iDreamPost

Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ అరెస్టుపై కన్నీటి పర్యంతమైన తండ్రి..

రైతు బిడ్డగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్.. తన ఆట, అమాయకత్వంతో విజేతగా నిలిచాడు. ఓ సామాన్యుడు సెలబ్రిటీలను పక్కకు నెట్టి కప్ గెలిచే సరికి అతడితో పాటు ఫ్యాన్స్ ఉబ్బితబ్బిబ్బయ్యారు. కానీ అంతలో పెద్ద రచ్చ జరిగింది.

రైతు బిడ్డగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్.. తన ఆట, అమాయకత్వంతో విజేతగా నిలిచాడు. ఓ సామాన్యుడు సెలబ్రిటీలను పక్కకు నెట్టి కప్ గెలిచే సరికి అతడితో పాటు ఫ్యాన్స్ ఉబ్బితబ్బిబ్బయ్యారు. కానీ అంతలో పెద్ద రచ్చ జరిగింది.

Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ అరెస్టుపై కన్నీటి పర్యంతమైన తండ్రి..

వంద రోజులకు పైగా హోరా హోరీగా సాగిన రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ సీజన్ 7లో విన్నర్‌గా నిలిచాడు రైతు బిడ్డ, పల్లవి ప్రశాంత్. సామాన్యుడు, అందరి అభిమానాన్ని చూరగొన్న రైతు బిడ్డ గెలిచాడని తెలిసే సరికి స్టూడియో వద్దకు భారీగా చేరుకున్నారు అతడి ఫ్యాన్స్. నానా హంగామా సృష్టించారు. పోలీసు బలగాలు ఉన్నా.. వారిని సైతం లెక్క చేయకుండా.. ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు. సెలబ్రిటీ కారు అద్దాలు పగులగొట్టారు. రన్నరప్ అమర్ దీప్ ఫ్యామిలీ వస్తున్న కారుపై రాళ్లతో దాడి చేశారు. ర్యాలీ వద్దనా బిగ్ బాస్ హౌస్ నుండి వచ్చిన పల్లవి ప్రశాంత్.. ర్యాలీ చేశాడు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం జరిగి.. రచ్చ జరిగింది.

ఈ మొత్తం ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్, అతడి సోదరుడ్ని అదుపులోకి తీసుకుని, కోర్టులో హాజరు పరిచారు. అతడికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇదిలా ఉంటే.. అతడి అరెస్టుపై పల్లవి ప్రశాంత్ తండ్రి కన్నీటి పర్యంతం అయ్యారు. ‘ ప్రశాంత్ బిగ్ బాస్ విన్నర్ అవ్వడం పట్ల చాలా సంతోషించా. 5 గంటలే ఆ ఆనందం మిగిలింది. ఇప్పుడు చాలా బాధగా ఉంది. వ్యవసాయం చేసుకుంటూ.. ఊర్లో ఉంటే బాగుండేది కదా అనిపిస్తుంది. నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. లేనివి ఉన్నలేనివి రాస్తున్నారు.’ అని పేర్కొన్నారు. ‘ఈ గొడవతో నా కొడుక్కు ఎలాంటి సంబంధం లేదు. పక్కనే నేను కూడా ఉన్నా. నాకు వాంతులు కూడా అయ్యాయి. అదే సెలబ్రిటీలు విన్ అయితే.. పోలీసులు సరైన చర్యలు తీసుకునే వారు కదా.. మేము రైతు బిడ్డ కదా అని అందుకే వాళ్లు పట్టించుకోలేదు’. అని పేర్కొన్నారు.

అలాగే పల్లవి ప్రశాంత్ పరారయ్యాడన్న విషయంపై తండ్రి మాట్లాడుతూ..‘ మావాడు ఎక్కడికి పోలే. ఇంట్లోనే ఉన్నాడు. నేను పరారయ్యాడని ఎక్కడా చెప్పలేదు. కానీ కొందరు కావాలనే పారిపోయిండని రాసిర్రు.’అని తెలిపారు. అరెస్టు చేసేందుకు ఇంటికి వచ్చి.. ‘రావాలి బాబూ రావాలి అంటూ మెడపై చేయి వేసుకుని తీసుకువచ్చారు పోలీసులు. అంగీ మార్చుకుని వస్తా  సార్ అంటే.. మంచిగా ఉంది కదా అన్నారు. మేము మారుమూల గ్రామంలో చిన్న రైతులం. ఏం చేయాలో అర్థం కావడం లేదు. నా భార్యకు ఆరోగ్యం కూడా బాగోలేదు. ఆమె ఏడుస్తుంది. తలకొట్టుకుంది. మా కొడుకులపై కేసులు పెట్టి లేని బాధలు తెచ్చారు’ అంటూ కన్నీరు పెట్టుకున్నారు.

ఏం చెప్పకుండా.. మెడలు పట్టుకుని ఓ దొంగలా తన కొడుకును తీసుకుని వస్తుంటే.. ఎంతో బాధగా ఉందని అన్నారు. తన కొడుకు మంచి వాడు, బుద్ది మంతుడని, అందుకే బిగ్ బాస్‌లోకి వెళ్తానంటే.. పంపించినాం. విన్నర్ అయ్యాడు. ఐదు గంటలు సంతోషంగా ఉన్నాం. ఆ తర్వాత బాధగా మారిపోయింది. అతడిపై కేసులు పెట్టిన వాళ్లు.. కేసులు వాపస్ తీసుకోవాలంటూ వేడుకున్నారు తండ్రి. తండ్రి చెబుతున్న ప్రకారం.. పోలీసులు అతడి పట్ల తీసుకున్న చర్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి