iDreamPost

హనుమాన్ గ్రాఫిక్స్ చేసింది హైదరాబాద్ కంపెనీ అని మీకు తెలుసా?

Hanuman Movie VFX Company Details: హనుమన్ చిత్రం పేరు ఇప్పుడు గ్లోబల్ లెవల్లో ట్రెండ్ అవుతోంది. అలాంటి సినిమా గ్రాఫిక్స్ చేసింది హైదరాబాద్ కంపెనీ అని మీకు తెలుసా?

Hanuman Movie VFX Company Details: హనుమన్ చిత్రం పేరు ఇప్పుడు గ్లోబల్ లెవల్లో ట్రెండ్ అవుతోంది. అలాంటి సినిమా గ్రాఫిక్స్ చేసింది హైదరాబాద్ కంపెనీ అని మీకు తెలుసా?

హనుమాన్ గ్రాఫిక్స్ చేసింది హైదరాబాద్ కంపెనీ అని మీకు తెలుసా?

సంక్రాంతి సంబరాలు ముగిశాయి. కానీ, సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిన్న సినిమా హనుమాన్ మాత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తూనే ఉంది. ప్రశాంత్ వర్మ యూనివర్స్ లో వచ్చిన తొలి సూపర్ హీరో చిత్రం ఇది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి.. అందరినీ మెస్మరైజ్ చేసేసింది ఈ మూవీ. అంతేకాకుండా ఓవర్సీస్ లో బడా బడా హీరోల కలెక్షన్స్ రికార్డులను కొల్లగొడుతోంది. ఈ సినిమా హీరో, డైరెక్టర్, మ్యూజిక్, సాంగ్స్ ఇవన్నీ అసెట్ అనే చెప్పాలి. కానీ.. కోర్, ప్రాణం అంటే మాత్రం గ్రాఫిక్స్ పేరే చెప్తారు. ఈ మూవీలో గ్రాఫిక్స్ కీలకపాత్ర పోషించాయి. మరి.. అంత గొప్ప గ్రాఫిక్స్ ని చేసింది హైదరాబాద్ బేస్డ్ కంపెనీ అని మీకు తెలుసా?

హనుమాన్ సినిమాలో కథ, కథనం, యాక్షన్, డైరెక్షన్ వీటన్నింటికి మంచి మార్కులే పడతాయి. కానీ, వీటన్నింటికి మించి ముందు గ్రాఫిక్స్ కి ఎక్కువ మార్కులు పడతాయి. ఈ గ్రాఫిక్స్ చూసిన తర్వాత చాలా సినిమాలపై విమర్శలు కూడా వచ్చాయి. ఈ గ్రాఫిక్స్ విషయంలో ప్రశాంత్ వర్మ తెలివితేటలను మెచ్చుకోవాలి. ఎందుకంటే కేవలం రూ.30 కోట్ల బడ్జెట్ తో రూ.500 కోట్ల కలెక్షన్స్ రాబట్టే సత్తా ఉన్న సినిమాని తెరకెక్కించాడు. అసలు ఎవరూ కూడా ఈ బడ్జెట్ లో ఇంత గొప్ప సినిమా తీయగలిగాడా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇందులో మేజర్ క్రెడిట్స్ ప్రశాంత్ వర్మ ఐడియాలజీకి దక్కుతాయి. ఆ తర్వాత హైదరాబాద్ బేస్డ్ “హలో హ్యూస్ స్టూడియోస్” కంపెనీలో చేయించారు.

హనుమాన్ లాంటి చిత్రాల్లో గ్రాఫిక్స్ ఎంతటి కీలకపాత్ర పోషిస్తాయో అందరికీ తెలిసిందే. ఇప్పటికీ టాలీవుడ్ లో వస్తున్న ఎన్నో చిత్రాలకు గ్రాఫిక్స్ వర్క్స్ ని విదేశాల్లో ఉండే చాలా చాలా పెద్ద కంపెనీల్లో చేయిస్తున్నారు. అందుకు కోట్లకు కోట్లు ఖర్చు కూడా చేస్తున్నారు. కానీ, ప్రశాంత్ వర్మ మాత్రం హైదరాబాద్ లోనే వరల్డ్ క్లాస్ క్వాలిటీతో గ్రాఫిక్స్ చేయించాడు. తన విజన్, ఐడియాలజీ, తెలివితేటలు, అతని డెసిషన్ మేకింగ్ స్కిల్స్ చూసి ఇండస్ట్రీలో ఎంతో గొప్ప గొప్ప డైరెక్టర్లు, నిర్మాతలు కూడా ఔరా అనే పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే హనుమాన్ చిత్రంలో ఒక్కో సీన్ చూస్తే గూస్ బప్స్ వస్తాయి. అలాంటి గ్రాఫిక్స్ ని విదేశాల్లో కోట్లు ఖర్చుచేసి తీసి ఉంటారు అని అంతా అనుకున్నారు.

నిజానికి ప్రశాంత్ వర్మకు అంత బడ్జెట్ లేదు. కానీ, అంత బడ్జెట్ లో వచ్చిన చిత్రాలకు మించి అవుట్ పుట్ ని అయితే రాబట్టుకోగలిగాడు. ప్రస్తుతం హనుమాన్ చిత్రం మాత్రమే కాదు.. ఈ హైదరాబాద్ కంపెనీ అయిన “హలో హ్యూస్ స్టూడియోస్” నెట్టింట వైరల్ అవుతోంది. ఇంత అద్భుతమైన గ్రాఫిక్స్ ఇచ్చింది హైదరాబాద్ కంపెనీ అని తెలిసి ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంక ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ గురించి మాట్లాడితే.. అందులో హనుమాన్ చిత్రం మొదటిది. వచ్చే ఏడాది అధీరా అనే చిత్రాన్ని విడుదల చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఆ మూవీ టైటిల్ గ్లింప్స్ ని లాంఛ్ చేశారు. ఆ చిత్రంపై కూడా అభిమానుల్లో పెద్దఎత్తున అంచనాలు నెలకొన్నాయి. మరి.. హనుమాన్ చిత్రానికి అంత మంచి గ్రాఫిక్స్ అందించిన హైదరాబాద్ కంపెనీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by HaloHues Studios (@halohuesstudios)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి