iDreamPost

జనసేన అధినేతకు కరోనా

జనసేన అధినేతకు కరోనా

జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ కరోనా బారిన పడ్డారు. ఆయనకు కరోనా పాజిటవ్‌గా నిర్థారణ అయినట్లు జనసేన పార్టీ ప్రకటించింది. ఈ మేరకు ఓ లేఖను జనసేన పార్టీ విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఫాం హౌస్‌లో వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారని పేర్కొంది.

ఈ నెల 3వ తేదీన తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి రత్న ప్రభకు మద్ధతుగా పవన్‌ ర్యాలీ, బహిరంగసభ నిర్వహించారు. పాదయాత్రగా బహిరంగ సభకు వచ్చిన పవన్‌ కల్యాణ్‌.. సభలో మాట్లాడారు. అక్కడ నుంచి వచ్చిన తర్వాత పవన్‌ వ్యక్తిగత, భద్రతా సిబ్బందిలో పలువురుకు వైరస్‌ సోకినట్లు నిర్థారణ అయింది. వెంటనే పవన్‌ కూడా పరీక్షలు చేయించుకున్నారు. అప్పుడు నెగిటివ్‌ వచ్చింది.

అయితే వైద్యుల సూచన మేరకు పవన్‌ హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన తిరుపతి ఎన్నికల ప్రచార షెడ్యూల్‌ను రద్దు చేసుకున్నారు. ఇటీవల బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరైన గూడురు సభకు పవన్‌ కూడా రావాల్సి ఉంది. అయితే క్వారంటైన్‌లో ఉండడంతో రాలేకపోయారు.

రెండు రోజుల నుంచి స్వల్ప జ్వరం, వొళ్లు నొప్పులుగా ఉండడంతో వైద్యులు మరోసారి పవన్‌కు పరీక్షలు నిర్వహించారు. ఈ సారి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో అపోలో వైద్యులు పవన్‌కు ఆయన ఫాం హౌస్‌లోనే చికిత్స అందిస్తున్నారు.

Also Read : మరో మాజీ మంత్రిని బలితీసుకున్న కరోనా

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి