iDreamPost

Prajapalana: ప్రజాపాలన దరఖాస్తుల గడువు పొడిగింపు ఉంటుందా.. మంత్రి పొన్నం ఏమన్నారంటే

  • Published Jan 03, 2024 | 8:48 AMUpdated Jan 03, 2024 | 8:48 AM

ఆరు గ్యారెంటీల లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు తీసుకువచ్చిన ప్రజాపాలన కార్యక్రమం గడువు తేదీని పొడిగిస్తారంటూ సాగుతున్న ప్రచారంపై మంత్రి పొన్నం క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాలు..

ఆరు గ్యారెంటీల లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు తీసుకువచ్చిన ప్రజాపాలన కార్యక్రమం గడువు తేదీని పొడిగిస్తారంటూ సాగుతున్న ప్రచారంపై మంత్రి పొన్నం క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాలు..

  • Published Jan 03, 2024 | 8:48 AMUpdated Jan 03, 2024 | 8:48 AM
Prajapalana: ప్రజాపాలన దరఖాస్తుల గడువు పొడిగింపు ఉంటుందా.. మంత్రి పొన్నం ఏమన్నారంటే

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఆరు గ్యారెంటీల అమలు కోసం చర్యలు వేగవంతం చేసింది. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోగా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆరు గ్యారెంటీల లబ్ధిదారులను సెలక్ట్ చేయడం కోసం ప్రభుత్వం.. ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభించింది. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు దరఖాస్తులను స్వీకరించనుంది. స్వయంగా అధికారులే ప్రజల వద్దకు వెళ్లి వారి దగ్గర అప్లికేషన్లు స్వీకరిస్తారు.

సుమారు పది రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తామని ప్రభుత్వం తెలిపింది. అయితే ఇయర్ ఎండ్, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా డిసెంబర్ 31, జనవరి 1న రెండు రోజుల పాటు కార్యక్రమానికి సెలవు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రజాపాలన గడువు పెంచుతారా అనే దానిపై జనాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా దీినపై మంత్రి పొన్నం క్లారిటీ ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే..

ponnam prabhakar comments on praja palana application

డిసెంబర్ 28 నుంచి పల్లెలు, పట్టణాల్లో ప్రత్యేకంగా ‘ప్రజాపాలన’ కార్యక్రమం ప్రారంభమైన సంగతి తెలిసిందే. దీని ద్వారా అధికారులు రాష్ట్రవ్యాప్తంగా.. మహాలక్ష్మీ, గృహజ్యోతి, చేయూత, ఇందరమ్మ ఇండ్లు, రైతు భరోసా పథకాలకు అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అయితే దరఖాస్తులు ఎక్కువగా ఉండటంతో సమయం పొడగించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ప్రజా పాలన దరఖాస్తులు పొడగించినట్లు వార్తలు కూడా వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రజా పాలన దరఖాస్తుల పొడగింపు వార్తలపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ.. దీనిపై క్లారిటీ ఇచ్చారు. ప్రజాపాలన దరఖాస్తుల పొడగింపు ఉండదని ఈ సందర్భంగా మంత్రి పొన్నం స్పష్టం చేశారు. జనవరి 6 లోపు అర్హులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రజాపాలన కార్యక్రమం చివరి తేదీ జనవరి 6 మాత్రమేనని.. ఆ తర్వాత అర్హులెవరైనా ఉంటే ఎమ్మార్వో, ఎంపీడీవో ఆఫీసులకు వెళ్లి దరఖాస్తులు ఇవ్వవచ్చునని వెల్లడించారు. అర్హులైన ప్రజలు ఆందోళనకు గురికావొద్దని.. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తామని ఈ సందర్భంగా మంత్రి పొన్నం స్పష్టం చేశారు.

కిషన్ రెడ్డి కేసీఆర్ బినామీ..

ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి నెలరోజులు కూడా పూర్తి కాక ముందే బీఆర్ఎస్ నేతలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్‌, బీజేపీ పార్టీలు రెండూ ఒకటేనని.. కిషన్ రెడ్డి కేసీఆర్‌కు బినామీ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం విషయంలో కేసీఆర్‌ను రక్షించేందుకే కిషన్ రెడ్డి సీబీఐ విచారణ కోరుతున్నారని పొన్నం ఆరోపించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి