iDreamPost

Pranay Reddy Vanga: యానిమల్‌ కలెక్షన్స్ కచ్చితమైనవి! బాలీవుడ్‌ లా ఫేక్ కావు: సందీప్ బ్రదర్ ప్రణయ్‌

డిసెంబర్‌ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘యానిమల్‌’ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఓవర్‌సీస్‌లో పాత రికార్డులను తుడిచిపెట్టేసింది. ఇప్పటి వరకు 800 కోట్లకుపైగా కలెక్ట్‌ చేసింది.

డిసెంబర్‌ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘యానిమల్‌’ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఓవర్‌సీస్‌లో పాత రికార్డులను తుడిచిపెట్టేసింది. ఇప్పటి వరకు 800 కోట్లకుపైగా కలెక్ట్‌ చేసింది.

Pranay Reddy Vanga: యానిమల్‌ కలెక్షన్స్ కచ్చితమైనవి! బాలీవుడ్‌ లా ఫేక్ కావు: సందీప్ బ్రదర్ ప్రణయ్‌

అర్జున్‌ రెడ్డి సినిమా దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా వైల్డ్‌ సృష్టి ‘ యానిమల్‌’ బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వేట కొనసాగిస్తోంది. తెలుగుతో పాటు మిగిలిన భాషల్లో కూడా మంచి వసూళ్లు రాబడుతోంది. చిత్రం విడుదల అయి ఇప్పటి వరకు 25 రోజులు అవుతోంది. ఈ మధ్యలో సలార్‌, డంకీ వంటి పెద్ద సినిమాలు విడుదల అయ్యాయి. అయినప్పటికి యానిమల్‌ కలెక్షన్ల పరంగా పర్వాలేదు అనిపిస్తోంది. ముఖ్యంగా ఓవర్‌సీస్‌లో పాత చిత్రాల రికార్డులను తుడిచి పెట్టింది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 800 కోట్లకుపైగా వసూలు చేసింది.

తాజాగా, యానిమల్‌ సినిమా కలెక్షన్లపై సందీప్‌ రెడ్డి వంగా సోదరుడు ప్రణయ్‌ రెడ్డి వంగా మాట్లాడారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన దీనిపై స్పందిస్తూ.. ‘‘యానిమల్‌ సినిమా కలెక్షన్ల విషయంలో మేము ప్రకటించిన నెంబర్లు కచ్చితమైనవి. సాధారణంగా బాలీవుడ్‌లో కార్పోరేట్‌ బుకింగ్‌ ట్రెండ్‌ నడుస్తోంది. మేము దాన్ని ఫాలో అవ్వలేదు. యానిమల్‌ సినిమా ఇప్పుడు 870 కోట్ల కలెక్షన్లను సాధించింది’’ అని అన్నారు. ఇన్‌డైరెక్ట్‌గా షారుఖ్‌ ఖాన్‌కు కౌంటర్‌ ఇచ్చారు. తర్వాత రణబీర్‌ కపూర్‌ గురించి మాట్లాడారు.

‘‘కార్వా చౌత్‌ సీన్‌లో రణబీర్‌ కపూర్‌ రష్మిక మందన్నను చంద్రుడి చూడడానికి అంగీకరిస్తాడు. అంతేకాదు.. 20 నుంచి 25 సార్లు రష్మిక చేత ముఖంపై కొట్టించుకుంటాడు. ఆ సమయంలో అతడు ఎలాంటి ఇన్‌సెక్యూర్‌గా ఫీలవ్వలేదు. అతడు పెద్ద పెద్ద స్టార్ల దగ్గరినుంచి చిన్న చిన్న జూనియర్‌ ఆర్టిస్ట్‌ల వరకు అందర్నీ గౌరవిస్తాడు. రణబీర్‌ను అలా పెంచినందుకు రిషి కపూర్‌, నీతూలకు ధన్యవాదాలు చెప్పాల్సిందే’’ అని అన్నారు. క్రిటిక్స్‌ పై కూడా స్పందించారు.

‘‘ఇంగ్లీష్‌ మాట్లాడే కిటిక్స్‌, స్వయం ప్రకటిత సినీ విశ్లేషకులు కాశ్మీర్‌నుంచి కన్యాకుమారి వరకు ప్రయాణించాలి. అది కూడా రైలులో సెకండ్‌, థర్డ్‌ క్యాటగిరీ బోగీల్లో ప్రయాణించాలి. అప్పుడు గ్రౌండ్‌ రియాలిటీలు తెలుస్తాయి’’ అని అన్నారు. కాగా, యానిమల్‌ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. థియేటర్లలో సినిమా 3.30 గంటలు ఉండగా.. ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లో విడుదల అయ్యే సినిమా నిడివి మరింత ఎక్కువగా ఉండనుంది. దాదాపు 4 గంటల సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవ్వనుంది.

తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే, యానిమల్‌ ఎప్పటినుంచి స్ట్రీమింగ్‌ అవ్వనుందన్న దానిపై క్లారిటీ లేదు. దీనిపై మరికొన్ని రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరి, యానిమల్‌ సినిమా కలెక్షన్లపై ప్రణయ్‌ రెడ్డి వంగా క్లారిటీ ఇవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి