పేపర్ లీకేజీలు సహా ఇతర చట్ట ఉల్లంఘనలు చేస్తే వారికి పదేళ్ల జైలు శిక్షతోపాటు రూ. కోటి ఫైన్ విధించనున్నారు.

If you commit irregularities in competitive exams, you will be jailed in Padesh

లోక్ సభలో ప్రివెన్షన్ ఆఫ్ అన్ ఫెయిర్ మీన్స్ బిల్లు – 2024 కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రకారం పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడే నిందితులపై నేరం రుజువైతే గరిష్ఠంగా 10 ఏళ్ల జైలు శిక్ష, రూ. కోటి వరకు జరిమానా విధించనున్నారు. ఈ బిల్లు చట్టంగా మారి అమల్లోకి వస్తే.. మాస్ కాపీయింగ్, పేపర్ లీకేజ్ కు పాల్పడే ముఠాల ఆగడాలకు అడ్డుకట్ట పడనుంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా టీఎస్పీఎస్సీలో పేపర్ లీకేజీల వ్యవహారం ప్రభుత్వాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. నిరుద్యోగుల నుంచి తీవ్రస్థాయిలో నిరసలనలు వ్యక్తమయ్యాయి. గ్రూప్ 1 ప్రశ్నాపత్రం లీక్ తో ఆ పరీక్షను వాయిదా వేసి అందుకు కారణమైన వారిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి