iDreamPost

లాక్ డౌన్ టైంలో ప్రైమ్ సినిమాల సందడి

లాక్ డౌన్ టైంలో ప్రైమ్ సినిమాల సందడి

ఊహించని ఉత్పాతంలా విరుచుకుపడిన కరోనా దెబ్బకు థియేటర్లు మూతబడి ఇరవై రోజులు దాటేసింది. ఇంకెంత కాలం కొనసాగుతుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. ఆ సమయంలో అప్పుడే హళ్ళలో ఫ్రెష్ గా రిలీజైన సినిమాలు దీని దెబ్బకు దారుణంగా ఫైనల్ రన్ కు వచ్చేసాయి. తర్వాత చూద్దాంలే అనుకున్న ప్రేక్షకులకు షాక్ ఇస్తూ మొత్తం స్థంబించిపోయింది. అయితే లాక్ డౌన్ వల్ల ఇంట్లోనే ఉన్న జనానికి ఊరట కలిగేలా అప్పుడు అలా మాయమైన మూవీస్ అమెజాన్ ప్రైమ్ లాంటి ఓటిటి యాప్స్ వల్ల చాలా త్వరగా చూసే వీలు కలుగుతోంది.

గత నెల 13న సైకలాజికల్ థ్రిల్లర్ గా మంచి ప్రీ రిలీజ్ బజ్ తో వచ్చిన ‘మధ’ ఏప్రిల్ 8వ తేది నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు ప్రైమ్ అధికారికంగా ప్రకటించింది. యంగ్ లేడీ డైరెక్టర్ శ్రీవిద్య బసవ దర్శకత్వం వహించిన ఈ డెబ్యు మూవీకి పరిశ్రమ వర్గాల నుంచి మంచి మద్దతు దక్కింది. డార్క్ క్రైమ్ నేపధ్యంలో మానసిక శాస్త్రాన్ని ముడిపెడుతూ తీసిన విధానం ఓ వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఇప్పుడు ఆన్ లైన్ లోకి వచ్చేస్తోంది కాబట్టి ఎక్కువ శాతం జనం చూసేస్తారు.

ఇక ఇదే తరహలో చిన్న సినిమాగా సోషల్ ఇష్యూ మీద తీసిన పలాస 1978 ఆల్రెడీ వచ్చేసింది. మొన్నటి నుంచి ప్రైమ్ లోనే అందుబాటులో ఉంచారు. కరుణకుమార్ డైరెక్టర్ గా చేసిన ఈ మూవీ కూడా డెబ్యునే. విమర్శకుల ప్రశంసలు అందుకున్న పలాసకు సైతం భారీ స్పందన ఆశిస్తోంది యూనిట్. ఇదే తరహాలో గత రెండు మూడు నెలల్లో రిలీజైన సినిమాలన్నీ ఓటిటిలో క్యు కట్టి వచ్చేస్తున్నాయి. వచ్చే వారం విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ కూడా రాబోతోంది. ఇప్పటికే డిస్కో రాజా, జాను, రాజావారు రాణివారు, అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి, ఒక చిన్న విరామం లాంటి 2020లో వచ్చిన సినిమాలు సదరు యాప్స్ లో సందడి చేస్తున్నాయి. ఇప్పుడు మధ, పలాస లాంటివి కూడా అందుబాటులోకి రానుండటంతో ఇంటి నుంచి కదలకుండానే కొత్త సినిమాలు ఎంజాయ్ చేసే ఛాన్స్ ప్రేక్షకులకు దొరికింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి