iDreamPost

భ‌జ‌న క‌ళాకారుడు ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌

భ‌జ‌న క‌ళాకారుడు ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌

ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్రెస్‌మీట్‌

“మీ దృష్టిలో బీజేపీ అంటే ఏమిటి?” అడిగారు విలేక‌రులు
“భార‌తీయ జంపింగ్ పార్టీ. ఎవ‌రు జంప్ చేసినా కాద‌న‌దు. స‌ముద్రాన్ని ఎగ‌ర‌డం వ‌ల్ల హ‌నుమంతుడు లంక‌ను జ‌యించాడు. ఆయ‌న్ని ఆద‌ర్శంగా తీసుకుని ఎగిరేవాళ్ల‌ను బీజేపీ గౌర‌విస్తుంది. నా పేరు ప‌వ‌న్ కాబ‌ట్టి నేను కూడా ఎగిరాను”
“జ‌న‌సేన సంగ‌తేంటి ?”
“జ‌నం లేన‌ప్పుడు సైన్యం ఉంటుందా? “
“గ‌తంలో చెగువేరా అన్నారు?”
“నేను విప్ల‌వాన్ని గౌర‌విస్తాను. కాషాయాన్ని ప్రేమిస్తాను”
“రెంటికి కుద‌ర‌దు క‌దా”
“దీన్నే సినిమాల్లో డ‌బుల్ యాక్ష‌న్ అంటారు”
“బీజేపీతో ఎందుకు చేతులు క‌లిపారు?”
“చెయ్యి కాంగ్రెస్ గుర్తు. నేను కాంగ్రెస్‌కి వ్య‌తిరేకి”
“ఎందుకు?”
“కాంగ్రెస్ హ‌స్తంలో అదృష్ట రేఖలు లేవు. అందుకే రేకులు విచ్చుకున్న క‌మ‌లాన్ని ఇష్ట‌ప‌డ్డాను”
“మీది RSS భావ‌జాల‌మా?”
“మా నాన్న పోలీస్‌, ఖాకీ డ్ర‌స్ వేసేవారు, చేతిలో లాఠీ ఉండేది. RSSది కూడా ఖాకీ డ్రెస్‌, చేతిలో లాఠీ. ప్ర‌జాస్వామ్యాన్ని కంట్రోల్ చేయాలంటే చేతిలో లాఠీ ఉండాల‌నేది నా సిద్ధాంతం”
“మీ కంటూ సొంత ఆలోచ‌న లేదా?”
“సినిమా వాళ్ల‌కి సొంత ఆలోచ‌న‌లు ఉండ‌వ్‌. ప్ర‌తిసారీ పాత్ర మారిపోతుంది. ఇచ్చిన డైలాగ్‌లు చెబుతాం”
“ఇదంతా చంద్ర‌బాబు స్క్రిప్ట్ అంటున్నారు”
“త‌ల‌కి నూనె, క‌ణ‌త‌ల‌కి అమృతాంజ‌నం, రాయ‌డం త‌ప్ప‌, స్క్రిప్ట్ రాసే ప‌రిస్థితుల్లో చంద్ర‌బాబు లేడు”
“ఎందుక‌ని?”
“సైకిల్ ఔట్‌డేటెడ్ , దాన్ని స్పీడ్‌గా న‌డ‌ప‌డానికి లోకేశ్ అనే మోటర్‌ని బిగించారు. దాంతో అది ముందుకు కాకుండా వెన‌క్కి క‌దులుతోంది “
“పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ వ‌ల్ల ముస్లింల‌కి న‌ష్టం లేదంటున్నారు. ఆ బిల్లు మీరు చ‌దివారా?”
“నేను దేన్నీ చ‌ద‌వ‌ను. ఎవ‌రైనా రాసి ఇస్తే చ‌దువుతా”
“మ‌రి ల‌క్ష పుస్త‌కాలు ఎలా చ‌దివారు?”
“నేను చెబితే, న‌మ్మ‌డానికి మీకు బుద్ధుందా? ఒక మ‌నిషి నూరేళ్లు బ‌తికితే 36,500 రోజులు బ‌తుకుతాడు. అంటే నూరేళ్లు, రోజుకి 3 పుస్త‌కాలు చ‌దివితే ల‌క్ష అవుతాయి. పుస్త‌కాలు కాదు క‌దా ల‌క్ష పుస్త‌కాల అట్ట‌లు కూడా చ‌ద‌వ‌లేం. దీన్నే అట్ట‌హాసం అంటారు”
“లెక్క‌లు బాగానే నేర్చుకున్న‌ట్టున్నారు”
“చంద్ర‌బాబుతో చేరితే మొద‌ట లెక్క‌లే నేర్పిస్తారు”
“లోక‌ల్ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తారా?”
“లోక‌ల్ ట్రైన్‌లోనే ట్రావెల్ చేయ‌ను, ఇక ఎన్నిక‌ల్లో పోటీ చేస్తానా?”
“మ‌రి బీజేపీకి మీ వ‌ల్ల ఏంటి లాభం?”
“మొన్న ఎన్నిక‌ల్లో క‌మ్యూనిస్టుల‌ని ఫినీష్ చేశా. ఇప్పుడు బీజేపీ వంతు”
“అంటే మీతో క‌లిస్తే చాప్ట‌ర్ క్లోజా”
“పాత చాప్ట‌ర్ క్లోజ్ చేసి , కొత్త చాప్ట‌ర్ స్టార్ట్ చేయ‌డ‌మే జ‌న‌సేన ల‌క్ష్యం”
“అంటే మీకు ఏ భావ‌జాలం లేదా?”
“భావ‌జాలం లేదు, అంత‌ర్జాలం ఉంది”
“అంటే”
“ఈనాడు చ‌ద‌వండి. ఇంట‌ర్నెట్‌ని వాళ్లు అంత‌ర్జాలం అంటారు”
“ప్ర‌త్యేక ప్యాకేజీ గురించి చెప్పండి?”
“నా ప్యాకేజా? రాష్ట్రం ప్యాకేజా?”
“గ‌తంలో స్పెష‌ల్ స్టేట‌స్ అన్నారు”
“నాకు గ‌తం కంటే వ్య‌క్తిగ‌త‌మే ముఖ్యం”
“మీ ఫ్యూచ‌ర్ ఏంటి?”
“నేచ‌ర్‌ని బ‌ట్టి ఫ్యూచ‌ర్‌”
“అర్థ‌మ‌య్యేలా చెప్పండి”
“నేనింత కాలం అర్థ‌మయ్యేలా మాట్లాడానా? అర్థాలు తెలిసి మాట్లాడానా?ష కోపం వ‌చ్చింది ప‌వ‌న్‌కి.
అస‌లే జ‌న‌సేన‌, పైగా బీజేపీతో క‌లిసింది, ఎందుకైనా మంచిద‌ని విలేక‌రులు పారిపోయారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి