iDreamPost

Redmi Note 13 5G: రూ.17 వేలలోపే రెడ్ మీ 5జీ ఫోన్.. ఫ్లాగ్ షిప్ తరహా ఫీచర్స్

స్మార్ట్ ఫోన్ అంటే ఇప్పుడు 5జీ ఫోన్ అనే పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు షావోమీ కంపెనీ నుంచి అద్భుతమైన ఫీచర్లతో 5జీ ఫోన్లు వస్తున్నాయి.

స్మార్ట్ ఫోన్ అంటే ఇప్పుడు 5జీ ఫోన్ అనే పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు షావోమీ కంపెనీ నుంచి అద్భుతమైన ఫీచర్లతో 5జీ ఫోన్లు వస్తున్నాయి.

Redmi Note 13 5G: రూ.17 వేలలోపే రెడ్ మీ 5జీ ఫోన్.. ఫ్లాగ్ షిప్ తరహా ఫీచర్స్

స్మార్ట్ ఫోన్.. ఎవరు చూసినా స్మార్ట్ ఫోన్లే కొనుగోలు చేస్తున్నారు. అందులోనూ మంచి ఫీచర్స్ ఉన్న 5జీ ఫోన్ కావాలని కోరుకుంటున్నారు. గతేడాదితో పోలిస్తే.. ఇప్పుడు బడ్జెట్ ధరలో చాలానే 5జీ ఫోన్లు వస్తున్నాయి. పెద్ద పెద్ద కంపెనీలు కూడా మిడిల్ క్లాస్ రేంజ్ లో అదిరిపోయే 5జీ నెట్ వర్క్ ఫోన్లలను విక్రయిస్తున్నాయి. కొత్త కొత్త మోడల్స్ ని కూడా తీసుకొస్తున్నాయి. ఇప్పుడు అలాంటి జాబితాలోకి రెడ్ మీ నోట్ 13 5జీ మోడల్స్ కూడా చేరబోతున్నాయి. ఇప్పటికే ఈ ఫోన్లకు సంబంధించిన పూర్తి వివరాలు, ధరను కంపెనీ వెల్లడించింది. ఇప్పుడు ఇవి బెస్ట్ బడ్జెట్ 5జీ ఫోన్లు అయ్యే ఛాన్సెస్ మెండుగా ఉన్నాయి.

రెడ్ మీ ఫోన్లకు ఇండియాలో మంచి మార్కెట్ ఉంది. గతంలో అయితే స్మార్ట్ ఫోన్ అంటే రెడ్ మీ అనే పరిస్థితి కూడా ఉండేది. కానీ, భారత్ తో చైనా కయ్యాల కారణంగా ఈ ఫోన్ మార్కెట్ మీద కూడా ప్రభావం చూపించింది. ప్రస్తుతం మెల్ల మెల్లగా రెడ్ మీ అమ్మకాలు కూడా గాడిలో పడుతున్నాయి. మేక్ ఇన్ ఇండియా అనే స్లోగన్ ని షావోమీ కంపనీ భారతీయుల్లోకి బాగా తీసుకెళ్లింది. కొత్త సంవత్సరంలో ఇప్పుడు కొత్తగా బడ్జెట్ 5జీ మోడల్స్ తో మార్కెట్ ని షేక్ చేసేందుకు రెడీ అయిపోయింది. రెడ్ మీ నోట్ 13, నోట్ 13 ప్రో, నోట్ 13 ప్రో+ మోడల్స్ తో షావోమీ కంపెనీ కొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తోంది. ఈ ఫోన్లు బడ్జెట్ ధరలోనే ఉండటం కాకుండా.. అదిరిపోయే ఫీచర్లతో వస్తున్నాయి. ముఖ్యంగా ఫ్లాగ్ షిప్ తరహా ఫీచర్స్ ఈ ఫోన్లలో ఉండటం విశేషం. ధర మాత్రం కేవలం రూ.16,999 నుంచే ప్రారంభం అవుతున్నాయి. అలాగే ఈ సిరీస్ ఫోన్లలో ప్రీమియం మోడల్స్ కూడా ఉన్నాయి. రెడ్ మీ నోట్ 13 ప్రో, 13 ప్రో+ ప్రీమియం సెగ్మెంట్ లో వస్తున్నాయి.

జనవరి 10వ తారీఖు నుంచి ఈ రెడ్ మీ నోట్ 13 5జీ ఫోన్ సిరీస్ ఫోన్ల విక్రయాలు అధికారికంగా ప్రారంభమవుతాయి. ఈ రెడ్ మీ నోట్ 13 5జీ ఫోన్ మొత్తం 3 వేరియంట్లలో అందుబాటులో ఉంది. వాటిలో 6 జీబీ ర్యామ్+ 128 జీబీ స్టోరేజ్ ఒకటి. దాని ధర రూ.16,999గా ఉంది. అలాగే ఇందులో 8 జీబీ ర్యామ్+ 256 స్టోరేజ్, 12 జీబీ ర్యామ్+ 256 స్టోరేజ్ వేరియంట్స్ కూడా ఉన్నాయి. వీటి ధరలు రూ.18,999, రూ.20,999గా ఉన్నాయి. ఈ ధరలన్నీ బ్యాంకు ఆఫర్లతో కలిపి నిర్ణయించిన ధరలు. లాంఛింగ్ ఆఫర్ గా ఈ స్పెషల్ ధరల్లో ఫోన్లను విక్రయిస్తున్నారు. ఇంక ప్రీమియం మోడల్స్ గా వస్తున్న.. 13 ప్రో వేరియంట్స్ ధరలు 8జీబీ ర్యామ్+ 128 స్టోరేజ్ ధర రూ.25,999కాగా 8 జీబీ ర్యామ్+ 256 జీబీ స్టోరేజ్ ధర రూ.27,999గా ఉంది. 12 జీబీ+ 256 వేరియంట్ ధర రూ.29,999గా నిర్ణయించారు. ప్రో+ వేరియంట్ల ధరలు రూ.31,999, రూ.33,999, రూ.35,999గా ఉన్నాయి. వీటిపై బ్యాంకు ఆఫర్లు, ప్రత్యేక తగ్గింపులు అందుబాటులో ఉంటాయి.

స్పెసిఫికేషన్స్:

ఈ రెడ్ మీ 13 మోడల్స్ లో ఇండియా రెడీ 5జీ కనెక్టివిటీ, 4జీ లైట్ ఆప్షన్స్ ఉంటాయి. చాలా సన్నని డిజైన్ తో వస్తూ ఉంటుంది. ఇందులో 120 హెట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. స్మూత్ టచ్ స్క్రీన్ ఫీల్ ను పొందగలుగుతారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో ఈ రెడ్ మీ నోట్ 13 మోడల్స్ వస్తున్నాయి. 33 వాట్స్ సూపర్ ఫాస్ట్ ఛార్జర్ లభిస్తుంది. సౌడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. షావోమీ కంపెనీ నాలుగేళ్ల పాటు సెక్యూరిటీ అప్ డేట్స్ ఇస్తామంటూ మాటిస్తోంది.

ఆశ్చర్యకరంగా 3 ఆండ్రాయిడ్ అప్ డేట్స్ ను ప్రకటించింది. అంటే ఆండ్రాయిడ్ 16 వరకు కంపెనీ మీకు అప్ డేట్స్ ని ఇస్తుంది. 1000 నిట్స్ బ్రైట్ నెస్ ఉంటుంది. అంటే డే లైట్ లో కూడా స్క్రీన్ ఇబ్బంది లేకుండా కనిపిస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై, 3.5 ఎంఎం జాక్, బ్లూటూత్ 5.3 వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఇంక రెడ్ మీ నోట్ 13 ప్రో మోడల్స్ స్పెసిఫికేషన్స్ చూస్తే.. 1800 నిట్స్ డిస్ ప్లే, 6.67 ఇంచెస్ ఆమెలెడ్ డిస్ ప్లే, 1.5కే రెజల్యూషన్, కోర్నింగ్ గొరిల్లా గ్లాస్, 200 మెగాపిక్సల్ కెమెరా, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా వంటి ఫీచర్స్ ఉన్నాయి. ప్రీమియం ఫోన్ కోసం చూస్తున్న కస్టమర్లకు ఇవి మంచి ఆప్షన్ అవుతుంది. మరి.. రెడ్ మీ నోట్ 13 5జీ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ ఫోన్లపై మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి