iDreamPost

రూ.15 వేలలోపే 5G ఫోన్.. అదిరిపోయే ఫీచర్లుకూడా..!

Budget Friendly 5G Phone: ఇప్పుడు స్మార్ట్ ఫోన్ అంటే 5జీ ఫోనే అనే పరిస్థితి కనిపిస్తోంది. అందుకే బడ్జెట్ లో రిలీజ్ అయిన ఒక బెస్ట్ 5జీ ఫోన్ ని మీకోసం తీసుకొచ్చాం.

Budget Friendly 5G Phone: ఇప్పుడు స్మార్ట్ ఫోన్ అంటే 5జీ ఫోనే అనే పరిస్థితి కనిపిస్తోంది. అందుకే బడ్జెట్ లో రిలీజ్ అయిన ఒక బెస్ట్ 5జీ ఫోన్ ని మీకోసం తీసుకొచ్చాం.

రూ.15 వేలలోపే 5G ఫోన్.. అదిరిపోయే ఫీచర్లుకూడా..!

స్మార్ట్ ఫోన్ అంటే ఇప్పుడు 5జీ ఫోనే అన్నట్లుగా మారిపోయింది. ఎక్కడ చూసినా కొత్త ఫోన్ కొనాలి అంటే వినియోగదారులు 5జీ ఫోన్ కోసమే వెతుకుతున్నారు. అయితే మంచి ఫీచర్స్ ఉన్న 5జీ స్మార్ట్ ఫోన్ కొనాలి అంటే రూ.20 వేలకు పైమాటే. కానీ, ఇప్పుడు చాలా కంపెనీలు బడ్జెట్ లోనే 5జీ ఫోన్లను లాంఛ్ చేస్తున్నాయి. తాజాగా మార్కెట్ లోకి ఒప్పో కంపెనీ నుంచి ఒక సరికొత్త 5జీ స్మార్ట్ ఫోన్ ని లాంఛ్ చేశారు. ధర కూడా కేవలం రూ.15 వేలలోపే ఉండటం మరో విశేషం. మరి.. ఆ ధరలో వస్తున్న స్మార్ట్ ఫోన్ లో ఏం ఫీచర్స్ ఉన్నాయి? ఆ ధరకు 5జీ ఒప్పో స్మార్ట్ ఫోన్ కొనడం కరెక్టేనా? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఒప్పో కంపెనీకి భారతీయ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. వారి నుంచి వచ్చే మోడల్స్ కు వినియోగదారుల ఆదరణ కూడా ఉంది. 4జీలో అయితే చాలానే బడ్జెట్ ఫోన్స్ ని ఒప్పో రిలీజ్ చేసింది. ఇప్పుడు అలాగే కస్టమర్స్ కోసం రూ.15 వేలలోపు ధరతో 5జీ స్మార్ట్ ఫోన్ ని కూడా లాంఛ్ చేశారు. ఒప్పో ఏ59 5జీ పేరుతో ఈ మోడల్ ని మార్కెట్ లోకి విడుదల చేశారు. ఇందులో 4జీబీ ర్యామ్+ 128 జీబీ స్టోరేజ్, 6జీబీ ర్యామ్+ 128 జీపీ స్టోరేజ్ వేరియంట్లు ఉన్నాయి. ఈ ఫోన్ 4జీబీ+ 128 జీపీ వేరియంట్ ఎమ్మార్పీ రూ.17,999కాగా రూ.3 వేల తగ్గింపుతో రూ.14,999కే అందిస్తున్నారు. 6జీబీ ర్యామ్+ 128 వేరియంట్ రూ.16,999కే అందుబాటులో ఉంది. ఈ ధర మీద కూడా బ్యాంక్ ఆఫర్స్, ఎక్స్ ఛేంజ్ ఆఫర్స్ ఉన్నాయి. ఎస్ బీఐ, ఐపీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి సెలక్టివ్ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేసిన వారికి అదనంగా రూ.1500 వరకు తగ్గింపు కూడా లభిస్తోంది. అంటే ఈ ఫోన్ ని మీరు రూ.13,499కే పొందే అవకాశం ఉంది. ఈ ఒప్పో ఏ59 5జీ స్మార్ట్ ఫోన్ ని డిసెంబర్ 25 నుంచే ప్రముఖ ఇ-కామర్స్ సైట్ ఫ్లిప్ కార్ట్ లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది.

ఇంక ఈ ఒప్పో ఏ50 5జీ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ విషయానికి వస్తే.. మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్ తో వస్తోంది. 6.56 ఇంచెస్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే, 90 హెట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తోంది. ఇందులో 13 ఎంపీ+ 2 ఎంపీ బ్యాక్ కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్స్ సూపర్ వూక్ ఛార్జర్ తో వస్తోంది. అల్ట్రా వాల్యూమ్ మోడ్, ఇన్ క్రైడబుల్ కెమెరా సెటమ్, ఏఐ పోట్రెయిట్ రీటచ్చింగ్, ఐపీ 54 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. అలాగే ఇది గ్లోయింగ్ సిల్క్ డిజైన్ తో వస్తోంది. బ్యాంకు కార్డుల మీద 6 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నారు. మరి.. ఈ ఒప్పో ఏ59 5జీ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్, ధరపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి