రిలీజుల కోసం సినిమాల సర్దుబాటు

By iDream Post Aug. 26, 2021, 02:30 pm IST
రిలీజుల కోసం సినిమాల సర్దుబాటు

మొదటి నెల రోజులు చిన్న సినిమాలతో నెట్టుకుంటూ వచ్చి బడా ప్రొడ్యూసర్లకు భరోసా ఇచ్చిన బాక్సాఫీస్ సెప్టెంబర్ నుంచి భారీ చిత్రాల సందడిని చూడబోతోంది. ఇప్పటిదాకా పది కోట్ల లోపే షేర్ తెచ్చే కెపాసిటీ ఉన్న సక్సెస్ ని ఎంజయ్ చేసిన టికెట్ కౌంటర్లు ఇకపై హౌస్ ఫుల్ బోర్డులు చూడబోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. శ్రీదేవి సోడా సెంటర్ తో ఆ సూచనలు ఉన్నప్పటికీ గోపీచంద్ సీటిమార్ తో అది బలపడుతుందనే నమ్మకం ట్రేడ్ లో ఉంది ఇప్పుడు అందరి కన్ను వినాయక చవితి పండగ మీదే ఉంది. ఎందుకంటే థియేటర్ ప్లస్ ఓటిటి రెండింటిలోనూ క్రేజీ రిలీజులు క్యూ కడుతున్నాయి. ఎప్పుడూ లేనిది ఈసారి ఫెస్టివల్ ట్రీట్ మాములుగా ఉండటం లేదు.

ఇంకా ప్రమోషన్ల వేగం పెంచలేదు కానీ లవ్ స్టోరీ సెప్టెంబర్ 10న రావడం దాదాపు ఖరారైనట్టే. అయితే టక్ జగదీశ్, మాస్ట్రోలు డిజిటల్ రిలీజులు ఎప్పుడు వస్తాయనే దాని మీద క్లారిటీ కొరవడుతోంది. ఇక్కడ కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుస్తున్నాయి. మొన్న ఎగ్జిబిటర్లు చేసిన ప్రెస్ మీట్ దెబ్బకు టక్ జగదీశ్ టీమ్ ఆలోచనలో పడి 10వ తేదీకి బదులు ఒకవారం ఆలస్యంగా వచ్చేలా అమెజాన్ ప్రైమ్ ని రిక్వెస్ట్ చేయబోతున్నట్టుగా తెలిసింది. అందుకే డేట్ అనౌన్స్ మెంట్ రాలేదని అంటున్నారు. ఓటిటి కాబట్టి ఎప్పుడు వచ్చినా స్పందన ఒకేలా ఉంటుంది కనక లవ్ స్టోరీని ఇరకాటంలో పెట్టడం ఎందుకనే దిశగా నిర్ణయం మార్చుకోవచ్చట

నితిన్ మాస్ట్రో కూడా 9న రావడం డౌటే అంటున్నారు. మొన్న ట్రైలర్ లో ముందు డేట్ ఇచ్చి ఆ తర్వాత కొద్దినిమిషాలకే మళ్ళీ కమింగ్ సూన్ అని మార్చడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అంటే ముందు అనుకున్న తేదీని మార్చే సూచనలు స్పష్టమైనట్టే. అది పండగ తర్వాత కొద్దిరోజులు గ్యాప్ ఇచ్చా లేక అంతకంటే ముందా అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికి థియేటర్ కు ఓటిటికి మధ్య నేరుగా పోటీ మొదలైనట్టే. వచ్చే నెల అన్ని భాషల్లోనూ కలిపి చాలా స్ట్రాంగ్ కంటెంట్ రాబోతోంది. ఈ ఏడాది మొత్తంలో బిగ్గెస్ట్ ఎంటర్ టైన్మెంట్ ఇవ్వబోతున్న మంత్ ఇదే అంటున్నారు. చూద్దాం ఇంకెన్ని ప్రకటనలు వస్తాయో

Also Read : మూవీ లవర్స్ కు మంచి పండగే

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp