iDreamPost

ప్రభాస్-బోయపాటి: అదిరిపోయే మాస్ కాంబోలో సినిమా?

  • Published Feb 22, 2024 | 1:08 PMUpdated Feb 22, 2024 | 1:08 PM

రెబల్​స్టార్ ప్రభాస్​ కటౌట్​కు మాస్ సినిమాలు ఎంత బాగా నప్పుతాయో తెలిసిందే. ‘వర్షం’, ‘ఛత్రపతి’, ‘మిర్చి’ నుంచి రీసెంట్​గా వచ్చిన ‘సలార్’ వరకు చాలా మూవీస్ ప్రభాస్​ను ఎలా చూపిస్తే అందరికీ నచ్చుతుందో ప్రూవ్ చేశాయి.

రెబల్​స్టార్ ప్రభాస్​ కటౌట్​కు మాస్ సినిమాలు ఎంత బాగా నప్పుతాయో తెలిసిందే. ‘వర్షం’, ‘ఛత్రపతి’, ‘మిర్చి’ నుంచి రీసెంట్​గా వచ్చిన ‘సలార్’ వరకు చాలా మూవీస్ ప్రభాస్​ను ఎలా చూపిస్తే అందరికీ నచ్చుతుందో ప్రూవ్ చేశాయి.

  • Published Feb 22, 2024 | 1:08 PMUpdated Feb 22, 2024 | 1:08 PM
ప్రభాస్-బోయపాటి: అదిరిపోయే మాస్ కాంబోలో సినిమా?

రెబల్​స్టార్ ప్రభాస్‌ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు. ఆయన చేతిలో ఐదారు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ‘కల్కి 2898 AD’, ‘ది రాజా సాబ్’ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్ అభిమానుల్ని ఉత్సాహపరిచే వార్త ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. డార్లింగ్​ ఒక మాస్‌ డైరెక్టర్​తో పని చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. ‘సింహా’, ‘లెజెండ్’, ‘సరైనోడు’ వంటి ఫిల్మ్స్​తో మాస్ డైరెక్టర్స్​లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్నారు బోయపాటి శ్రీను. నిజానికి ఎప్పటి నుంచో ప్రభాస్ అభిమానులు బోయపాటి దర్శకత్వంలో తమ హీరోను చూడాలని ఆశపడుతూ వచ్చారు.

హై ఓల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్​తో హీరోను వెండితెరఫై లార్జర్ దెన్ లైఫ్ క్యారెక్టర్స్​లో అద్భుతంగా చూపించడంలో బోయపాటికి మంచి పేరుంది. అందుకే ఆయన చివరి సినిమా ‘స్కంద’ బాక్సాఫీస్ వద్ద ఫెయిలైనా.. ఇప్పటికీ స్టార్ హీరోల ఫ్యాన్స్ ఆయనతో సినిమా కావాలని అనుకుంటున్నారు. ఇటీవల బోయపాటి శ్రీను గీతా ఆర్ట్స్ లో ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే విజయ్‌ దేవరకొండతో కూడా ఓ మూవీ ప్లాన్‌ చేస్తున్నారని సమాచారం. నటసింహం నందమూరి బాలకృష్ణతో ‘అఖండ 2’ కూడా చేయనున్నారు. ఇవన్నీ కాకుండా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తోనూ ఒక స్క్రిప్ట్ విషయంలో చర్చలు సాగుతున్నాయట. మరి ప్రభాస్​తో సినిమా ఎప్పుడు ఉంటుందనేది చూడాలి.

పైన చెప్పుకున్నట్లు ప్రభాస్ కూడా ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ‘కల్కి 2898 AD’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మేలో ఈ సినిమా విడుదల కానుంది. మారుతితో ‘ది రాజా సాబ్‌’ కూడా ఇప్పటికే షూటింగ్‌ జరుపుకుంటోంది. ఇది వచ్చే సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇవి కాకుండా మరో మూడు సినిమాలు లైన్​లో ఉన్నాయి. ఇలా హీరో-డైరెక్టర్ ఇంత బిజీగా ఉండగా వీరిద్దరి కాంబినేషన్​లో కొత్త సినిమా రానుందని సమాచారం అందుతోంది. ఎప్పుడు వచ్చినా ప్రభాస్-బోయపాటి ఫిల్మ్ ఒక భారీ మాస్ బ్లాక్​బస్టర్ అయ్యే ఛాన్సులు ఎక్కువగానే ఉన్నాయి. ప్రభాస్ కటౌట్​కు బోయపాటి మార్క్​ ఎలివేషన్లు తోడైతే ఇక థియేటర్లు ప్రేక్షకుల ఈలలు, గోలలతో నిండిపోతాయి. మరి.. ప్రభాస్-బోయపాటి కాంబో మూవీ కోసం మీరెంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: కమల్ హాసన్, శివకార్తికేయన్ అరెస్ట్ కోసం తమినాడులో ఆందోళనలు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి