iDreamPost

మగధీర నా ఫేవరెట్ మూవీ: ప్రేమలు హీరోయిన్ మమితా బైజు

  • Published Mar 04, 2024 | 4:54 PMUpdated Mar 04, 2024 | 4:54 PM

మలయాళ బ్లాక్ బస్టర్ హిట్ అయిన ప్రేమలు సినిమా ఈ మహాశివరాత్రి సందర్భంగా తెలుగులో విడుదలవుతున్న విషయం తెలిసిందే. కాగా, ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన మమితా బైజు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తెలుగులో ఆ సినిమా అంటే చాలా ఇష్టమని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

మలయాళ బ్లాక్ బస్టర్ హిట్ అయిన ప్రేమలు సినిమా ఈ మహాశివరాత్రి సందర్భంగా తెలుగులో విడుదలవుతున్న విషయం తెలిసిందే. కాగా, ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన మమితా బైజు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తెలుగులో ఆ సినిమా అంటే చాలా ఇష్టమని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

  • Published Mar 04, 2024 | 4:54 PMUpdated Mar 04, 2024 | 4:54 PM
మగధీర నా ఫేవరెట్ మూవీ: ప్రేమలు హీరోయిన్ మమితా బైజు

మహాశివరాత్రి సందర్భంగా ఈ వారం రెండు తెలుగు సినిమాలతో పాటు ఓ డబ్బింగ్ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది . ఆ సినిమా మరేదో కాదు ఇటీవలి కాలంలో తెగ పాపులర్ అయిన “ప్రేమలు”. ఈ మలయాళ సినిమా ఫిబ్రవరి 9న థియేటర్లలో విడుదలైంది. అద్భుతమైన మౌత్ టాక్ తెచ్చుకుని తెలుగు ప్రేక్షకులను కూడా అలరించింది. ఇప్పటికీ ఈ సినిమా హైదరాబాద్ లోని మల్టీ ప్లెక్స్ లలో ఆడతుండటం విశేషం. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన మమితా బైజుకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. కాగా ఇప్పటికే స్ట్రెయిట్ తెలుగు సినిమాల్లో తనని నటింపజేసెందుకు సంప్రదింపులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మగధీర తన ఫేవరెట్ మూవీ అని హీరోయిన్ మమితా బైజు తెలిపారు.

సూపర్ హిట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద లాంగ్ రన్ ని చవిచూస్తూన్న ప్రేమలు సినిమా వంద కోట్ల వసూళ్ల దిశగా దూసుకుపోతుంది. ఈ సినిమా తెలుగు వెర్షన్ మార్చి 8న విడుదల అవుతుంది. కాగా తెలుగు వెర్షన్ హక్కుల్ని రాజమౌళి తనయుడు కార్తికేయ దక్కించుకున్నారు. తెలుగు వెర్షన్ ప్రమోషన్స్ కోసం ప్రేమలు హీరోయిన్ మమితా బైజు తాజాగా తెలుగు ఇంటర్వ్యూ లో పాల్గొని షూటింగ్ అనుభవాలతో పాటు రామ్ చరణ్, ఎస్ ఎస్ రాజమౌళి పై తనకి ఉన్న ఇష్టాన్ని చెప్పుకున్నారు.

ప్రేమలు మూవీ తెలుగు ప్రమోషన్ లో భాగంగా మమితా బైజు, అలాగే సినిమాలో ఒక కీలక పాత్రలో నటించిన సంగీత్ ప్రతాప్ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలోనే తెలుగు సినిమాలు కూడా చిన్నప్పటి నుంచే చూస్తున్నట్లుగా మమితా తెలిపారు. కొన్ని డబ్ వెర్షన్ చూస్తే, మరికొన్ని డైరెక్ట్ తెలుగు సినిమాలు చూసినట్లు తెలిపారు. ఇక మగధీర తన ఫెవరేట్ సినిమా అని చెప్పిన మమితా… హీరో రామ్ చరణ్ తో కలిసి ఒక్క సినిమా అయినా చేయాలనే ఆశ ఉన్నట్లు తెలిపారు.. కాగా మలయాళంలో “ధీర”గా డబ్ అయిన మగధీర సినిమాని ఎన్నో సార్లు చూసానని, ఆ సినిమా కోసం ప్రతి శనివారం టైం టేబుల్ సెట్ చేసుకుని మరీ చూసిన సందర్భాన్ని, ఎగ్జామ్స్ వచ్చినా కూడా మగధీర సినిమాకోసం టైం కేటాయించడం వంటి విషయాలను చెప్పుకొచ్చారు. అలాంటిది ఇప్పుడు ప్రేమలు సినిమాని తెలుగులో రాజమౌళి కొడుకు డబ్ చేయడం ఆనందంగా ఉందని అన్నారు. రామ్ చరణ్ తో పాటు అల్లు అర్జున్ అంటే కూడా ఎంతో ఇష్టమని మమితా బైజు.. ఆర్య, హ్యాపీ, రేసుగుర్రం వంటి సినిమాలు చూసి ఎంజాయ్ చేసినట్లు చెప్పారు.

ఇక ప్రేమలు విషయానికి వస్తే హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లోనే ఈ సినిమా తెరకెక్కడం వల్ల తెలుగు ప్రేక్షకులకి ఖచ్చితంగా నచ్చుతుందని ట్రేడ్ పండితులు అంటున్నారు. కాగా మల్టీప్లెక్స్ లలో ఈ సినిమాకు ఎక్కువ ఆదరణ దక్కుతుందని అంచనా వేస్తున్నారు. మరి రామ్ చరణ్, అల్లు అర్జున్ లని మమితా బైజు పొగడటంతో ఆ హీరోల అభిమానులు ప్రేమలు సినిమాకి తమ మద్దతు అందిస్తారేమో చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి