iDreamPost

అప్పుడు చేయి అందిస్తారు.. కిందపడుతుంటే వదిలేస్తారు! పృథ్వీ షా షాకింగ్ పోస్ట్..

  • Author Soma Sekhar Published - 04:27 PM, Sun - 20 August 23
  • Author Soma Sekhar Published - 04:27 PM, Sun - 20 August 23
అప్పుడు చేయి అందిస్తారు.. కిందపడుతుంటే వదిలేస్తారు! పృథ్వీ షా షాకింగ్ పోస్ట్..

టీమిండియా క్రికెట్ లో పృథ్వీ షా అంతటి దురదృష్టవంతుడు ఇంకోరు ఉండరేమో. టీమిండియాలో చోటు దక్కక కొన్ని రోజులు బాధపడితే.. ప్లేస్ దక్కాక.. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు షా. దీంతో టీమిండియాలో చోటు కోల్పోయాడు. జట్టులో స్థానం కోల్పోయినప్పటి నుంచి షాలో కాస్త మార్పు వచ్చిందనే చెప్పాలి. కాగా.. ఇటీవల ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్ లో వరుస సెంచరీలు బాదాడు పృథ్వీ షా. అదీకాక రాయల్ వన్డే-కప్ లో ఓ డబుల్ సెంచరీ బాది రికార్డు నెలకొల్పాడు షా. దీంతో జాతీయ జట్టును పిలుపు వస్తుందని భావించాడు. ఈ క్రమంలోనే మళ్లీ గాయపడ్డాడు షా. మోకాలి గాయం కారణంగా అర్ధాంతరంగా టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్న షా.. సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ షేర్ చేశాడు.

అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా తయ్యారు అయ్యింది టీమిండియా క్రికెటర్ పృథ్వీ షా పరిస్థితి. ఇటీవల వరసగా సెంచరీల మీద సెంచరీలు బాదుతూ.. టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇస్తాడని అందరూ భావించారు. కానీ దురదృష్టం అతడిని గాయం రూపంలో వెంటాడింది. మోకాలికి గాయం కావడంతో.. అర్ధాంతరంగా ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్ నుంచి వెనుదిరిగాడు. ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నాడు పృథ్వీ షా. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ టీమిండియా క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఇంతకీ ఆ పోస్ట్ లో పృథ్వీ షా ఏం రాసుకొచ్చాడు అంటే? “జీవితంలో మనం పైకి ఎదిగినప్పుడు కొందరు చేయి అందిస్తారు. ఇక మనం కింద పడిపోతుంటే.. అలానే వదిలేస్తారు” అని మోకాలికి కట్టు కట్టి.. మెట్లపై నుంచి దిగుతున్న పిక్ ను షా తన ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. కాగా.. ఫిట్ నెస్ సమస్య ఒకవైపు అయితే, వివాదాలు మరోవైపు. ఈ సమస్యలతో ఇబ్బంది పడుతూ జట్టులోకి రాలేకపోతున్నాడు షా. ఈ మధ్యే ఫిట్ నెస్ సాధించి ఫామ్ లోకి వచ్చాడు. కానీ గాయం కారణంగా మళ్లీ జట్టులోకి ఎప్పుడు వస్తాడో తెలియని పరిస్థితి. ఇక పృథ్వీ షా గాయం నుంచి త్వరగా కోలుకోవాలని సచిన్ తనయుడు అర్జున్ టెండుల్కర్ ఆకాంక్షించాడు. ఈ మేరకు ఇన్ స్టాలో “నువ్వు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా.. మానసికంగా స్ట్రాంగ్ గా ఉండు బడ్డీ” అంటూ కామెంట్ చేశాడు. మరి పృథ్వీ షా పెట్టిన పోస్ట్ ఎరిని ఉద్దేశించో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.


ఇదికూడా చదవండి: 47 ఏళ్ల వయస్సులో దిగ్గజ క్రికెటర్ థండర్ ఇన్నింగ్స్! ఫోర్లు, సిక్సర్ల వర్షం..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి