iDreamPost

ప్రజలు ఆయనను రాజకీయ క్వారంటైన్‌కు తరలించారు: వైసిపి నేత విమర్శ…ఆయన ఎవరూ..?

ప్రజలు ఆయనను రాజకీయ క్వారంటైన్‌కు తరలించారు: వైసిపి నేత విమర్శ…ఆయన ఎవరూ..?

ప్రజలు ఆయనను రాజకీయ క్వారెంటైన్ కు తరలించాని ఒక రాజకీయ నేతను ఉద్దేశించి వైసిపి నేత విమర్శ చేశారు. ప్రజలు రాజకీయ క్వారెంటైన్ కు తరలించిన ఆ రాజకీయ నేత ఎవరు..? అంటే ఆయనే కర్నూలు కు చెందిన బైరెడ్డి రాజశేఖరరెడ్డి అని ఆ వైసిపి నేత బివై రామయ్య అంటున్నారు.

అయితే కర్నూలులో నిత్యం ఏదో ఒక రాజకీయ చర్చ జరుగుతునే ఉంటుంది. రాజకీయ నేతల ఆరోపణ, ప్రత్యారోపణలు అక్కడ ఎక్కువ. ఇటీవలి శ్రీ శైలం దేవస్థానంలో జరిగిన అక్రమాలపై కర్నూలులో చర్చ జరుగుతుంది. దీనిపై బైరెడ్డి రాజశేఖరరెడ్డి మీడియా సమావేశం పెట్టి ప్రభుత్వం విమర్శలు, ఆరోపణలు చేశారు. బైరెడ్డి ఆరోపణలనూ, విమర్శలనూ వైసిపి కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు బివై రామయ్య తిప్పికొడుతూ కౌంటర్ ఇచ్చారు.

రాజకీయ నిరుద్యోగిగా ఉన్న బైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి అప్పుడప్పుడు తన ఉనికి కోసమే మీడియా ముందుకు వచ్చి అసత్య ఆరోపణలు చేస్తుంటాడని బివై రామయ్య విమర్శించారు. శ్రీ శైలం దేవస్థానంలో జరిగిన రెండు కోట్ల రూపాయలు అవినీతి, అక్రమాలపై పోలీసులు విచారణ చేస్తుంటే దానిని బూతద్దంలో చూస్తున్నారని విమర్శించారు. బైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డికి చిన్న మెదడు చిట్లిపోయి ఏమి మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు.

పచ్చకామెర్లు ఉన్న వ్యక్తికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని, అవినీతి, అక్రమాస్తుల కబ్జాలు చేసిన వ్యక్తికి‌ అన్ని అలానే కనిపిస్తాయని విమర్శించారు. శ్రీశైలం దేవస్థానంలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం విచారణ చేస్తోందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

శ్రీశైలం ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. బైరెడ్డి ఎప్పడు ఏ పార్టీలో ఉంటారో ఎవరికీ తెలియదని, బహుశా ఆయనకు కూడా తెలియదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ధోరణిలోనే అడ్డగోలు విమర్శలు చేయడం ఈయనకి వంటపట్టిందన్నారు. 

బైరెడ్డిని కర్నూలు జిల్లా ప్రజలు రాజకీయ క్వారంటైన్‌కు తరలించారన్న సంగతి గుర్తుకు తెచ్చుకోవాలి. తిరుపతి దేవస్థానం భూములపై ఆనాడు మాట్లాడని బైరెడ్డి ఇప్పుడు బిజెపి కండువా కప్పుకొని లేని ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

పోతిరెడ్డిపాడు, రైతులకు మేలు చేసే కార్యక్రమాలపై పోరాటం వంటి ఆలోచనలు చేయాలి తప్ప మరో విధంగా మాట్లడితే రాజకీయంగా బుద్ధి చెబుతామని బైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డిని హెచ్చరించారు. ఇదండీ రాజకీయ క్వారెంటైన్ కు ప్రజలు ఏ నేతను తరలించారో అర్థమైందీ కదా…!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి