iDreamPost

Bheemla Nayak : పాన్ ఇండియా సినిమాలతో పవన్ ఢీ

Bheemla Nayak : పాన్ ఇండియా సినిమాలతో పవన్ ఢీ

ఆరు నూరైనా నూరు ఆరైనా సంక్రాంతి బరిలో దిగడం ఖాయమని పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ మరోసారి కన్ఫర్మేషన్ ఇచ్చింది. ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ లాంటి పాన్ ఇండియా సినిమాల మధ్య విడుదల చేయడం అంత సబబుగా ఉండదని పలు కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్ ఇవాళ తమన్ పుట్టినరోజు సందర్భంగా దీన్ని ఖరారు చేస్తూ కొత్త పోస్టర్ ని రిలీజ్ చేసింది. జనవరి 12 థియేటర్లలో పవర్ స్టార్ రిపోర్టింగ్ చేయబోతున్నాడని అందులో పేర్కొన్నారు. ఇప్పటిదాకా ఉన్న అనుమానాలకు ఆశలకు చెక్ పెట్టేస్తూ క్రిస్టల్ క్లియర్ గా క్లారిటీ ఇవ్వడంతో ఇంకెలాంటి సందేహాలు లేనట్టే.

ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లతో మంతనాలు, థియేటర్లు లాక్ చేయడం లాంటివి జరిగిపోతున్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత 5 రోజు గ్యాప్ ఉంటుంది కాబట్టి అప్పటిదాకా తెలుగు రాష్ట్రాల్లో అన్ని స్క్రీన్లలో దాదాపు ఇదే ఉంటుంది. ఆ తర్వాత భీమ్లా నాయక్ కు అగ్రిమెంట్ చేసుకున్న థియేటర్లు ఇచ్చేస్తారు. ఆర్ఆర్ఆర్ ఎంతలేదన్నా మెయిన్ హాళ్లకు మూడు వారాల ఒప్పందం చేసుకుంటుంది. చిన్న సెంటర్లో ఒకటి ఆర్ఆర్ఆర్ వేస్తే మిగిలిన వాటిలో ముందు భీమ్లా నాయక్ వచ్చి ఆ తర్వాత రాధే శ్యామ్ ఎంట్రీ ఇస్తాడు. ఇక్కడికే పరిస్థితి చాలా టైట్ అయిపోతుంది. ఒకవేళ బంగార్రాజు వస్తే ఏం చేస్తాడో అంతు చిక్కడం లేదు. బయ్యర్ల తిప్పలు దేవుడికే ఎరుక.

సో ఫైనల్ గా ఆర్ఆర్ఆర్ – భీమ్లా నాయక్ – రాధే శ్యామ్ లు పోటీకి సిద్ధమయ్యాయి. ఏపిలో టికెట్ రేట్ల వ్యవహారం తేలినా తేలకపోయినా ఇప్పుడిక ఎవరూ వెనక్కు తగ్గలేరు. ఒకవేళ అదే జరిగితే అభిమానులు ఫీలైపోయి దుమ్మేత్తే ఛాన్స్ ఉంది. సంక్రాంతి పోరు ప్రతి సంవత్సరం సాధారణమే అయినప్పటికీ ఒకేసారి రెండు పాన్ ఇండియా సినిమాలు ఎప్పుడూ బరిలో లేవు. ఇదే మొదటిసారి. ఈ లెక్కన బాక్సాఫీస్ వద్ద గత కొన్నేళ్లలో ఎన్నడూ చూడని సందడికి సాక్షులం కాబోతున్నామన్నది నిజం. రీమేక్ అయినప్పటికీ భీమ్లా నాయక్ కి విపరీతమైన హైప్ పెరుగుతోంది. ముఖ్యంగా టీజర్లు చూసాక ఇది ఎక్కడికో వెళ్లిపోయింది

Also Read : Radhe Shyam : ప్రభాస్ ఫ్యాన్స్ ని హర్ట్ చేశారు – నెక్స్ట్ ఏంటి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి