iDreamPost

బుద్ధి మార్చుకోని పాకిస్థాన్.. విరాట్ కోహ్లీని తిట్టిన క్రికెటర్​కు ప్రమోషన్!

  • Author singhj Published - 09:54 PM, Thu - 16 November 23

పాకిస్థాన్ క్రికెట్​ బోర్డు (పీసీబీ)పై భారత ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. విరాట్ కోహ్లీని తిట్టిన క్రికెటర్​కు ఎలా ప్రమోషన్ ఇస్తారంటూ సీరియస్ అవుతున్నారు.

పాకిస్థాన్ క్రికెట్​ బోర్డు (పీసీబీ)పై భారత ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. విరాట్ కోహ్లీని తిట్టిన క్రికెటర్​కు ఎలా ప్రమోషన్ ఇస్తారంటూ సీరియస్ అవుతున్నారు.

  • Author singhj Published - 09:54 PM, Thu - 16 November 23
బుద్ధి మార్చుకోని పాకిస్థాన్.. విరాట్ కోహ్లీని తిట్టిన క్రికెటర్​కు ప్రమోషన్!

ఐసీసీ వన్డే వరల్డ్ కప్​-2023లో భారత జట్టు వరుస విజయాలు సాధిస్తూ నాకౌట్​ దశకు చేరుకుంది. ఫేవరెట్లలో ఒకటైన న్యూజిలాండ్​ను సెమీఫైనల్​లో చిత్తు చేసి మెగా టోర్నీ ఫైనల్​ బెర్త్​ను సొంతం చేసుకుంది. ఎవరూ ఎక్స్​పెక్ట్ చేయని విధంగా లీగ్ స్టేజ్​లో ఆడిన అన్ని మ్యాచుల్లోనూ నెగ్గిన భారత్.. నాకౌట్​ ఫైట్​లో కివీస్​ను కోలుకోలేని దెబ్బ తీసింది. ఈ మ్యాచ్​లోనూ మన టీమ్ ఫుల్ డామినేషన్ చేసింది. కేన్ విలియమ్సన్-డారిల్ మిచెల్ బ్యాటింగ్​ చేస్తున్న టైమ్​లో తప్పితే సెమీస్​ మొత్తం రోహిత్ సేన ఆధిపత్యమే నడిచింది. అన్ని విభాగాల్లోనూ అపోజిషన్ టీమ్​ కంటే అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన భారత్.. ఫైనల్​కు చేరుకొని కప్పుపై ఆశలను మరింత పెంచేసింది.

సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న రెండో సెమీఫైనల్​లో నెగ్గిన టీమ్​తో ఫైనల్​లో తలపడేందుకు రోహిత్ సేన రెడీ అవుతోంది. ప్రస్తుతం మన టీమ్ ఉన్న ఫామ్​లో ఎదురుగా ఏ టీమ్ వచ్చినా చిత్తవడం ఖాయంగా కనిపిస్తోంది. అభిమానుల ఎక్స్​పెక్టేషన్స్​కు తగ్గట్లు ఫైనల్​ ఫైట్​లోనూ ఆడి కప్​ను గెలుస్తారో లేదో చూడాలి. ఒకవైపు భారత్ వరల్డ్ కప్​లో డామినేట్ చేస్తుంటే.. మరోవైపు దాయాది పాకిస్థాన్ మాత్రం లీగ్ స్టేజ్ నుంచే ఇంటికి వెళ్లిపోయింది. తమపై ఫ్యాన్స్ పెట్టుకున్న ఆశల్ని బాబర్ సేన అందుకోలేకపోయింది. వరుస పరాజయాలతో వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించింది పాక్.

వరల్డ్ కప్​లో ఘోర వైఫల్యం నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ భారీ కుదుపునకు లోనైంది. బౌలింగ్ కోచ్ పదవికి మోర్నీ మోర్కెల్ రాజీనామా చేశాడు. ఈ ఫెయిల్యూర్​కు బాధ్యత వహిస్తూ చీఫ్ సెలెక్టర్ ఇంజమాముల్ హక్ తన బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. మెగా టోర్నీలో టీమ్​ను సరిగ్గా నడపడంలో ఫెయిలైన బాబర్ ఆజం కెప్టెన్సీకి గుడ్ బై చెప్పేశాడు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. కోచ్ మికీ ఆర్థర్ సహా ఫారెన్ కోచింగ్ స్టాఫ్ మొత్తాన్ని పీసీబీ తొలగించింది. టీమ్ డైరెక్టర్​గా మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్​ను నియమించింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సిరీస్​కు త్వరలోనే కొత్త కోచింగ్ స్టాఫ్​ను ప్రకటిస్తామని పీసీబీ తెలిపింది.

ప్రస్తుతం ఉన్న కోచ్​లు అందర్నీ నేషనల్ క్రికెట్ అకాడమీలో వర్క్ చేయాల్సిందిగా పీసీబీ ఆదేశించింది. వారిలో కొందర్ని మెయిన్ టీమ్ కోసం సెలెక్ట్ చేస్తామని తెలిపింది. అయితే టెక్నికల్ కమిటీలో సభ్యుడిగా ఉన్న హఫీజ్​ను డైరెక్టర్​ ఆఫ్​ క్రికెట్​గా ప్రమోట్ చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. భారత్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని కొన్ని రోజుల కింద తిట్టిన హఫీజ్​కు కావాలనే పీసీబీ ప్రమోషన్ ఇచ్చిందని ఇండియన్ ఫ్యాన్స్ అంటున్నారు. సౌతాఫ్రికా మీద విరాట్ చేసిన సెంచరీని సెల్ఫిష్ అంటూ మండిపడిన హఫీజ్​కు ప్రమోషన్ ఇవ్వడం ద్వారా పాక్ తన వక్ర బుద్ధిని మరోమారు చూపించిందని నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. మరి.. కోహ్లీని తిట్టిన హఫీజ్​కు పీసీబీ ప్రమోషన్ ఇవ్వడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: వరుస విజయాలు ఊరికే రాలేదు.. ఆ ఓటమి వల్లే ఇక్కడి దాకా వచ్చిన భారత్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి