iDreamPost

World Cup: పాండ్యాపై పాక్‌ జర్నలిస్ట్‌ ఆరోపణలు! చీటింగ్‌ అంటూ..

  • Published Oct 14, 2023 | 7:44 PMUpdated Oct 14, 2023 | 7:44 PM
  • Published Oct 14, 2023 | 7:44 PMUpdated Oct 14, 2023 | 7:44 PM
World Cup: పాండ్యాపై పాక్‌ జర్నలిస్ట్‌ ఆరోపణలు! చీటింగ్‌ అంటూ..

టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాపై ఓ పాకిస్థాన్‌ జర్నలిస్ట్‌ సంచలన ఆరోపణలు చేశాడు. పాండ్యా చీటింగ్‌ చేసి ఆడుతున్నాడంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. ప్రస్తుతం ఆ పాక్‌ జర్నలిస్ట్‌ చేసిన కామెంట్స్‌ ప్రస్తుతం క్రికెట్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ పాక్‌ జర్నలిస్ట్‌ చేసిన ఆరోపణ ఏంటంటే.. హార్దిక్‌ పాండ్యా చేతి వేళ్లకు ఏదో బ్యాండ్‌ పెట్టుకుని బౌలింగ్‌ వేస్తున్నాడని, ఇది ఐసీసీ నిబంధనలకు విరుద్ధం కాదా? అంటూ పేర్కొన్నాడు. ఇది కచ్చితంగా చీటింగ్‌ చేసి ఆడటమే అవుతుందని అంటున్నాడు.

వన్డే వరల్డ్‌ కప్‌లో భాగంగా ఇండియా-పాకిస్థాన్‌ మధ్య అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌ సందర్భంగా పాక్‌ జర్నలిస్ట్‌ ఈ కామెంట్‌ చేశాడు. అయితే.. పాకిస్థాన్‌తో మ్యాచ్‌ అనే కాదు.. ఇంతకుముందు ఆఫ్ఘనిస్థాన్‌తో ఆడిన మ్యాచ్‌లో కూడా పాండ్యా తన వేళ్లకు ఆ బ్యాండ్‌ ధరించి ఆడాడు. గతంలో కూడా అలాంటి బ్యాండ్‌ పెట్టుకుని ఆడాడు. కాగా, ఆ బ్యాండ్‌తో పాండ్యాకు బాల్‌పై అదనపు గ్రిప్‌ దొరుకుతుందని, అందుకే అంత ఎఫెక్టివ్‌గా బౌలింగ్‌ చేస్తున్నాడనే అనుమానం వ్యక్తం చేశాడు.

అయితే.. పాండ్యా ఆ బ్యాండ్‌ వాడటానికి కారణం గ్రిప్‌ కాదు. అతని వేళ్లకు గాయమవ్వడంతో పాండ్యా ఆ బ్యాండ్‌ ధరిస్తున్నాడు. సాధారణంగా ఆటగాళ్ల వేళ్లకు చాలా గాయాలు అవుతుంటాయి. బాల్‌ తగిలినప్పుడు లేదా ఫీల్డింగ్‌ చేస్తున్నప్పుడు ప్లేయర్లు గాయపడుతుంటారు. ఆ సమయంలో వాళ్లు బ్యాండెజ్‌లు చుట్టుకుంటారు. అయితే.. ఆఫ్ఘనిస్థాన్‌తో మ్యాచ్‌లో బ్యాటర్‌ స్ట్రేయిట్‌గా కొట్టిన షాట్‌ను ఆపే ప్రయత్నంలో పాండ్యా చేతి వేళ్లకు బలమైన గాయమైంది. దాని కోసమే పాండ్యా బ్యాండ్‌ ధరించాడు కానీ, గ్రిప్‌ కోసం కాదని క్రికెట్‌ అభిమానులు ఆ పాక్‌ జర్నలిస్ట్‌కు కౌంటర్‌ ఇస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: IND vs PAK: రోహిత్‌ ఖాతాలో అరుదైన మైల్‌స్టోన్‌!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి