iDreamPost

లక్షలు సంపాదించే బిజినెస్.. ఇక్కడ స్థలాలు కొని అమ్మితే చాలు!

మీరు తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలను అందుకోవాలనుకుంటున్నారా? అయితే హైదరాబాద్ లోని ఆ ఏరియాల్లో స్థలాలపై పెట్టుబడులు పెడితే లక్షల్లో సంపాదించొచ్చు అంటున్నారు నిపుణులు.

మీరు తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలను అందుకోవాలనుకుంటున్నారా? అయితే హైదరాబాద్ లోని ఆ ఏరియాల్లో స్థలాలపై పెట్టుబడులు పెడితే లక్షల్లో సంపాదించొచ్చు అంటున్నారు నిపుణులు.

లక్షలు సంపాదించే బిజినెస్.. ఇక్కడ స్థలాలు కొని అమ్మితే చాలు!

ప్రస్తుత కాలంలో వ్యాపారం చేసే వారి సంఖ్య పెరిగిపోతోంది. కొందరు డైరీ ఫామ్స్, పౌల్ట్రీ ఫామ్స్, టెంట్ హౌజ్, ప్రైవేట్ ట్రావెల్స్ వంటి ఇతర బిజినెస్ లు చేస్తూ అధిక ఆదాయాలను పొందుతున్నారు. అయితే కొన్ని కొన్ని సార్లు ఈ రకమైన వ్యాపారాల్లో నష్టాలు కూడా వచ్చే అవకాశం ఉంది. మరి నష్టమే లేకుండా లాభాలను పొందాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారా? తక్కువ సమయంలోనే లక్షలు సంపాదించి ఆర్థికంగా నిలదొక్కుకోవాలని భావిస్తున్నారా? అయితే మీలాంటి వారు స్థలాలపై పెట్టుబడి పెడితే భవిష్యత్తులో అధిక రాబడులను పొందే వీలుంటుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. అయితే హైదరాబాద్ శివారు ప్రాంతాలైన ఆ ఏరియాల్లో స్థలాలు కొని అమ్మితే లక్షలు సంపదించే వీలుంటుందని చెబుతున్నారు.

భూమిపై పెట్టుబడిపెడితే ఎప్పటికైనా లాభాలే తప్ప నష్టాలు ఉండవనే చెప్పాలి. స్థలాలపై ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ కారణం చేత భూమికి డిమాండ్ పెరిగిపోయి లభ్యత కూడా తగ్గిపోయింది. రానున్న రోజుల్లో స్థలాల ధరలు ఆకాశాన్నంటుతాయనడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి మీరు రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టినట్లైతే మీ వ్యాపారాన్ని లక్షలు ఆర్జించే వ్యాపారంగా మార్చుకోవచ్చు. హైదరాబాద్ నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో కూడా మౌళిక సదుపాయాల కల్పన జరుగుతుండడంతో సిటీతో పాటు ఆయా ప్రాంతాల్లో స్థలాల రేట్లు పెరిగిపోతున్నాయి. కాగా మీరు నగర శివారు ప్రాంతాలైన చౌటుప్పల్, ముచ్చెర్ల ఏరియాల్లో ఇన్వెస్ట్ చేస్తే అతి తక్కువ సమయంలోనే రెట్టింపు లాభాలను అందుకోవచ్చంటున్నారు.

ముచ్చెర్ల విషయానికొస్తే.. ఈ ఏరియాలో ప్రస్తుతం చదరపు అడుగు ధర రూ. 850 పలుకుతోంది. ఈ ధరతో మీరు 1500 స్క్వేర్ ఫీట్ల స్థలాన్ని కొనుగోలు చేసినట్లైతే మీకు రూ. 12,75,000 అవుతుంది. మీరు ఒక సంవత్సర కాలం పాటు వేచి చూసి ఆ తర్వాత అమ్ముకున్నట్లైతే రెట్టింపు లాభాలు రావడం ఖాయం. ప్రస్తుతం ఉన్న ధర ఏడాది తర్వాత చదరపు అడుగుకు రూ. 1200 అయ్యిందనుకుందాము. అప్పుడు మీరు 1500 స్క్వేర్ ఫీట్ల స్థలాన్ని అమ్ముకున్నట్లైతే రూ. 18,00,000 లక్షలు వస్తుంది. ఈ ప్రకారంగా మీకు రూ. 5 లక్షలకు పైగానే రాబడి వస్తుంది. ముచ్చెర్లలో రోడ్ కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ కూడా ఉండడంతో ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేసేందుకు ఇన్వెస్టర్లు ఎక్కువగా ఇంట్రెస్టు చూపిస్తున్నారు. ఎయిర్ పోర్టు సమీప దూరంలోనే ఉండడం, ఐటీ కారిడార్ కూడా దగ్గర్లోనే ఉండడం వల్ల ఐటీ ఉద్యోగులు ఈ ప్రాంతంలో స్థిరపడేందుకు మొగ్గు చూపుతున్నారు.

హైదరాబాద్ శివారు ప్రాంతమైన చౌటుప్పల్ కూడా పెట్టుబడులు పెట్టేందుకు అనుకూలమైన ప్రాతం. ప్రస్తుతం ఈ ప్రాంతంలో చదరపు అడుగు ధర రూ. 1200 గా ఉంది. ఈ ధరతో మీరు 1800 స్వ్కేర్ ఫీట్ స్థలాన్ని కొనుగోలు చేసినట్లైతే రూ. 18,00,000 లక్షలు అవుతుంది. ఏడాది తర్వాత చదరపు అడుగు ధర రూ. 1700 పలికిందనుకుందాము. అప్పుడు మీరుకొన్న స్థలాన్ని అమ్ముకున్నట్లైతే రూ. 30,60,000 వస్తుంది. అంటే దాదాపు మీకు 12 లక్షల వరకు ప్రాఫిట్ వస్తుంది. ఏడాది కాలంలో ఇంత ప్రాఫిట్ బ్యాంకులో కూడా రాదేమో కదా. కాబట్టి స్థలాలపై పెట్టుబడి పెట్టి లక్షల్లో లాభాలు పొందాలనుకునే వారు ఈ ఏరియాల్లో కొనుగోలు చేయడం లాభదాయకమని నిపుణులు వెల్లడిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి