iDreamPost

మెట్రో రైల్ శబ్దం.. CM రేవంత్ రెడ్డికి ఫిర్యాదు!

తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తమ సమస్యలు చెప్పుకునేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రజాభవన్ కి వెళ్తున్నారు. అలానే లేఖల రూపంలో కూడా సీఎం రేవంత్ కి ఫిర్యాదులు వస్తున్నాయి. తాజాగా మెట్రో రైళ్ల శబ్దం విషయంలో సీఎంకు ఫిర్యాదు చేశారు.

తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తమ సమస్యలు చెప్పుకునేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రజాభవన్ కి వెళ్తున్నారు. అలానే లేఖల రూపంలో కూడా సీఎం రేవంత్ కి ఫిర్యాదులు వస్తున్నాయి. తాజాగా మెట్రో రైళ్ల శబ్దం విషయంలో సీఎంకు ఫిర్యాదు చేశారు.

మెట్రో రైల్ శబ్దం.. CM రేవంత్ రెడ్డికి  ఫిర్యాదు!

తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలీలో పరిపాలన చేస్తూ ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా ప్రజావాణీ పేరిట.. ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు. ప్రజాభవన్ లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ద్వారా నిత్యం వేలాది మంది తమ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తున్నారు. ఇదే సమయంలో అధికారులు కూడా ప్రజల నుంచి అర్జీలు తీసుకుని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే.. సీఎం రేవంత్ రెడ్డికి లేటర్లు రాస్తూ.. మరికొందరు తమ సమస్యలను తెలియజేస్తున్నారు. ఇటీవలే ఓ చిన్నారి సీఎంకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ప్రాంతం వాసులు మెట్రో రైలు శబ్దంపై సీఎంకు ఫిర్యాదు చేశారు.

మూడు రోజుల క్రితం తెలంగాణ నూతన సీఎం రేవంత్ రెడ్డికి 5వ తరగతి చదువుతున్న చిన్నారి.. తన స్కూల్ కి సంబంధించిన సమస్యలపై లేఖ రాసింది. తాజాగా హైదరాబాద్ లోని ఓ ప్రాంతం వాసులు మెట్రో శబ్దం వస్తుందని సీఎం రేవంత్ రెడ్డికి  ఫిర్యాదు చేశారు. సికింద్రాబాద్ ప్రాంతంలోని బోయిగూడ వాసులు సీఎం కు లేఖ రాశారు. బోయిగూడ వై జంక్షన్ లోని మెట్రో ట్రాక్ పక్కన నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ వాసులు తమ బాధలను సీఎం రేవంత్ కి మొర పెట్టుకున్నారు. పిల్లర్ నెం. 1006 మలుపు వద్ద మెట్రో రైళ్ల రాకపోకలతో వచ్చే సౌండ్ తో చికాకు వస్తుందని వారు తెలిపారు.

metro train sound distrabance

మెయింటనెన్స్, ట్రయల్స్ పేరిట మిడ్ నైట్ లోనూ నడపడంతో నిద్రపటడ్డం లేదన్నారు. అధికారులకు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోలేదన్నారు.  ఆరు నెలలుగా ఈ  సమస్య మరింత పెరిగిందని శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. మరి.. సీఎం నుంచి ఎలాంటి స్పందన వస్తుందనే విషయం కోసం మరికొద్ది రోజులు ఎదురు చూడాలి.  ఇలా రైల్వే ట్రాక్ లకు సమీపంలో ఉండే వారికి వాటి శబ్దం సర్వసాధారణమని కొందరు అంటారు. అయితే తమకు ఇది ఓ దారుణమైన శిక్షలా ఉందని స్థానికులు చెబుతున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రజా సమస్యలపై వెంటనే స్పందిస్తున్నారు.

అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి వివిథ పథకాల అమలకు కసరత్తు చేస్తున్నారు.  ఇది నిరకుశ ప్రభుత్వం కాదని, ప్రజాప్రభుత్వం మంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. అందుకే తన కాన్వయ్ వెళ్తున్న సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ప్రత్యమ్యాయం చూడాలని అధికారులకు తెలిపారు. అలా తనదైన నిర్ణయాలతో ప్రజలల్లో గుర్తింపు పొందుతున్నారు. ప్రజలు సైతం సీఎం ఇచ్చిన అవకాశంతో తమ సమస్యలను తెలుపుకునేందుకు పెద్ద ఎత్తున వస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి..ప్రజా సమస్యలపై స్పందిస్తున్న విధానంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి