iDreamPost

RRR & Pushpa : పాన్ ఇండియా సినిమాలకు ఒకే ఇబ్బంది

RRR & Pushpa : పాన్ ఇండియా సినిమాలకు ఒకే ఇబ్బంది

పాన్ ఇండియా లెవెల్ లో భారీ ఎత్తున విడుదల కాబోతున్న ఆర్ఆర్ఆర్, పుష్ప పార్ట్ 1 లు తమ ప్రీ రిలీజ్ ఈవెంట్లను దుబాయ్ లో చేయడాన్ని విరమించుకోవడం దాదాపు ఖాయమే. ఇంటర్నేషనల్ అటెన్షన్ కోసం తొలుత ఇలా ప్లాన్ చేసుకున్నప్పటికీ పరిస్థితులు అందుకు అనుకూలంగా లేకపోవడంతో దాని స్థానంలో ఇక్కడే వివిధ వెన్యూలలో వేడుకలకు ప్రణాళికలు వేస్తున్నట్టు తెలిసింది. ముందుగా పుష్ప సంగతి చూస్తే రిలీజ్ కు కేవలం 22 రోజుల సమయం మాత్రమే ఉంది. ఇంకొద్ది భాగం బ్యాలన్స్ షూటింగ్ జరుగుతోంది. మరోపక్క అడిషనల్ యూనిట్లతో దర్శకుడు సుకుమార్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను చేయిస్తున్నారు.

రోజుకు 24 గంటలు సరిపోనంత టైట్ సిచువేషన్ లో పుష్ప బృందం ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు క్రూ మొత్తాన్ని దుబాయ్ తీసుకెళ్లి అక్కడ ఈవెంట్ చేసేంత సీన్ లేదు. పైగా ఇదంతా చాలా టైంని డిమాండ్ చేస్తుంది. దానికి బదులు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ఈవెంట్ చేసుకుంటూ పోతే మీడియాను సైతం ఎక్కువ సార్లు ఆకర్షించినట్టు అవుతుంది. అందుకే డ్రాప్ అయ్యారట. ఇక దుబాయ్ లో లొకేషన్లు ఏర్పాట్లు సైతం చూసుకొచ్చిన ఆర్ఆర్ఆర్ టీమ్ ది కూడా ఇంచుమించు ఇదే పరిస్థితి. రిలీజ్ డేట్ కి 44 రోజుల గడువు ఉంది అంతే. పాటలు, పోస్టర్లు వచ్చాయి కానీ ఇంకా ట్రైలర్, ఇతరత్రా పబ్లిసిటీ ప్రోగ్రాంలు చాలా ఉన్నాయి.

ఇప్పుడు దుబాయ్ కి వెళ్లడం అంటే చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని. డబ్బు సమస్య కాదు కానీ ఆర్టిస్టులందరికీ అనుకూలమైన డేట్ ని సెట్ చేసుకోవడం తలకు మించిన భారం. అందుకే హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై లాంటి ప్రధాన నగరాల్లో వేర్వేరుగా ఈవెంట్లను చేస్తే దానికన్నా మంచి ఫలితం వస్తుందనే ఉద్దేశంతో రాజమౌళి మనసు మార్చుకున్నట్టు తెలిసింది. మొత్తానికి డిసెంబర్ నుంచి జాతీయ స్థాయిలో మన టాలీవుడ్ సినిమా టాక్ అఫ్ ది నేషన్ గా మారనుంది. వీటి సంగతలా ఉంచితే ఇంత కన్నా టైట్ సిచువేషన్ లో ఉన్న రాధే శ్యామ్ యూనిట్ ఎలాంటి ప్లానింగ్ లో ఉందో వేచి చూడాలి

Also Read : Mahesh Babu :మహేష్ బాబు సినిమాలో చియాన్ విక్రమ్ ?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి