iDreamPost

రాజకీయ నేపథ్యంలో మెగా పవర్ స్టార్

రాజకీయ నేపథ్యంలో మెగా పవర్ స్టార్

ఇంకా ఆచార్య పూర్తి కాలేదు. ఆర్ఆర్ఆర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఎవరికీ తెలియదు. కానీ మరోవైపు రామ్ చరణ్ నటించబోయే 15వ సినిమా తాలూకు పనులు మాత్రం చకచకా జరిగిపోతున్నాయి. తన కెరీర్ లో మొదటిసారి జెట్ స్పీడ్ చూపిస్తున్న దర్శకుడు శంకర్ టైంని వేస్ట్ చేయకుండా వేగంగా ప్రీ ప్రొడక్షన్ పనులు చేస్తున్నారు. ఇప్పటికే సంగీత దర్శకుడు తమన్ సాంగ్స్ కంపోజింగ్ మొదలైపోయింది. మరోపక్క హీరోయిన్ గా కియారా అద్వానీని లాక్ చేశారు. మెయిన్ విలన్ గా పుష్ప ఫేమ్ ఫహద్ ఫాసిల్ ఓకే అయ్యాడనే టాక్ ఉంది కానీ అఫీషియల్ గా ఇంకా ప్రకటించలేదు. ఇంకా టైం చాలా ఉంది కాబట్టి తొందరపడే ఉద్దేశంలో లేరు.

దీనికి కథను అందించిన డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ శంకర్ టీమ్ తో నిత్యం చర్చల్లో ఉంటూ స్క్రీన్ ప్లే ని సెట్ చేస్తున్నట్టుగా ఇన్ సైడ్ టాక్. ఇదో పొలిటికల్ థ్రిల్లర్ అని చెన్నై న్యూస్. ఒకే ఒక్కడులో అర్జున్ పోషించిన జర్నలిస్ట్ తరహాలోనే చరణ్ క్యారెక్టర్ ఉంటుందని అయితే దానికి దీనికి పోలిక రాకుండా ఇది వేరే ఫార్మాట్ లో వెళ్తుందని అంటున్నారు. ఫహద్ క్యారెక్టర్ ఈ మధ్య కాలంలో ఏ సినిమాలోనూ చూడనంత ఫెరోషియస్ విలనిక్ టచ్ తో ఉంటుందని అంటున్నారు. వచ్చే నెల రెండో వారం నుంచి చరణ్ కియారా మీద ఒక పాటతో రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లోనే మొదలుపెట్టబోతున్నట్టు తెలిసింది.

సో చరణ్ ఫస్ట్ టైం రాజకీయ నేపథ్యంలో సినిమా చేయబోతున్నాడనే క్లారిటీ అయితే వచ్చేసింది. విడుదల 2023లో ఉంటుంది. ఎందుకంటే ఆచార్య ఒకవేళ ఇప్పుడు సెప్టెంబర్ లో రాకపోతే 2022 జనవరికి టార్గెట్ చేస్తుంది. ఆ తర్వాత ఆర్ఆర్ఆర్ ని సమ్మర్ లో తీసుకొస్తారు. రిపబ్లిక్ డేకి వచ్చే దిశగా కూడా ఆలోచనలు చేస్తున్నారట. ఎలా చూసుకున్నా వచ్చే ఏడాది చరణ్ వి రెండు సినిమాలు అయితే పక్కా. సో శంకర్ మూవీకి తొందరేమీ లేదు. ఎంత ఫాస్ట్ గా తీసినా పాన్ ఇండియా స్కేల్ కాబట్టి ప్రొడక్షన్ జరిగే కొద్దీ ఆలస్యం జరిగినా ఆశ్చర్యం లేదు. తమ బ్యానర్ కు 50వ సినిమా కాబట్టి దిల్ రాజు చాలా ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు

Also Read : రిలీజుల కోసం సినిమాల సర్దుబాటు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి